"నటాషా చాలా లక్కీ "
'ఎందుకు?"
"మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. చిన్నప్పుడు మీరు చేసిన వన్నీ."
"మైగాడ్ అన్నీనా?"
'అవును" అని అతని మొహంలోకి చూసి అర్ధం చేసుకుని మళ్ళీ నవ్వేసిందామే "వెల్ ! అన్నీ అంటే - చాలా చెపుతుండేది. అని అన్నీనో కొన్నో మాత్రం తెలీదు. ఏదేమయినా చిన్నప్పుడు అంత క్లోజ్ గా వున్నవాళ్ళు యిన్నేళ్ళ తరువాత కలుసుకోవడం చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది. నాక్కూడా చిన్నప్పుడు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. పేరు శ్రీకాంత్. ఇద్దరం ఎంత క్లోజో చెప్పల్లెను, వాడు మళ్ళీ కనబడితే బాగుండునని ఎంతో ఆశగా వుంటుంది నాకు. కనబడితే ఎంతో హాపీగా గడపవచ్చు కదూ?"
"చూడండి! ఇందాకటి నుంచి మీకు నిజం చెప్పాలా, వద్దా అని తటపటాయిస్తున్నాను."
"ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగిందామె.
"నేనే శ్రీకాంత్ ని.'
ఆమె లేచి కూర్చుని మరీ నవ్వసాగింది.
"శ్రీకాంత్ కనబడితే హాపీగా గడుపుతానన్నారుగా . ఇంకా ప్రారంభించరే?"
"మీరు నిజంగా వండర్ పుల్ కంపెనీ" అంది నవ్వుతూ.
నటాషా బాత్రూం లోంచి బయటికొచ్చింది.
తెల్లని పాలరాయిలాంటి శరీరం మీద వైలట్ కలర్ చీర కళ్ళకు మత్తు కలిగిస్తోంది కాంబినేషన్.
"ఏమిటి? రాజ్యలక్ష్మి నిద్ర చెడగోట్టావా?" సురేష్ ని అడిగిందామె.
రాజ్యలక్ష్మి నవ్వేయసాగింది. మళ్ళీ "హి ఈజ్ రియల్లీ క్రేజీ.'
"నటాషా డ్రస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది.
రాజ్యలక్ష్మి పడుకునే ఫోన్ అందుకుంది.
"హలో రవి! ఏమిటి? ఇప్పుడా? ఓ.కే! నో ప్రాబ్రం. రడీ అవుతాను. అరగంట తర్వాత కారు పంపించు. ఓ.కే సీయూ."
నటాషా రడీ అయింది.
"వెళదామా?"
"ఓ!"
ఇద్దరూ బయటకి నడిచారు.
తలుపు వేసేముందు రాజ్యలక్ష్మి వేపు చూశాడు సురేష్.
బద్దకంగా వళ్ళు విరుచుకుంటోందామె.
"విష్ యూ హాపీ రవి' అనేసి తలుపు మూసేశాడు.
ఆటోలో సినిమా హాల్ కి చేరుకున్నారు.
"నైన్త్ క్లాస్ అయ్యాక ఎక్కడికి వెళ్ళిపోయావు?' అడిగింది నటాషా.
"చాలా చోట్లకు. కాకినాడ, విజయనగరం, విశాఖపట్నం, కర్నూల్ అనంతపురం, సూర్యాపేట."
"ఎందుకలా?"
"బ్రతుకుతెరువు నాన్న చనిపోయాడు. అమ్మతో మామయ్య దగ్గరకూ పిన్ని దగ్గరకూ , పెద్ద్దమ్మ దగ్గరకూ, ఎక్కడ ఎన్నాళ్ళు వుండాలనిపిస్తే అక్కడ అన్నాళ్ళు.'
ప్చ్! హరిబుల్ లైఫ్ కదూ?"
'కొంతవరకూ" ఇద్దరూ పూర్తిగా ఆ రోజుల్లో కెళ్ళి పోయారు.
"నీకు మార్కేండయులుగారు గుర్తున్నారా? క్రాపేట్ టీచర్?" అడిగింది నటాషా.
"ఎలా మర్చిపోతాను? మనిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు కదా' నటాషా నవ్వేయసాగింది.
"ఒకటా , రెండా వారం రోజులు స్కూలు ఎగ్గోట్టేశాం. వెళితే పట్టుకుని హెడ్ మాస్టర్ దగ్గరకు లాక్కేళతారేమోనని."
"ఈ మధ్య అయన కనిపించాడు వైజాగ్ బీచ్ లో" చెప్పిందామె."
సురేష్ ఆశ్చర్యపోయాడు.
"నిన్ను గుర్తు పట్టారా?"
"కొంచెం కూడా గుర్తులేదాయనకు. ఆఖరికి ఆ రోజు మనల్ని పట్టుకున్న విషయం గుర్తు చేశాను."
"ఏమన్నారు?"
"అలా ఎంతో మందిని పట్టుకున్నాట్ట."
ఇద్దరూ నవ్వేయసాగారు.
"ఆ తరువాతే మైంది?" వెనుక సీట్లో కుర్చున్నతను అడిగాడు నెమ్మదిగా.
ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశారు. ముసలాయన చిరునవ్వు నవ్వాడు.
"మరేం లేదు. నేను నిజంగా సినిమా చూడాలని వచ్చాను. తెర మీద సినిమా! ముందు సీట్ల మీద సినిమా కాదు.'
"మా సినిమా ఇంకా ప్రారంభమవలేదు కదా?" అన్నాడు సురేష్.
ముసలాయన మళ్ళీ నవ్వాడు. "టైటిల్స్ అవుతున్నాయ్ కదా!"
"పద - ఆ కార్నర్ కెళ్ళి కూర్చుందాం" అంది నటాషా. ఇద్దరూ లేచి ఖాళీగా ఉన్న మరో చోట కూర్చున్నారు.
"ఇంటర్వల్ లో ఇద్దరూ కూల్ డ్రింక్స్ తాగుతుంటే ముసలాయన పక్కనే నిలబడి సిగరెట్ తాగుతున్నాడు.
"మీరు క్రాప్ ట్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు కదూ?" అడిగాడు సురేష్.
"మీరు కూడా రెడ్ హ్యాండెడ్ గా ఎవర్నయినా పట్టుకున్నారా?" అతను నవ్వాడు. "సెవెరల్ టైమ్స్.'
నటాషా నవ్వుతోంది.
సినిమా అయ్యే లోపల బాల్యంలోకి ప్రస్తుతంలోకి అనేక వందల సార్లు ప్రయాణం చేశారు.
"ఓసారి తులసిని చూడాలని వుంది" అందామె హల్లో నుంచి బయటికొస్తూ.
"వెల్ కమ్"
"ఇప్పుడు కాదు, మరోసారి హైదరాబాద్ వచ్చినప్పుడు.'
"అంటే.........?"
"ఎల్లుండి బాంబే వెళ్ళిపోతున్నాను."
"ప్రిమ్మినిస్టర్ కంటే బిజీ షెడ్యుల్ లాగుంది నీది."
ఇద్దరూ ఆటోలో కూర్చున్నారు.
"నన్నుహోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపో."
"అటో చార్జ్ ఎవరిస్తారు?"
"నేనే" నవ్వుతూ అందామె.
"డార్క్ డెవిల్ ని చూస్తే జాలేస్తుంది నాకు" అందామె.
'అవును. వాడేలా భరిస్తున్నాడో తెలీదు."
"తాగి!"
"అయుండవచ్చు."
అతోవాడికి ఇరవై రూపాయల నోటు యిచ్చిందామే.
"సీయూ."
ఆటోలో ఇల్లు చేరుకున్నాడు . గంగాభవాని అతను ఆటోలో నుంచి దిగటం ఆశ్చర్యంగా చూసింది.
తులసి కరాటే ప్రాక్టీస్ చెసుకుంటుంది. సురేష్ బట్టలు మార్చుకుని ఆమె కెదురుగా కూర్చుని నిశ్శబ్దంగా చూడసాగాడు. ఆమెకు కరాటే స్కూల్ ప్రారంభించాలని కోరిక. ఎన్నోసార్లు సురేష్ తో చెప్పింది.
"ఎలా వుంది?" ఆపి ఒగరుస్తూ అడిగింది.
"రేప్ చేయాలనిపించే అంత ఎట్రాక్టివ్ గా ఉంది.'
"ఈ లిప్ స్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది?"
"నిజం చెప్పేస్తున్నాను. మా నటాషా కనిపించింది. ఇద్దరం సినిమా కెళ్ళాం. ఆ తర్వాత హోటల్లో ఆమె రూమ్ కి వెళ్ళాం. ఏ.సి రూమ్ చల్లగా, నటాషా వెచ్చగా కనిపించింది. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాక అలా.......అలా.....ప్రేమ కలాపాలలో పడిపోయి మునిగి తేలేటప్పటికి ....."
"నేన్నమ్మను. డార్క్ డెవిల్ దగ్గర ఇంతసేపు గడిపి, కావాలని ఈ కధ అల్లుకొచ్చావ్ కదూ?"
"డార్క్ డెవిల్ అంటే ఎందుకంత కోపం నీకు?"
"తాగుబోతులంటే నాకు అసహ్యం."
"కానీ వాడు తాగటానికి రీజనుంది."
"ప్రతి తాగుబోతు అలాగే అనుకుంటాడు."
"నాకు ఆకలేస్తుంది. భోజనం చేద్దామా?"
"ఇందాకటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంట్లో కూరలు లేవు."
"నేను కూరగా బావుంటానా?"
"త్వరగా తీసుకోస్తావా?"
ఆమె సంచీ తెచ్చిచ్చింది. దాంతో పాటు డబ్బు యివ్వలేదు. అంటే ఆమె దగ్గర బ్యాలెన్స్ 'నిల్' అన్నమాట.
బయటకు వెళ్ళి అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చాడతను.
"ఇంత త్వరగా వెళ్ళి వచ్చేశావా?"
"అవును"
"సంచి క్రుమ్మరించిందామె.
బీరకాయలు , బీన్స్.
"తాజాగానే ఉన్నాయ్ గానీ , అంతా సూపర్ సరుకు! రుచి వుండదు" అంది తులసి.
"నీకెలా తెలుసు సూపర్ వేశారని?"
"చూస్తే తెలీటంలా - తెగ బలిసిపోయి వున్నాయి. ఎబ్ నార్మల్ గ్రోత్."
"అయితేనేం?"
"హెల్త్ కి మంచిది కాదు"
రాత్రి పది గంటలగ్గాని భోజనం రడీ అవలేదు.