Previous Page Next Page 
మిస్ మేనక ఐ. పి. యస్. పేజి 8


    "మేడం..." తటపటాయిస్తూ అన్నాడు.  " ఇందాకటి జోక్ నిజానికి నేను చెప్పినా అది నాకుకాదు. ఎస్సై ప్రసాదు పూర్వం నాకు చెప్పిందే."

 

     ఈ విషయం ప్రత్యేకించి అతనెందుకు చెప్పాలనుకుంటున్నదీ ఆమెకు బోధుపడిపోయింది. తను క్రెడిట్ తీసుకోవడానికి ఇష్టన పడటం లేదు.

 

     " మేడం! మా అందరిలో  బాగా జోక్స్ చెప్ప గలిగేది ప్రసాద్ మాత్రమే. అయితే అప్పటికీ బ్లాంకయిపోయాడు."

 

    "బాస్ ను చూసి భయపడేవాడు నేరస్థుల్ని ఎలా నిరోధించగలడంటారు. లీనియన్స్ తీసుకోకుండా లిబర్ గా ఉండటాన్ని నేనిష్టపడతాను. మీరింత  స్వల్ఫకాలంలో ఇంటిమేట్ జోన్ లోకి వ చ్చేశారంట. మరి మీకెలా సాధ్యమైంది?"

 

    "మేడం..." సంశయిస్తున్నాడు దేనికో.

 

     ఆమెకన్నా అయిదారేళ్ళు పెద్ద అవుతాడేమో  మురారి. ప్రసన్నంగా నవ్వుతూ అంది.


    
    " చెప్పండి."

 

    " మీకిది చెప్పొచ్చో, లేదో నేను అనవసరమైన చనువు తీసుకుంటున్నానో నాకు తెలీదు..." క్షణం ఆగి అన్నాడు. " రణధీర్ రోపోమాపో మంత్రి కాబోతున్న ఎమ్మెల్యే అప్పారావుకి కొడుకు."

 

    " సో?"

 

    " అదిగో. మీరలా కోపం తెచ్చుకుంటే నేను చెప్పలేను. పూర్వం ఇద్దరు డిఎస్సీలు రణధీర్ మూలంగా ట్రాన్స్ ఫరైపోయారు."

 

    " ఎస్సై రమణ రణధీర్ మూలంగా సస్పెండయ్యాడు."

 

    "కావచ్చు. కాని మీరిక్కడ కంటిన్యూ కావాలి."

 

    "యూ సి మిస్టర్ మురారీ మీ అభిమానానికి కృతజ్ఞురాలిని. నేను ఐ.పి.ఎస్.లో  టాపర్ గా, పోలిసు అడమీలో ఎక్కువ మార్కులు స్కోరే చేసిన వ్యక్తిగా కోరి ఈ జిల్లాకి వచ్చినదాన్ని ఇలాంటి వాటికి కాంప్రమైజ్ అయితే నేను పడ్డ శ్రమకి అర్థం   ఉండదు."

 

     అది అహం కాదు.తిరుగులేని తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించే పద్ధతి.

 

    "కాని రణధీర్ ని సర్కిల్ సుధాకర్..."

 

    "నిర్భందించడు. కారణం తను అతని దృష్టిలో దోషి కాలేదు కాబట్టి... కాని నేను విశ్రమించను."

 

     ఖండితంగా  చెప్పిన మేనక మురారి దృష్టిలో  ఎంత ఎదిగిపోయిందీ అంటే కొన్ని నియమాల్ని ఉల్లంఘించి ఆమెకు తను బాసటగా నిలబడాలనుకున్నాడు.

 

     హుషారు గా మాట్లాడే మురారి ఎంత నిజాయితీగల ఆఫీసరో ఆమెకే తెలీదు అప్పటికి . తెలుసుకునే అవకాశం ఆరాత్రే వచ్చింది.


    
                          *    *    *    *


    
    తెలతెలవారుతుండగా....

 

    నగరంలోని ఓ భవంతి పైన మేనక ఆధ్వర్యంలో రైడ్ జరిగింది. రాత్రంతా పేకాటతోబాటు మరికొన్ని చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు నిర్వఘ్నంగా సాగే ఆక్లహ్హు ప్రారంభమై అయిదేళ్ళు గడిచినా ,ఇలా జరగడం తొలిసారి.


    
    పోలీసుల్ని చూడగానే అందరికీ నిద్రమత్తు వదిలినట్టుగా పేకనీ ,డబ్బునీవదిలిపెట్టి బయటికి పరుగెత్తారు.

 

    అరనిముషం పాటు చెలరేగిన అలజడి హఠాత్తుగా ఆగిపోయింది- ఆ క్లబ్బు నిర్వహించే రణధీర్ ముందుకు రావడంతో-

 

    " సో.... యూ ఆర్ హైడింగ్  హియర్!"

 

    " గోటు హెల్!" పొగరుగా అన్నాడు రణధీర్ ఎగతాళిగా చూస్తూ

 

    మేనక  పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

     అరగంట  క్రితమే క్వార్టర్సుకి వచ్చిన ఎస్సై మురారి రణధీర్ ఉనికి గురించీ,క్లబ్బు గురుంచీ మాత్రమేగాక ఇలాంటి పరిస్థితీ ఎదుర్కోవాల్సి వస్తుందని తను తోడు వస్తానన్న కాదండి. కేవలం అయిదుగురు కానిస్టేబుల్స్ తో వచ్చిందక్కడికి.

 

    "అరెస్ట్ హిం." ఆమె ఆదేశం ఇంకా పూర్తి కానేలేదు ముందు కొచ్చాడు మరో యువకుడు.

 

    "వాట్స్ దిస్ నాన్సెన్స్?"

 

    " మీరెవరు?" అడిగింది.

 

    "నేనెవరూ అన్నది నీ డిపార్ట్ మెంటులో ఎంక్వయిరీ చేస్తే తెలుస్తుంది."

 

    "టేక్ దీజి  టూ బాస్టర్డ్స్  ఇంటూ కస్టడీ..."  అరిచింది ఆవేశంగా ప్రతిఘటించబోయిన రణధీర్ గాని, చాలా ప్రముఖుడనిపించుకునే రెండో వ్యక్తి లాయరు సూర్యంగాని ఎంత పొరపాటు చేశారూ అంటే,తామిప్పుడు ఓ అందమైన ఆడపోలిస్ ఆఫీసరుతో వ్యవహరిస్తున్నామనుకున్నారు తప్ప,ఆమె ఎంత తెగువల యువతో అంచనా వేయలేకపోయారు.  

 

     ఆడదే కావచ్చు. కాని ఐ.పి.ఎస్. ప్రొబేషనర్ గా క్రిమినల్స్ ని ఎదుర్కొనే ' అనార్మ్ డ్ కంబాట్' లోతర్పీదు పొందిన వ్యక్తి ఆమె.

 

    అంతే ! పిడికిలి నుపయోగించి హైసెక్షన్ బ్లోతో రణధీర్ ని, లోసెక్షన్ ఫ్రంట్ కిక్ తో సూర్యాన్నీ ఒకేసారి  ఆ చేతనుల్ని  చేసింది.

 

     కళ్లు బైర్లు కమ్మిన ఇద్దరూ తేరుకునేటంతలో చేతులకు బేడీలు వేయించింది  ఇదీ ఆ  ఇద్దరు యువకులు ఊహించనిదే.

 

     అక్కడితో  ఆగని మేనక వారినిద్దర్నీ జీపుసైతం ఎక్కనివ్వకుండా జనమంతా చూసేట్టు రోడ్డుమీద  నడిపిస్తూంది. న్యాయాన్యాయ ప్రసక్తి అటువంటితే. ఒక రాజకీయ నాయకునీ, మరో ప్రముఖ లాలర్నీ, బేడీలు వేసి రోడ్డుమీద నడిపించడం ఎంత సంచలానికి కారణమైందీ అంటే, ఆవార్త చాలా వేగంగా బార్ కౌన్సిల్ కి చెందిన లాయర్లని చేరగా...

 

     పోలిస్ స్టేషన్  మరో అరకిలోమీటరు  దూరముండగానే రోడ్డుపైన ఎ.ఎస్.పి. మేనకకు అడ్డం నిలిచారు చాలామంది న్యాయవాదులు.

 

     ఇలా జరగడం మేనక సైతం  ఊహించని విషయం.ఎదురుగా నిలబడ్డది లాయర్లని ఆమెకు బోధపడిపోయింది.ఇక్కడ మరో అలజడి మొదలుకాబోతూందని.

 

     జనం ఉత్కంఠతో గమనిస్తున్నారు.

 Previous Page Next Page