"అయితే సాయత్రం బీచ్ లో ఎదురుచూస్తుంటాను" అన్నాడతను.
'అలాగే' అన్నట్టు ఆమె తలూపడం, వెన్నెంటనే అతడి చేతిలోని ఆమె పవిత జారిపోవడం జరిగాయి.
వెంకట్రామయ్యని సాయంత్రం భీచ్ లో కలుస్తానని చెప్పి వేల్లడం వెళ్ళిందిగాని గడుస్తున్నాకొద్దీ ఎక్కడలేని విస్సత్తువ ఆమెను ఆవరించింది. లేగదూడలాంటి అ పసివాడ్ని విడిచివుండే ఆలోచనను దగ్గరకు రానివ్వలేకపోతుంది_ అలాగని వెంకట్రామయ్యని వదులుకోనూలేకపోతుంది. అంతకుమించి సాయంత్రం అయిదుకాగానే ఆ ప్రేయత్నంగా పిల్లవాడ్ని తీసుకుని భీచ్ కేసి వెళ్ళింది.
* * * *
ఒకతుఫానులోంచి గాఢమైన నిశ్శబ్దంలో వచ్చిన అనుభూతి. సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం_
పిల్లవాడు నీటి ఒడ్డున ఆడుకుంటూ వుంటే ఆ పిల్లవాడి భవిష్యత్తు విషయమై ఏ నిర్ణయమూ తీసుకోలేక యిసుకలో పావని_ వెంకట్రామయ్య ఒకరినొకరు అభిముఖంగా కూర్చున్నారు. ఈ రోజునా తమ పిల్లవాడి భవిష్యత్తు విషమమై ఓ నిర్ణయం తీసుకోవడానికి ఆఫీసు గదిలో కూర్చున్నారు. ఇక్కడ తేడా అల్లా ఓకటే. ఆ రోజు పిల్లవాడికి తల్లి పావని, అయిన తండ్రి రాఘవయ్య.కాని ఈ రోజున ఈ పిల్లవాడికి తల్లి పావని, తండ్రి వెంకట్రామయ్య ఆ రోజున ఆపిల్లవాడు పసివాడు. కాని ఈ రోజున ఈ పిల్లవాడు ఇంజినీరింగ్ చేసినవాడు.
"డాడీ ప్రాజెక్ట్ రిపోర్టు చూశారా" అడిగాడు మనోహర్ ఎం.వి.అయ్యనుద్దేశించి
"ఇంకొక ఇండస్ట్రీ ఏదైనా పెడ్తున్నారా?" అడిగింది పావని.
"యస్ మమ్మీ... ఇప్పుడు ఇండియాలో కళ్ళకు గ్లాసులు ఉపయోగిస్తున్నాం. సైట్ నిబట్టి గ్లాసెస్ పవరు వుంటుంది. గ్లాసెస్ వల్ల రెండు ఇబ్బందులున్నాయి. ఒకటి__ గ్లాసువల్ల ప్రమాదాలు ఎక్కువ. ఎండలో వున్నప్పుడు రెడియోషన్ రెండు గ్లాసులు బరువుగా వుంటాయి. వీటి స్థానంలో ఫైబర్ గ్లాస్స్ వచ్చాయి. మసకజోళ్ళు కూడా చూడటానికి కూలింగ్ గ్లాసెస్ వలేనే వుంటాయి. బరువు తక్కువ__ కలర్ పుల గా వుంటాయి" అంటూ తాను పెట్టబోయే ప్యాక్టరీ గురించి చెప్పుకుపోతున్నాడు మనోహర్.
కాని ఎం.వి అయ్య ఇవేమీ పట్టించుకునే స్థితిలో లేదు. ఇప్పుడు అతడు ఆలోచిస్తున్నది వడయారు కూతురు ప్రారంభించిన షిప్పింగ్ కార్పోరేషన్ గురించి! ప్రత్యర్దిని ఆదిలోనే అణచివేయాలన్నది అతడిఫిలాసఫి... అతడు దేని గురించి ఆలోచిస్తున్నాడో ఆ గదిలో వున్నా మిగతా ఇద్దరాకీ తెలియదు. కొడుకు పెళ్ళి గురించి అలోచిస్తున్నడనుకుంటోంది. పావని! ఎందుకంటే అంతకు కొద్ది నిమిషాల క్రితం ఆమె ఆ ప్రతి పాదన చేసింది కనుక! తన ప్రాజెక్టు గురించి అలోచిస్తున్నడనుకున్నాడు మనోహర్! ఎం.వి. అయ్యని అంచనా వేయడంలో తల్లీ కొడుకులిద్దరూ ఫేయిలయ్యారుగాని వడయారు కూతురుమాత్రం సరిగ్గానే అంచనా వేసింది. అందుకే 'తంబి' ని వెదుక్కుంటూ వెళ్ళింది. ఆ నిముషం వరకు 'తంబి' ఎవరో,అతడి గతం ఏమిటో అతడికి మినహా మరొకరేవరకీతెలియదు తన తల్లి ఎక్కడుందో అసలు బ్రతికుందో లేదోకూడా తెలియదు.
దాదాపుగా మిప్ఫైఏళ్ళ క్రితం అదే బీచ్ లో తన తల్లి పోయిందని మాత్రం అతడకి తెలుసు.
హ్యండ్ బ్యాగ్ తెరచి నోట్లకట్ల తీసి అతడికి అందించే ప్రయత్నంగా అతడిమీదకు విసిరింది. అతడికి ఆమెకు మధ్య నాలుగు అడుగులుంటుంది. ఈ నాలుగు అడుగుల దూరంలో దాదాపుగా ఒక అడుగు దూరం ఆమె చేయి ముందుకొచ్చింది. నోట్లకట్ల విసరటానికి. ఆ నోట్ల కట్ట అందుకోవడానికి అతడి చేయి ఓ అడుగుదూరం ముందుకొచ్చింది. ఇహా ఆ ఇద్దరి మధ్య దూరం రెండడుగులు మాత్రమె ఆమె చేతిలోని నిట్ల కట్ట గాలిలో ఈ రెండుడుగులు ప్రయాణం చేసేంతలో రెండు అద్బుతాలు జరిగిపోయాయి. అతడు తన జేబులోనున్న కత్తిని మెరుపు కన్నవేగంగా బయటకు తీశాడు. నోట్లకట్లకు ఆ కత్తి అడ్డుపెట్టాడు. నోట్లకట్ల వున్నా ఆ కత్తిని ఇసుకలో ఆమె కాళ్ళదగ్గర నాటాడు.
"చూడు... నా పేరు తంబి, నాకు తల్లి, తండ్రి, గురువు,దైవం అన్నీ ఈ సముద్రమే,సముద్రంలో నీటి అల ఎంత వేగంగా వచ్చి తీరానికికొట్టుకుంటో టైం పెట్టి చూడు__ ఆ అలకన్నా ముందుగా ఈదుకుంటూ రాగలనేర్పు, సత్తానాకుంది. అమ్మనుమించి ఈ గంగమ్మ సాక్షిగా చెబుతున్నాను. పసిపిల్ల ప్రాణాలతో చెలగాటమాడేది__ లేఖరోళ్ళ కడుపు కొట్టేది కానిపని ఏదయినా చేస్తాను. పనికి తగ్గ ప్రతిఫలం అందలి" అన్నాడు.
"డంగ్..."
"ఇంతకీ అసలుపని..."
"నా పేరు కావ్య, మా నాన్నగారు, వడయారు బిజినెస్ మెన్, నేను ఎం.బి.ఎస్. చేసి బిజినెస్ ప్రారంభింఛబోతున్నాను...."
"అయితే రాంగ్ నంబర్ డయాల్చేశారు మేడమ్. మీరు వెళ్ళవలసింది ఎస్.ఎఫ్.సి.కి బ్యాంకుకి ..."
"వాటివల్ల ఇబ్బందిలేదు. కాని వ్యాపారమనే వైకుంఠంపాళిలో ఒక పెద్ద విషయసర్పం నన్ను కాటేయటానికి సిద్దంగా వుంది"
"ఇంతకీ మీరు చేయబోతున్న బిజినెస్ ఏమిటి_వాటి పేరేమిటి?"
"చాలా ఓడలు సముద్రప్రమాదములో మునిగిపోతుంటాయి. సముద్ర గర్బంలో మునిగిపోయిన ఓ ఓడల్ని పగులగొట్టి ఆ ఓడలో పనికొచ్చే సామానంతా తీసుకోస్తాం. ఇందుకు పరిహారంగా ప్రభుత్వానికి కొంత ముట్టచెబుతాం."
"అంతవరకే మీకు తెలిస్తే ఈ బిజినెస్ మానేయండి ఎందుకు చెబుతున్నానంటే సముద్రంలో ఎక్కడో తుఫానులో చిక్కుకునో, ఇతరత్రా మరో ప్రమాదంలో చిక్కుకునో ఓడలు మునిగిపోతుంటాయి. ఓ ఓడలలో వుంటాయి. ఓడ మునిగిపోగానే 'సిహైరైట్స్' గ్రూపులు గ్రూపులుగా వెళతారు. విలువయిన వస్తువులన్నీ తీసుకోస్తుంటారు. ఇహ మిగిలేది చాలా తక్కువ. శ్రమ ఎక్కువ___ ఫలితం తక్కువ."