Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 10

    ఓ పుల్లారావు వచ్చి న పేరు పెట్టారు. ఆ పేరుతో మి అబ్బాయిని పిలవరేంటి? పిలవనికాడికి పేరెందుకు పెట్టాలి అని పోట్లాడితే__

    మరో ఎల్లరా వొచ్చి " ఆయ్! నా పేరు గౌరవంగా వాడాలిగాని తిట్లకీ శాపనార్థాలకీనా!" ఇలా గోలగోల అయింది.

    మా అమ్మకీసుకేసి ముద్దుగా అబ్బులూ అని పిలవటం మొదలు పెట్టింది. అప్పటినుంచి నా పేరు అబ్బులు అయింది.

    అబ్బులు, అబ్బునాధం, అబ్బూ యిలా మా యింట్లోను మా బంధుమిత్రులు పిలవటం ప్రారంభించి అదే ఖాయం చేశారు. యిదండీ జరిగింది.

    నా పేరు వెనుక యింత కధ వుంది" అంటూ అబ్బులు ముగించి కళ్ళజోడు లోంచి జయచిత్రను అమాయకంగా చూశాడు.

    " మి పేరు మీద ఓ పెద్ద కధ రాయొచ్చు" అంది జయచిత్ర.

    " నిక్షేపంగా కధ రాసుకోండి. మాకు మాత్రం మి ఇంట్లో నివశించటానికి అనుజ్ఞ యివ్వండి చాలు" అన్నాడు అబ్బులు అసలు విషయానికొస్తూ .

    " మికన్నా ముందే మా ఫ్రెండ్స్ కిచ్చానని చెప్పాగా!" అంది జయచిత్ర.

    " మరి వాకిట్లో టూలెట్బోర్డ్ ఎందుకుందండి?" అంటూ సాగదీశాడు వ్యాకర్ణ.

    " తియ్యలేదు కాబట్టి."

    " ఎందుకు తియ్యలేదు?"

    " టైమ్ లేక."

    " ఎందుకు టైమ్లేక?"

    " సినిమాకెళ్ళాం కాబట్టి..."

    ఏడు చేపల కధలాగా వ్యాకర్ణ జయచిత్ర మాట్లాడు కుంటుంటే బామ్మగారు అడ్డు తగిలింది.

    " అబ్బాయిలు చూడబోతే చాలా మంచివాళ్ళు లాగున్నారు. అద్దెకిస్తానని మాట యిచ్చాను. బ్రహ్మచారులయినంత మాత్రాన కోతుల్లా అల్లరి చేస్తారనుకోకు. పెద్ద పెద్ద వాళ్ళకే బుద్ధులు సరిగా లేవు" అదనీ ఇదనీ జయచిత్ర చెప్పే కుంటిసాకులన్నింటికీ అడ్డు తగిలి కొట్టిపారేసింది బామ్మాగారు.

    సమయం చూసి తామెంత బుద్దిమంతులమయిందీ చెపుతున్నారు వ్యాకర్ణ అబ్బులును.

    అయితే జయచిత్రకి ముక్కుమిద కోపం, ఆత్మాభిమానం, గడుసుతనం, అల్లరి రవంత, పొగరు లాంటివి వున్నాయి కాబట్టి ఆ అబ్బాయికి చాలా చాలా జాగ్రత్తలు వివరాలు చెప్పలంది జయచిత్ర.  

    అద్దెకి వీళ్ళు రావటం వప్పుకున్నావు గాబట్టి యిహ నీ యిష్టం అంది బామ్మాగారి నెత్తిన ముళ్ళకిరీటం సరిజేసుకుని.

    ఆ తర్వాత వాళ్ళనక్కడే వదిలేసి పనుండబట్టి లోపలి కెళ్ళింది బామ్మగారు.

    " హు హ్హూ" అని హ్హూంకారం లాటిదిచేసి " నేచెప్పేది జాగ్రత్తగా వినండి. ఏ మాత్రం వూరుకోను. ఈ యింట్లో అడుగు పెట్టింతర్వాత పోరాపాట్లు చేసినా వూరుకోను. తక్షణం వెళ్ళగొట్టేస్తాను" అంది జయచిత్ర.

    అబ్బులు భూతద్దాలలోంచి జయచిత్రను చూస్తూ " మి ఇష్టం" అన్నాడు.

    వెంటనే వ్యాకర్ణ " వీడిష్టమే నా యిష్టం. నా యిష్టమే వీడిష్టం. మి యిష్టమే మా యిద్దరి యిష్టం" అన్నాడు వినయ విధేయతలతో చేతులు కట్టుకుని.

    జయచిత్ర రెండు కుర్చీలు వాళ్ళిద్దరికీ వేసి కూర్చోండని చెప్పి తానో కుర్చిలో బాసి పెట్టేసుకుని కూర్చుంది.

    " ఈ పిల్ల మనకి కుర్చీలేసి కూర్చోమని గౌరవిస్తున్నది రోయ్!" అన్నాడు వ్యాకర్ణ అబ్బులి చెవిలో నోరుపెట్టి.

    " మర్యాదాలేదు మన్నూ లేదు. ఈవిడగారీడు చిన్న సైజు వుపన్యాసమో తెలుగు పంతులమ్మ యిచ్చే లెక్చరి బలవంతపు నీతిబోధ ఏదో చేయబోతున్నది. నంచుంటే కాళ్ళు పీరుతాయని తను కూర్చుని మనం నంచుంటే మరీ బాగుండదేమోనని కుర్చీలేసి కూలేసింది" అంటూ అబ్బులు వ్యాకర్ణ చెవి కొరికాడు.  

 Previous Page Next Page