"సాయంత్రం మహేష్ వచ్చాడింటికి" భోజనం చేస్తూ అంది తులసి. సురేష్ నోట్లో పెట్టుకున్న అన్నం ముద్ద నమలకుండానే మింగేశాడు.
"ఓ - వచ్చాడా? వెరీ కైండాఫ్ హిమ్."
"అతని భార్య ఎవరితోనూ లేచిపోలేదు."
సురేష్ కి గుర్తుకొచ్చింది. ఇన్ కంటాక్స్ కుర్రాడితో లేచిపోయిందని చెప్పాడు తానూ తులసికి.
"లేదా? ఎందుకని? మహేష్ లాంటి డల్ ఫెలోకి భార్యగా వుంటూ లేచిపోకుండా వుండటం సాధ్యం కాదే?"
"నువ్వు చెప్పిన విషయం అడిగి నేను చాలా అక్ ఫర్డ్ పొజిషన్ లో పడ్డాను. పాపం మహేష్ కూడా ఇబ్బందిగా ఫీలయ్యాడు.'
"హు! నేను చెప్పలేదూ మహేష్ వట్టి ఇడియట్ అని నేనయితే నువ్వే పొజిషన్ లో వున్నా లైక్ చేస్తాను."
తులసి కిలకిలా నవ్వేసింది.
"మహేష్ పోయిట్రీ రాశాడు తెలుసా?"
"ప్రియుడా నీకో దండం అని పేరు పెట్టి వుంటాడు."
"కాదు, పేరేదో వుంది గానీ చాలా అద్భుతంగా రాశాడు."
"అంటే దాని ఇంగ్లీష్ ఒరిజినల్ తప్పకుండా చదవాలి మనం"
"యు ఆర్ సో జేలస్ ఆఫ్ హిమ్" చిరుకోపంతో అంది తులసి.
టేబుల్ లైట్ వెల్తురులో పడుకుని బి.ఇ.డి పుస్తకాలు చదవసాగిందామే.
సురేష్ కాసేపు అటూ ఇటూ పొర్లాడు.
"డోంట్ డిస్టర్బ్ మీ" అందామె అతని చేతిని తీసివేస్తూ.
"నిన్నేమీ డిస్టర్బ్ చేయకుండానే మానేజ్ చేస్తాను."
"వద్దు"
"నువ్వు మీ మహేష్ - ఇందాక ఎంజాయ్ చేశారు కదూ?"
"షటప్"
గిలిగింతలు భరించలేక చేతిలోని పుస్తకాన్ని జారవిడిచేసింది.
"ఇలా అయితే ఇంక నేను చదివినట్లే"
"ఇది కూడా చదువే! ఆ అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. మన దేశంలో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ డోస్ పెంచేస్తున్నారట. త్వరలో నువ్వు టీచరయితే మరి ఎలా చెప్తావు ఆ సబ్జెక్ట్?"
తులసి ఆవేశంగా అతన్ని గుండెలకు హత్తుకుంది.
* * * *
ఉదయం సురేష్ గడ్డం చేసుకుంటుంటే గంగాభవాని విసురుగా వచ్చింది ఇంట్లోకి.
"మా పాదులకున్న బీరకాయలు, బీన్స్ కోసింది మీరే కదూ?" అంది ఇద్దరినీ గుచ్చి గుచ్చి చూస్తూ.
తులసి తెల్లబోయింది.
సురేష్ గెడ్డం చేయటం ఆపలేదు. ఆమె వంక చూడనూ లేదు.
గంగాభవాని సురేష్ కెదురుగా వచ్చి నిలబడింది.
"ఇది మీ పనేనని నాకు తెలుసు" అంది కోపంగా.
"అవును కాదని ఎవరన్నారిప్పుడు?"
"అలా చేయడానికి మీకు సిగ్గనిపించాలేదూ?"
"మాకెందుకు సిగ్గు అలా సూపర్ వేసి వాటిని పెంచినందుకు మీరు సిగ్గుపడాలి."
"సూపర్ వేశానని మీకెలా తెలుసు?"
"చూస్తే తెలీటం లేదు? తెగ బలసిపోయి ఎబ్ నార్మల్ గ్రోత్"
"అయితేనేం?"
"హెల్త్ కి మంచిది కాదది. ఇంకోసారి సూపర్ వేయకండి! మా కిష్టం లేదు సూపర్ సరుకు."
తులసి నవ్వేసింది.
"మీరెవరు ఇష్టపడడానికి?" అడిగింది గంగాభవానీ కోపంగా.
"వాటిని ఉపయోగించేవాళ్ళం"
"ఇంకోసారి అలా చేశారంటే బావుండదు ఇప్పుడే చెప్తున్నాను" అందామె వెళ్ళిపోతూ.
"అయితే కూరగాయల రకాలు పెంచండి. ఒకటే రకం వాడటం మాకూ చిరాకే."
ఆమె విసురుగా నడిచింది బయటకు.
"సూపర్ కూడా వేయకండి ఇప్పుడే చెప్తున్నాను.'
తులసి ఆఫీస్ కెళ్ళి పోయింది.
సురేష్ మరికాసేపటి తర్వాత రడీ అయి బయటికొచ్చి తలుపుకి తాళం వేస్తుంటే గంగాభవాని పాదుల దగ్గర్నుంచి లేచి కోపంగా ఇంట్లో కెళ్ళిపోయింది. ఆమె వెనుకే లోపలకు నడిచాడతను.
"ఎక్కడికొస్తున్నారు?"
"తాళం చేతులు ఇవ్వటానికి"
"దాని కోసం లోపలకు రానక్కరలేదు"
"నిజం చెప్పాలంటే నేను దాని కోసం రాలేదు."
"మరి?"
"మీకోసం " ఆమె చేయి పట్టుకుని చటుక్కున దగ్గరకు లాక్కున్నాడు. అతని కౌగిట్లో ఇమిడిపోయిందామె.
"ఏయ్! ఏమిటది?" అంది రోషంగా.
"నాంది అంటారు దీన్ని! తరువాత ప్రస్తావన తరువాత...."
అతని చేతుల్ని విదిలించుకొబోయిందామే.
"గంగాభవానిగారూ!" అంటూ లోపలకు రాబోయిన పక్కింటి కమల ముఖం ఎర్రగా చేసుకుని వెనక్కు తిరిగి పరుగెత్తింది.
సురేష్ చటుక్కున ఆమెను వదిలేశాడు.
"నాకిలాంటివి నచ్చవు " మండిపడుతూ అందామె.
"నిజానికి నాకూ నచ్చవ్- డైరెక్టుగా అసలు విషయంలోకి కెళ్ళడమె నేనూ లైక్ చేస్తాను - కానీ తప్పదు. ఫార్మాలిటీస్"
"తులసి లాంటి అందమయిన భార్యను పెట్టుకుని సిగ్గుపడాలి.'
"ఊ అనండి! తులసిని రేపే వదిలేస్తాను.'
"ఆ!' అడిరిపదిందామె.
"అంటే ఎల్లుండి మళ్ళీ తీసుకొస్తాను లెండి! రోజు విడిచి రోజు - బయటికొచ్చేశాడు.
బ్యాంక్ లో ఉదయం స్టార్ట్ అవ్వాల్సిన ఇంటర్వ్యు మధ్యాహ్నం రెండింటికి స్టార్టయ్యింది.
"కమిన్ మిస్టర్ సురేష్ టేక్ యువర్ సీట్!"
"థాంక్యు!"
"సో యూ లైక్ బ్యాంక్ జాబ్"
"నో! అయ్ లైక్ మాన్స్ జాబ్"
ముగ్గురూ ఉలిక్కిపడ్డారు.
"వాట్ మాన్స్ జాబ్?"
"మాన్స్ జాబ్ టువార్డ్స్ వుమెన్!"
ఒకరికి అర్ధమయింది - మిగతా ఇద్దరికీ మతులు పోతున్నాయ్.
"మీరే బ్యాంక్ ఆఫీసర్ అనుకోండి! కొత్త స్కీమ్ ఏమయినా ప్రవేశపెట్టగలరా?"
"ఓ మనీ సర్క్యులేషన్ స్కీమ్ పద్దతిలో నా దగ్గర ఇంకో స్కీమ్ వుంది. చాలా కాలం అలోచించి, ఎంతో రిసెర్చ్ చేసి తయారుచేశాను."
"ఏమిటది?"
"ఉమెన్ సర్క్యులేషన్ స్కీమ్"
మళ్ళీ ఉలికిపాటు ముగ్గురిలోనూ!
"వ్వాట్!"
"అవున్సార్! న్యూ డిస్కవరీ ది ఓన్లీ స్కీమ్ ఆఫ్ ఇట్స్ కైండ్! ప్రపంచంలో ఎక్కడా ఎవరూ కనిపెట్టలేదు."
"ఏమిటది?"
"ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సౌభాగ్యం ఇదే నా స్కీమ్ మోటో! మనీ సర్క్యులేషను స్కీమ్ లో లాగ ఇందులో డబ్బు ఒక్క పైసా ఖర్చు చేయనవసరం లేదు. నేను పంపే లిస్ట్ తీసుకుని అయిదు కాపీలు తీసి మీ మగ ఫ్రెండ్స్ కి పంపండి. తరువాత లిస్ట్ లో టాప్ లో ఉన్న పేరు గల వ్యక్తీ చిరునామాకు మీ భార్యను పంపించాలి. ఇలా కొంతకాలం గడిచాక మీ పేరు లిస్ట్ టాప్ కి చేరుకుంటుంది. మీకు 26, 132 మంది స్త్రీలు దొరుకుతారు . టోటల్ హాపినెస్! చూశారా! మిగతా స్కీమ్స్ లో లాగానే ఈ స్కీమ్ కూడా అందరూ ఆసక్తిగా ఫాలో అయితేనే ఫలితాలు బావుంటాయి. ఒకవేళ ఎవరయినా చైన్ తెంపేస్తే - వాడి భార్య వాడికి తిరిగి వచ్చేస్తుంది - హెల్.'
"యూ కెన్ గో"
సురేష్ బయటికొచ్చేశాడు. రోడ్ మీద ట్రాఫిక్ విపరీతంగా వుంది.
సురేష్ నుంచున్న చోట ఓ సిటి బస్ సడెన్ బ్రేకులతో ఆగిపోయింది.
అందులో నుంచి కండక్టర్ ఓ వ్యక్తిని బయటకు తోయగానే బస్ మళ్ళీ స్తార్టయిపోయింది.
అతనిని వెంటనే గుర్తుపట్టాడు సురేష్.
"ఒరేయ్ - డార్క్ డెవిల్!"
డార్క్ డెవిల్ తూలుతూ సురేష్ దగ్గరకొచ్చాడు.
"బాస్టర్డ్ టికిట్ కి పైసలు లేవంటే బస్ దింపేశాడు.'
సురేష్ డార్క్ డెవిల్ భుజం మీద చేయి వేశాడు.
"పద! వెళ్దాం" అన్నాడు ఆప్యాయంగా.
ఇద్దరూ పుట్ పాత్ మీద నడవసాగాడు.
"ఒర్ డార్క్ డెవిల్! ఏమిట్రా ఈ లైఫ్? ఎంత కాలం రా ఇలా?" జాలిగా అడిగాడు సురేష్.
"ఇంకొద్ది రోజులేనా! అంతే! ఆ తరువాత అంతా క్లోజ్! వాడి అట కట్టు - మన లైఫ్ కట్ అంతే!"
"అంటే?"
"మా ఫామిలీని అన్యాయం చేసి ఆస్తి కాజేసిన ఆ దుర్మార్గుల్ని నేను వదలను. మా పెద్దన్నాన్ననూ , వాడి కొడుకునీ అందరినీ స్మాష్ చేయడానికి ఒక ప్లాను వేశాను.''
సురేష్ ఉలిక్కిపడ్డాడు.
"ఏమిటది?" ఆత్రుతగా అడిగాడు.