"మిమ్మల్ని నాలుగు లక్షల కట్నంపోసి కొనుక్కున్నది మీరు అటు తిరిగి మూతి ముడుచుకుని పడుకోడానికా?" అంటూ రాంపండు ని అల్లుకుపోయింది.
* * * *
రాంపండు గోడ గడియారంవంక చూసి కెవ్వుమని అరిచాడు.
అప్పుడే అయిదు అయిపోయింది.త్వరగా ఫైల్స్ సర్దేసి బయటకు పరుగు తియ్యకపోతే సర్వోత్తమరావు లోపలకి పిలిచినా పిలవొచ్చు... అతనికి దొరికిపోతే, అతను మళ్ళీ ఏదైనా పని అప్పగిస్తే ఇంటికి వెళ్ళడం ఆలస్యం అవుతే రాజీ....
అమ్మో!....
టేబుల్ మీది ఫైల్స్ గబగబా సర్దేశాడు.
"ఆ అరుపులెంటీ? ఆ ఫైల్స్ సర్దడం ఏంటీ? అన్నాడు రాంపండు కంగారు చూసిన బ్రహ్మాజీ. "ఏం? ఇంట్లో ఎవరికైనా బాగాలేదా?"
"బాగానే వుందికానీ ఇంటికలస్యంగా వెళ్తేనే బాగుండదు" అన్నాడు రాంపండు.
బ్రహ్మాజీ వెర్రి మొహం వేశాడు అతని మాటలు అర్ధంకాక.
టేబుల్ సోరుగులు కూడా చకచకా సర్ది తాళం వేశాడు ర్మ్పండు.
"ఆ అరుపులెంటీ, ఆ సర్దడాలు ఏంటీ?"
"ఇప్పుడే కదోయ్ చెప్పను.... మల్లె అడుగుతావేం అసలే నేను కంగారులో వుంటే? ఇంకోసారి అడిగావంటే నీ టెంకి పేల్చేస్తా..." అన్నాడు రాంపండు బ్రహ్మాజీవంక చూస్తూ.
బ్రహ్మాజీ ఆ అన్నది నేను కడు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
"ఇక్కడ... ఇక్కడ..."
రాంపండు అ గంతు వినవచ్చిన దిక్కుకి భయంభయంగా చూశాడు. ఎందుకంటే అప్పటికే ఆ గొంతు ఎవరిదో ఆ చిన్న మెదడుకు తట్టేసింది.
"నీ కంగారు వ్యవహారం చూస్తుంటే ఆఫీసు క్యాష్ కొట్టేసి పారిపోయే వాడి వ్యవహారంలా వుంది.... ఇంతకీ ఏం కొంపలు మునిగే వ్యవహారం ఏడ్చిందని అంత కంగారు పడిపోతున్నావ్?" అన్నాడు సర్వోత్తమరావు.
"అంటే ఆయిదయిపోయింది కద్సార్.... అందుకనీ..." నసిగాడు రాంపండు.
"అయిదయితే అంత కంగారు పడిపోవాలా? అయిదు దాటితే ఆఫీసు వ్యవహారం ఒక్క నిముషం కూడా చూడకూడదా?"
"అలాక్కాదు సార్.... మావిడికి ఒంట్లో బాగోలేద్సార్.... అందుకని కంగారు... అంతే... అంతే..." కంగారుగా అన్నాడు రాంపండు.
"ఇప్పుడే కదా ఇంట్లో ఎవరికైనా బాగోలేదా అని అడిగితే ఏంలేదని అన్నావు?" బ్రహ్మజీ అమాయకంగా అడిగాడు.
ఆ ప్రశ్న అడిగినందుకు బ్రహ్మాజీ పీకమీద కాలేసి తొక్కేయ్యలన్నంత కోపం వచ్చింది రాంపండుకి.
ఏంటి నీ వ్యవహారం అన్నట్టు కల్లెగారేస్తూ చూశాడు.సర్వోత్తమరావు.రామ్పండు వంక.
"అంటే ఇంట్లో బాగానే వుందని చెప్పానుగానీ ఆస్పత్రులో బాగాలేదని చెప్పాలేద్సార్....మా ఆవిడకి ఒంట్లో అస్సలు బాగాలేదు సార్.... అందుకని ఆస్పత్రిలో జాయిన్ చేశాను సార్..." అన్నాడు రాంపండు భయంభయంగా.
"అరెరే.... ఏంటి వ్యవహరం?" అన్నాడు సర్వోత్తమరావు జాలిగా చూస్తూ.
"అంతే జలుబూ, ఒళ్ళునొప్పులూ, వాంతులూ, విరోచనాలూ, ప్లూజ్వరం, డానికి తోడు టైపాయిడ్ కూడా వుంది సార్... మరే సార్..."
"అయ్యయ్యో... ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని వ్యవహరాలూనా?"
"అవున్సార్... అందుకే కద్సార్ ఆసుపత్రిలో జాయిన్ చేసింది."
"భలేవాడివయ్యా.... ఇంత వ్యవహారం వుంచుకుని అసలు నువ్వు ఆఫీసు కేలా వచ్చావయ్యా.... పదపద... మీ ఆవిడని చూడ్డానికి మేం కూడా వస్తాం...ఏంవొంయ్ బ్రహ్మజీ?"
"అవున్సార్.... మనం కూడా వెళ్ళి చూడాల్సిందే సార్" అన్నాడు బ్రహ్మాజీ తందానాతానా అంటూ.
రాంపండు కంగారుపడిపోయాడు.
"వీల్లేదు సార్... మీ ర్రావాడానికి వీల్లేదు సార్?"
"అదేం...మీ ఆవిడకి ఘోషా గానీ అలాంటి వ్యవహారంగానీ ఏదైనా వుందా?" అడిగాడు సర్వోత్తమరావు."అదేం కాద్సార్... మా ఆవిడని చేర్పించిన నర్సింగ్ హొంలో మొత్తం ఆడాళ్ళే వుంటారు సార్! అడ ఆయాలు, అడకాంపోండర్లూ, అడ నర్సులూ, అడడాక్టర్లు అఖరకి పేషెంట్స్ ని కూడా ఆడాళ్ళాని తప్ప వేరే వాళ్ళని చేర్చుకోరు సార్! ఒక్క మగ పురుగుని కూడా లోనికి రానివ్వరు సార్..." గబగబా అన్నాడు రాంపండు.
"అదేం నర్సింగ్ హొమయ్యా బాబూ... ఇంతకీ దాని పేరేంటీ.... అదెక్కడ వుంది?"
"దాని పెరూ... దాని పేరేమో... మరేమో అదేనండీ 'సునితా అండ్ వాల్స్ రావుగాల్స్ అండ్ నర్సింగ్ హొమ్స్' అండీ.... గందీనగర్ లో వుందండీ..." చేతులు నలుపుకుంటూ అన్నాడు రాంపండు.
"అలాంటి నర్సింగ్ హొమ్ వున్నట్టు నేనెప్పుడూ విన్లేదే!" ఆలోచిస్తూ అన్నాడు సర్వోత్తమరావు.
"నేను కూడా విన్లేదు సార్... నిన్ననే ఎవరో చెప్తే తెలిసి మా ఆవిడ్ని చేర్చాను సార్..."
"మరి ఒక్క మగ పురుగుని కూడా రానివ్వరని అన్నావు... మరి ఆ వ్యవహారంలో నిన్నెలా రానిస్తారయ్యా?" అడిగాడు సర్వోత్తమరావు.
"అంటే నేను మొగుడ్ని కద్సార్... మొగుడినైతే రానిస్తారు సార్ కానీ నేను లోపలకి వెళ్ళగానే నర్సింగ్ హొం స్టాప్ మొత్తం బయటికి వచ్చేస్తారు సార్..."
"అలాగా? వెరీ స్ట్రేంజ్ వ్యవహారం!"
"అదే సార్... నేను కూడా అలానే అముకుంటున్నా సార్..."
"సరే... నేకసలె టైమైపోయినట్టుంది నువ్వు త్వరగాకదులు.
"అలాడే సార్... థాంక్యూ సార్."
గబగబా నాలుగడుగులు ముందుకు వేశాడు.
"ఇదిగో నిన్నే బాగోపోయినా నువ్వాఫీసుకి రావడం నాకేం నచ్చలేదు. ఇక్కడి వ్యవహారం ఎప్పుడు వుండేదే. నువ్వో నాలుగు రోజులు సెలవుపెట్టి మీ ఆవిడకి ఒంట్లో బాగున్నాక ఆఫీసుకురా" వెనకనుండి అరిచాడు సర్వోత్తమరావు.
"అలాగేసార్! మీరు చాలా దయార్ద హృదయాలు సార్..." అన్నాడు రాంపండు నాలుగు రోజుల లీఫ్ వేస్టయినందుకు మనసులో పళ్ళు కోరుక్కుంటూ.
రాంపండు ఆఫీసునుంచి బయటకి వచ్చి పడి అడుగులు వేశారో లేదో వెనకనుండి ఓ బలమైన చెయ్యి అతని భుజం మీద పడింది.
ఉలిక్కిపడిన రాంపండు వెనక్కి తిరిగి చూశాడు.
వెనకాల ఓ బారీ విగ్రహం నిలబడి వుంది. రాంపండు అయేమయంగా చూశాడు.
"ఒరేయ్ పండూ... నేన్రా... గుర్తుపట్టలేదా నేను రంగడిని! అంటూ రాపండుని గట్టిగా కౌగిలించేసుకున్నాడు.
ఆ కౌగిలికి రాంపండు ఉక్కిరిబికికిరి అయిపోయాడు. రంగడంటే రంగరావని రాంపండు చిన్నప్పటి ప్రెండ్. అప్పుడు సన్నగా గేదకర్రలా పొడుగ్గా వుండేవాడు ఇప్పుడు లావుగా వుండటంతో బారీగా తయారయ్యాడు.
"ఏంరా గుర్తుపట్టావా?" అన్నాడు రాంపండుని విడిచిపెడ్తూ.
"ఆ పట్టకేం....ఎలా వున్నావు? విజయవాడ నుండి ఇలా వచ్చావేం?" అడిగాడు రాంపండు. చిన్ననాటి స్నేహితుడు కలిశాదన్న అనందం ఓ ప్రక్కన వున్నా రాంగ్ టైంలో కలిసినందుకు అతనికి బాధగా వుంది. ఇంటి దగ్గర రాజీ అప్పటికే కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ వుంటుందని అతనికి తెలుసు.