మా స్తేకిళ్ళు బయటకు తిసుకోచ్చాక చూసేసరికి నా స్తేకిల్లో ఓ చక్రానికి గాలిపోయి ఉంది. నాకు ఒళ్ళు మండి పోయింది.
నేను ఇంట్లో ఉన్నంతసేపూ ఆ స్తెకిల్ బాగానే ఉంటుంది తీరా నేను బయటకెళ్ళాలనుకునేసరికి, ఇలా గాలిపోవటమో, మరొకటి జరగటమో మామూలాయిపోయింది.
"వెధవ స్తెకిల్! అయిదో పదికోఅమ్మి పారేస్తాను. డార్జిలింగ్ మానేసి ఆ డబ్బుతో కొత్త స్తెకిల్ కొని పారేస్తాను " అన్నాను కోపంతో.
"అదేమిట్రా,స్తెకిల్ మీద కోపం డార్జిలింగ్ మీద చూపిస్తా వేండుకూ!" నన్ను సమాధాన పరుస్తూ అన్నాడు వాడు.
"నీకు తెలియదురా ఈ స్తెకిల్ సంగతి ! నానాతిప్పలూ పెడుతోంది."
"అందుకే నేను కొన్న కంపెని స్తెకిల్ నిన్నూ కొనమంటే నువ్వు వినలేదు "అన్నాడు వాడు.
నేనేమి మాట్లాడలేదు. వాడు చెప్పిన మాట నిజమే! న్యూస్ పేపర్లోనూ, సినిమాలో చూపే ఏడ్వర్టయిజ్ మెంట్ ఫిలిమ్స్ లోనూ, గుట్ట ల్లోనూ పొలం గట్లమీదా, గతుకురోడ్లల్లోనూ ఎలా అద్భుతంగా సునాయసంగా అందమయిన అమ్మాయితో సహా, వెళ్ళిపోతుందో చూశాక, అదే స్తెకిల్ కొనాలనీపించి కొన్నాను.
అయితే కొన్నతరువాత ఏ ఒక్క రోజుకూడా దాన్ని కొండలోన్లూ, గుంటల్లోనూ నడపలేదు. గతుకురోడ్ల మీద నడపలేదు. అయినా అదేనాడూ వాళ్ళ కంపెని ఫిల్ములో చూసిన విధంగా సునాయాసంగా అద్భుతంగా నడవలేదు. పతే పెచ్చు ఎప్పటికప్పుడు పంక్చర్స్ అవటం, చ్తేన్ లూజ్ అవటం, మడ్ గార్డ్ టైర్ కి తగులుతూడటం, ఫెడర్ విరిగి పోవటం జరుగుతూండేది.
ఇద్దరం వాడి స్తెకిల్ మీదే డబుల్స్ వెళ్ళాలని నిర్ణయించుకుని రోడ్డు మీదకోచ్చము. వాడు స్తెకిల్ ఎక్కి నెమ్మదిగా పెడలింగ్ చేస్తోంటే నేను వెనుక కారేజ్ మీద ఎగిరి కూర్చున్నాను. దాంతో హాండిల్ వెంగగా అటూ ఇటూ తిరిగిందిగాని, ఆ వేగంతో విల్ కి, హాండిల్ బార్ కి మధ్య ఏర్పడ్డ ఈ అపార్ధంవాళ్ళ మేమిద్దరం తీవ్రమయిన భూమ్యాకర్షణ శక్తికి లోనయ్యం .
ఇద్దరం బట్టలు దులుపుకుంటూ లేచి నిలబడ్డము. దారిపోయే దానయ్యగారొకరు స్తెకిల్ లేవదీసి మాకందించారు.
"ఈ ఏరియాలో భూమి మాగ్నటిక్ ఫోర్స్ కి చాలా తేడా ఉంది" అన్నాడు సారది "కావాలంటే చూడు! రోజూ ఒకరిద్దరయినా ఇక్కడే స్తెకిల్ మీద నుంచి పడిపోతుంటారు."
"అవును!" అన్నాన్నేను.
"మన స్తేంటిస్టు లెవరయినా ఇక్కడ పరిశోధన జరిపితే బావుంతుంది" అన్నాడు వాడు.
"అదిగాక, నీ స్తెకిల్ తాలూకు హాండిల్ బార్ కూడా బాగా లూజ్ అయి ఉంది. టైట్ చేయించాలి!" అన్నాను. అప్పటికే మా చుట్టూ కొంత మంది పిల్లలు మూగారు మావంక విచిత్రంగా చూస్తూ.
నా తెల్లప్యాంటు మాసిన ప్యాంటులా తయార్తేంది. వంకరాయిన హాండిల్ బార్ నీ విల్ మీద కూర్చుని పంకర తీశాడు సారధి. ఈ లోగా మంరింత జనం పోగాయారు.
"దెబ్బలేమయినా తగిలాయ?" అడిగాడోకతను. అసలే కిందపడి మేము చిరాగ్గా ఉంటే జనం అలా మూగిపోవటం మరి చికాకు కలిగించింది. వెంటనే స్తెకిల్ తీసుకెళ్ళి ఇంట్లో పడేసి వచ్చాడు వాడు ఇద్దరం బయలు దేరాం. అయినా కొంతమంది పిల్లలు చాలా దూరం మా వెనుకే వచ్చారు. చివరకు సారధి వాళ్ళ వెంటబడి తరిమికొట్టాక గాని వాళ్ళు పోలేదు.
సాధారణంగా మూర్తి పదిగంటలవరకూ ఇంటిదగ్గరే ఉంటాడు. ఎక్కడికయినా బయల్దేరాలంటే పది తర్వాతే బయల్దేరతము. టైము చూసుకునే సరికి తిమ్మిది న్నారా అయిపోయింది. నాలుగడుగులు వేశామో లేదో శ్యాం బాబు ఎదురుపడ్డాడు. ఆ సమయంలో అతను కనిపించడం మాకేమాత్రం నచ్చలేదు.
"హలో!" అన్నాడు శ్యాం బాబు ఆనందంగా.
"హాలో!" అన్నం మేము పొడిగా.
"ఈ వారం పత్రిక చదివేరా?" అడిగాడతను.
"చదివాం, చదివాం" అన్నాను ఖంగారుగా.
ఎండుకంటే అదివరకోసారి ఇలాగే తేలిక 'చదవలేదు' అనేసరికి జేబులోనుంచి పత్రిక తిసి అందులో తను రాసినకధంతా చదివి మరి వినిపించాడు నడిరోడ్డుమీద.
"ఇప్పడే అలా చదివి ఇళ్ళ వస్తున్నాం ! కదురాసారధి?" కన్ను గిటుతూ సారధి నడిగాను.
"అవును! పది నిమిషాలు కూడా అవలేదు!" అన్నాడు సారధి.
"ఎలా వుంది మన రచన?"
"అద్భుతం! ఆఖర్లో పాపం హిరోయిన్ పాత్ర చదూతూంటే చాలా బాధ కలిగింది" అన్నాడు వాడు ఓవరాక్షన్ చేస్తూ.
"హిరోయినా?" ఆశ్చర్యంగా అడిగాడు శ్యాం బాబు .
ఇద్దరం ఖంగారుపడ్డాము వాడు రాసిన కధలో హిరోయిన్ లేదేమో అన్న అనుమానం వచ్చేసింది యిద్దరికీ.
"హిరోయిన్ అంటే హీరోయిను కాదులే! హిరో అనబోతూ అలా అన్నాను"
"కాని అసలు నేను కథ రాయలేదుగా ఈసారి?"
"రాయలేదా?"
"అబ్బే! ఉత్తరాల శీర్షికలో రెండో ఉత్తరం ఎవరి దనుకున్నారు? నాదే?"
"తెలుసుగురూ! ఆ శ్తేలి చూస్తూంటేనే తెలిసిపోతోంది నిదాని! ఆ ఉత్తరమ అద్భుతంగా వుందంటూ ఇప్పడే ఓ వుత్తరం రాయాలని కూడా అనుకున్నాము మేము."