Previous Page Next Page 
రామాయణము పేజి 16

                                 

    మంత్రులలో 'జాబిలి' యను బ్రాహ్మణుడు కలడు. అతడు "రామచంద్రా నీకు నీ జనుకునితో గల సంబంధము అయన మరణముతో విడిపోయినది. భరతుడునూ ఈతనితో వచ్చిన మేమందరమునూ అయోధ్యకు వెంటనే మాతో తిరిగి రమ్మని నిన్ను అర్ధించుచున్నాము. పితృవాక్య పరిపాలనమును గూర్చి తలపోయుచూ ఈ అరణ్యమున పదునాల్గు వత్సరముల కాలమును వృధాచేయకుము"
    రామునకు జాబాలి వచనములు అత్యంత అగ్రహమును కలిగించినవి. అతడు జాబాలితో "నామ మాత్ర బ్రాహ్మణుడా! నీవు ధర్మవిరుద్ధముగా పలికినావు! నీ వంటి నాస్తికుని చేరదీసి మా తండ్రి పొరపాటును చేసినారు!" అన్నాడు.
    వసిష్టుడు రాముని శాంతింపజేసి "రాఘవా ఈ సాచివొత్తముడు నాస్తికుడు కాడు. ప్రజల హితమును కోరి ఈతడు నిన్నేటులైన అయోధ్యకు రప్పించవలేనని అట్లు కోరినాడు. భరతుడు నన్ను కూడ తనతో తీసుకొని వచ్చుటకు కారణమూ నిన్ను అయోధ్యకు రప్పించి సింహననాసీనుని చేయుటయే. కనుక నేను చెప్పదలచినదియూ వినుము. నీవు సూర్యవంశోద్భవుడవు. తండ్రి యనంతరము జేష్టపుత్రుడు రాజగుట సూర్య వంశజుల సంప్రదాయము. నీవునూ ఆ సంప్రదాయ ముననురించవలేనని భరతుడు కోరుచున్నాడు..... ఇనుకుల తిలకుడవగు నీవు ఎవ్వరేమడిగిననూ కాదనక లేదనక ఇచ్చినావు. మాతో  వచ్చిన ప్రముఖలందరునూ ఐక్య కంఠమున నిన్ను మరలి రమ్మని ప్రాధేయపడుచున్నారు. వారి ప్రార్ధనను అంగీకరించుము" అన్నాడు.
    శ్రీరాముడేవరెంత చెప్పిననూ తాన నిశ్చయమును   మార్చుకోనలేదు. భరతుడు "శ్రీరామచంద్రుడు లేని అయోధ్య సింహము లేని గుహ వంటిద " ని భావించినాడు. అతడు రామునితో  "అగ్రజా మీరు మువ్వురునూ అరణ్యము నుండి తిరిగివచ్చు వరకునూ నేను అయోధ్యను ప్రవేశించను. సమీప మందలి నండి గ్రామమున  వసించిచూ అచట నుండియే రాజ్యభారమును వహించేదను. రాజలాంఛనములకూ భోగములనూ  వర్ణించిజటాజినధారినై ఫలములనూ కందమూలములనూ తినుచూ కాలమును వెళ్ళబుచ్చేదను" అన్నాడు.
    రాముడు భరతుని భ్రాతృభక్తికి స్పదించి అతని కౌగలించుకొనెను. భరతుడు "అన్నా నీ పాదుకలను నాకు ప్రసాదించుము. వానిని నిత్యమూ పుజించుచు నిన్ను ప్రత్యక్షము చేసికొను చుందును" అన్నాడు. రాముడు తన పాదుకులను తీసి భరతునకందించినాడు.
    భరతుడు తెచ్చిన సేనలో 'శత్రుంజయము' అను ఏనుగు ఉన్నది. భారతుడు శ్రీరాముని పాదుకలకు ప్రదక్షణము చేసి వాటిని ఆ భద్రగజము అమ్బారిలో ఉంచినాడు.
    సీతారామలక్ష్మణులనుండి వీడ్కోలును పొందిభరతుడు తిరుగు ప్రయాణమైనాడు.
    వారందరునూ 'నంది గ్రామము' ను చేరుకొన్న పిమ్మట భరతుడు ఒక శుభలగ్నమున రత్నఖచిత సువర్ణ సింహాసనమున శ్రీ రాముని పాదుకుల నుంచి వాటి కత్యంత వైభవోపేతముగ పట్టాభిషేకమును జరిపించినాడు. నాటి నుండియూ అతడు రాజ్యమునకు సంబంధించిన ప్రతి విషయమునూ సింహాసనము ముందు నిలిచి పాదుకలను విన్నవించి పిమ్మట నిర్ణయములను ధర్మసమ్మతముగా చేయుటకు ధర్మ నిలయుడగు శ్రీరామ ప్రభువు పాదుకులు తనకు తోడ్పడునని. అతడు విశ్వసించేను.
     విధి చేయిదములు విచిత్రమైనవి. దశరథుడు రామునకు పట్టము గట్టదలచినాడు. కైక భరతుని అభిషిక్తుని చేయబూనినది; తుదికా వైభవము పాదుకలకు  దక్కినది!
                              విరాధుడు


   
    రాముడు లక్ష్మణునితో "తమ్ముడా మనమీచిత్రకూటముననే ఉండిపోయినచో అయోధ్య నుండియూ, నంది గ్రామము నుండియూ పౌరులిచ్చటకు రాకపోకలను జరుపుచునే యుందురు. ప్రజలకు దూరముగా నండుటకు మనమీచిత్రకూటమును వదలి దండకారణ్యమునకు పోవలెను"
    లక్ష్మణుడు : అట్లే చేయుదము.
    దండకాటవికి పోవు దారిలో వారికి అత్రి మహాముని ఆశ్రమును ఎదురైనది. మినీ ధర్మపత్ని యగు అనసూయాదేవి. పతియే దైవమని రామునితో వనవాసమునకు వచ్చిన మైథిలిని మెచ్చుకొన్నది;
    అంగరాగమునూ, అనులేపనమునూ,  క్రొత్త కొకనూ ఇచ్చినది. ఆభరణములనూ ఒక దివ్యపుష్పమాలికనూ ఒసగి "భూపుత్రీ, ఈ పూలమాల వాడదు. దీనిని నీవు ధరించుము. సువాసనలను వేదజల్లుచూ నీ దేహకాంతిని ఇనుమడించును" అనెను. సీత అనసయాదేవికి తన కృతజ్ఞతను తెలుపుచూ నమస్కరించి ఆమె ఆశీర్వదమును పొందినది..... మరునాటి పాత్రః కాలమున రాముడు ముని దంపతుల వద్ద నుండి వీడుకోలును పొంది సీతయూ సౌమిత్రయూ వెంట రాగా మేఘ  మండలమును చొచ్చు భానుని వలె దండకాటవిని ప్రవేశించినాడు.
    సీతారామ లక్ష్మణుల యాగమనము  దండకారణ్యము నందలి మునులకు అత్యంత ఆనంద ప్రదమైనది. తమకు రాక్షసుల వలన కలుగుచున్న పీడను తొలగించుటకు శ్రీమహావిష్ణువే రాముడుగా అవతరించి వచ్చేననియూ, సీత శ్రీదేవియే యనియూ మునులకు తెలియును. ఆ ముప్పురకును తారసిల్లిన ప్రతి ఆశ్రమమందునూ స్వాగతమునూ ఆతిధ్యమునూ లభించినవి.
    వారు మువ్వురునూ పాదచారులై అరణ్య మధ్య మనకు పువుచుండగా నొకచోట మహా భయంకరుడగు రాక్షసుడొకడు ప్రత్యక్ష్యమైనాడు. దిక్కులు పిక్కటిల్లునట్లు కేకలు వేయుచున్నాడు, గుహా వంటి నోరునూ గుంట కన్నులనూ, కొండంత దేహమునూ, మిట్ట పల్లములుగా ఉన్న పెద్ద పొట్టయూ, ఎక్కువ తక్కువులుగా ఉన్న అవయవములనూ గల ఆ వికృత రూపుడు పులి తోలుసు కౌపీనముగా పెట్టుకునివాడు. రెండు తోడేళ్ళూ,  మూడు పెద్ద పులులూ నలుగు సింహములూ ఒక ఏనుగు తలయూ విడివిడిగా గ్రుచ్చుయున్న రక్తసిక్తములగు శూలములను పట్టుకుని యున్నాడు. 

 Previous Page Next Page