"ధ్యాంక్యూ !" అన్నాడు శ్యాం బాబు . "మొత్తం నాలుగు ఉత్తరాలు రాశాను ఆ పత్రికకు! బహుశా వచ్చేవారం ఇంకో ఉత్తరం పబ్లిష్ చేస్తారానుకుంటాను నాలుగింటిలో ఒకే ఒక్క ఉత్తరం తిరిగి వచ్చింది. దానర్ధం మిగతావాణ్ణి ప్రచురణకు అంగికరింపబడినట్లేకదా?
"ఇంకా అనుమానమేమిటి? కంగ్రాచ్యులేషన్స్! మాకూ అలా ఉత్తరాల్రాయతం నేర్పకూడదూ?"
"చాలా తేలిక- మీరు ఓ కథ చదవాలి ముందు అందులో పేర్లు మన డ్తెరిలో రాసి ఉంచుకోవాలి. ఆ తరువాత ...."
"అబ్బే ఇప్పుడు కాదులే-ఓ మంచి రోజ్జూసుకుని మీ ఇంటికోస్తాము అప్పుడు నేర్పుదూగాని___వస్తాం."
అనేసి అతను పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి దూసుకుపోయి జనంలో కలిసి పోయాము.
మూర్తి ఇళ్లు చేరుకొని కాసేపు తలుపు బాదక అతని భార్య తలుపు తెరిచింది.
"ఆయన లేరు" అంది చిరునవ్వుతో.
మా గుండెలు ఆగిపోయినయ్.
"ఎక్కడి కెళ్ళాడు?"
"ఇప్పడే రేడియోని రిపేరింగ్ కి తిసి కెళ్ళారు అయిదు నిమిషాలు కూడా అవలేదు ."
"ఆయన లేరు" అంది చిరునవ్వుతో.
మా గుండెలు ఆగిపోయినయ్.
"ఎక్కడి కెళ్ళాడు?"
"ఇప్పడే రేడియోని రిపేరింగ్ కి తిసికెళ్ళారు అయిదు నిమిషాలు కూడా అవలేదు."
"అదేమిటి? టి. వి. కొన్నారుగదా- ఇంకా రేడియో ఎందుకు?"
"అదేనండి! అడ్డమయిన చెత్తా చూడటం కంటే, వినడమే నయం అని తీసుకెళ్ళారు"
"సరే అక్కడికె వెళ్దాం! అద్దరే కదా" అన్నాడు సారది. మూర్తిరిపేరింగ్ చేయించే రేడియో షాఫ్ మాకు తెలుసు. పది నిమిషాల్లో ఆ షాఫ్ కి చేరుకున్నాం. అది మూసేసి ఉంది. తలుపుమీద ప్రతి మంగళవారం శలవు అని రాసి వుంది.
"అమరి ఆదివారం ఎందుకు మూసేసినట్లు?" కోపంగా అడిగాడు సారధి.
"ఎందుకయినా అఘోరించని....మనం మూర్తినేల పట్టుకోవటం?" అడిగాను.
ఇద్దరం కాసేపు ఆలోచించాము.
"షాపు లేదు కాబట్టి, వాడు ఇంటికే వెళ్ళి ఉంటాడు! పద వడి ఇంటికే పోదాం" అన్నాడు సారధి. ఇద్దరం మళ్ళి వాడింటికి చేరుకున్నాం. వాళ్ళావిడ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయింది.
"అరె! ఆయన మీకు ఎదురుపడలేదా?" అనడిగింది.
"లేదే" అన్నాడు సారధి.
"బాగానే ఉంది!" అంటూ నవ్విందామే. "ఇందాక మిరాటు వెళ్ళారో లేదో, షాపు మూసేసి ఉందంటూ ఆయనిటు వచ్చేశారు. మీరు షాపు కేల్లారని చెప్తే -మీ కోసం మళ్ళి ఇప్పడే షాపు కెళ్ళారు."
"వాడేటునుంచి వచ్చాడు? మెయిన్ రోడ్డు మీద నుంచా , సందుల్లో నుంచా?"
"మెయిన్ రోడ్ మీదనుంచి!"
"అది సంగతి మేము సందుల్లో నుంచి వెళ్ళి మళ్ళి అటే తిరిగి వచ్చాం!"
"పోనీ కాసేపు కూర్చోండి- ఆయన మళ్ళి వచ్చేస్తారు" అందామె . పోమేసరికి ఇంక లాభం లేదని మళ్ళి షాపుకి బయల్దేరాం.
"ఈ సారి ఇద్దరం చెరో దారిలో బయల్దేరదాం! అల గయితే వాడు మిస్ అవడు" అన్నాడు సారధి.
ఇద్దరం చెరో దారిలో బయల్దేరి షాపు దగ్గరకు చేరుకున్నాం! షాపు తెరచి ఉంది గాని మూర్తి కనిపించలేదు.
"మా మూర్తి వచ్చాడా?" అనడిగాం షాపతనిని.
"వచ్చారుసార్! ఇప్పటివరకూ- ఎవరో ఇద్దరు ప్రెండ్స్ వస్తారని ఇక్కడే కూర్చుని ఎదురు చూసి ఇప్పడే వెళ్ళిపోయారు."
"ఆ ప్రెండ్స్ దౌర్భాగ్యులం మేమే నాయనా! ఇంతకూ వాడేటు వెళ్ళాడు?" అడిగాడు సారధి.
"మార్కెట్ వేపు వెళ్ళరండి?"
ఇద్దరం రిక్షా చేసుకుని మార్కెట్ కెళ్ళాం! రోడ్డుమీద తెలిసిన వాళ్ళు కోకొల్లలుగా కనిపించారు.
"మూర్తా? ఇప్పడే అరనిమిషం అయింది కనిపించి! ఈ సందు లోకే వెళ్ళాడు" అంటూ అరగంట సేపు మమ్మల్ని తిప్పించారందరూ.
విసుగుపుట్టి వాడిని వెతకడం విరమించుకునీ మాఇంటికి చేరుకున్నాం.
"ఇప్పడే మూర్తిగారు మీకోసం వచ్చి పదినిమిషాలు కూర్చుని వెళ్ళారు" అంది రాజ్యం.
"ఏడ్చినట్లుంది" అన్నాడు సారధి.
"అన్నట్లు ఆయనకు అర్జంటుగా వందరూపాయలు కావాలిట! దాని కోసం వచ్చారు! నేను నా దగ్గరున్న డబ్బు ఇచ్చేశాను."
మాకు మతిపోయినట్లయింది.
"వాడినడిగి వెయ్యి రూపాయలు తీసుకోవాలని మేము తిరుగుతోంటే వాడు వచ్చి వంద రూపాయలు తీసుకెళ్ళాడా?"
వెంటనే మళ్ళి బయల్దేరి వాడింటికి చేరుకున్నాం.
"వఠ్టి ఇడియట్స్ లాగున్నార్రా మీరు! మీకోసం తెగ తిరగాల్సి వచ్చింది!" అన్నాడు వాడు కోపంగా.
"మేమూ అదే అనుకుంటున్నాం!" అన్నాడు సారధి.
"అది సరేగాని-మేము నిన్ను వెయ్యి రూపాయలు అప్ప లేదుకదా ! అందుకని వంద రూపాయలు కావాల్సి వచ్చి మీ కోసం తిరిగాను"
"హమ్మయ్య" అనుకున్నాం యిద్దరం.
"అయినా మీరుట్టి సంయాసుల్లాగా ఉన్నరేమిట్రా? వెయ్యి రూపాయల బాంక్ బాలెన్స్ కూడా లేదా- ఇన్నేళ్ళ సర్విస్ అయినా?" చిరాకు పడ్డాడు వాడు."