"నిజానికి నేనే మీ ప్లాట్స్ కి రావాలనుకుంటున్నాను -' చెప్పింది శిరీష. "ప్లాట్ నెంబర్ సెవెన్ నాట్ వన్ అన్నారు కదా?"
"అవునవును! కానీ ప్లాట్ కి రావటం కంటే ఓ కార్డ్ రాసి పడేస్తే నేనే మీ ఆఫీస్ కొచ్చి కలుస్తాను కదా!"
"ఆరోజు మనిద్దరం బస్ స్టాప్ లో మాట్లాడుకున్న సంగతి అక్కయ్యకు తెలిసి కోపం వచ్చింది --"
"మైగాడ్! మనిద్దరి మధ్యా ఏమయినా ఉందని ఆమె అనుమానపడలేదు కదా!"
"అక్కయ్య సంగతి మీకింకా తెలీదు. చాలా బ్రాడ్ మైండ్!"
"ఆ నారో వైస్ట్ చూసినప్పుడే అనుకున్నాను - అయినా మనిద్దరి మధ్యా ఏమీ లేకపోతేనే ఆమె క్కోపం రావాలి గానీ ఉంటె యెందుకొస్తుంది?"
శిరీష మరింత విచిత్రంగా అందంగా సెక్సీగా చూసింది.
"అదేమిటి? మనిద్దరి మధ్యా ఏమీ లేకపోతే ఎందుక్కోపం వస్తుంది ?"
"ఎవరికయినా వస్తుంది -- మనిద్దరి మధ్యా కనీసం ఓ నూలు పోగయినా లేకపోతే రాదూ మరి?"
శిరీష మొఖంలో రక్తం పంపు కొట్టినట్లు ప్రవహించింది.
సిగ్గుతో చూపులు మరల్చేసుకుంది.
"ఛీ! ఏమిటా మాటలు ?"
"ఇంతకు మా 701 కి ఎందుకు రావాలనుకున్నారు ?"
"అనుకోకుండా సం ఇన్సిడెంట్ జరిగింది మొన్న --"
"ఏమిటది?"
"మా మామయ్య కొడుకు -- అంటే మా బావ అజయ్ దుబాయ్ నుంచి వచ్చాడు --- అతను ఒరిజనల్ గా మా అక్కను ప్రేమించాడు గానీ మాకూ, మా మావయ్యవాళ్ళకూ చాలా కాలంగా తగాదాలుండటం మూలాన -- మా మావయ్య వాళ్ళ పెళ్ళికి వప్పుకోలేదు. చేసుకుంటే మా అక్కనే చేసుకుంటాను -- లేపోతే పెళ్ళే చేసుకోనని వాళ్ళ నాన్నతో పోట్లాడి అజయ్ దుబాయ్ వెళ్ళిపోయాడు. ఈలోగా మా అక్కయ్య పెళ్లి ఇంకొకరితో అయిపొయింది. అజయ్ ఇప్పటివరకూ పెళ్ళి చేసుకోకుండా భీష్మించునే సరికి మా మావయ్య గత్యంతరం లేక వచ్చి మా అక్కయ్య కాళ్ళ మీద పడ్డాడు.
మా అక్కయ్య చెప్తే విని పెళ్ళి చేసుకుంటాడని మా మావయ్య నమ్మకం.
మా అక్కయ్య జాలిపడి వప్పుకుని అజయ్ ని పిలిపించి మాట్లాడింది.
అతను ఇప్పుడు నన్ను చూసి ప్రేమలో పడ్డాడు. నాలుగేళ్ల క్రితం మా అక్కయ్య ఎంత అందంగా ఉండేదో, ఇప్పుడు నేనంత అందంగా ఉన్నానని నన్నే చేసుకుంటానని పేచీ పెట్టాడు. మా అక్కయ్య, మా మావయ్య కూడా మాకిద్దరికీ పెళ్ళి చేయడానికి వప్పుకున్నారు. ఇప్పుడు ముహూర్తాలు లేవు కనుక అక్టోబరులో పెళ్ళి చేయాలని ప్లాన్!"
సురేష్ ముఖం వాడిపోయింది.
"మనం ప్రేమించుకుని కొద్ది రోజులయినా కాలేదు -- అప్పుడే ప్రేమకు పరీక్షలా? నీకా పెళ్ళి ఇష్టం లేదని మీ అక్కతో చెప్పలేవూ?"
నేను మీకూ ముందే చెప్పాను అక్కయ్య కెదురు చెప్పలేనని! అది నా వీక్ నెస్! అదీ గాకుండా డబ్బూ, చదువూ, ఉద్యోగం ఉన్నవాడిని కాదనాలంటే మీకు కనీసం ఏదొక ఉద్యోగం ఉండాలి కదా!"
'అవును! ఉండాలి!"
"ఏది మరీ?"
సురేష్ చిరాగ్గా తలగొక్కున్నాడు.
"అంటే నేను ఉద్యోగం సంపాదించుకోడానికి మూడు నెలలు గడువుంది. ఈలోగా ఉద్యోగం దొరుకుతే నువ్ నాకు దొరుకుతావ్! లేకపోతే ఇంకోడికి దొరుకుతావ్! అంతేనా?"
"అంతే!"
"సరే! నీకోసమయినా - ఎంత నికృష్టమయిన ఉద్యోగమయినా వెంటనే సంపాదిస్తాను ! చూస్కో --"
శిరీష నవ్వింది.
"విష్ యూ గుడ్ లక్! నేను వెళ్తాను -"
అప్పుడే ఆగిన బస్ ఎక్కేసిందామే.
సురేష్ కి అశాంతిగా ఉంది. శిరీష అక్క మీద కోపంగా వుంది. ప్రపంచంలోని అందమయిన అమ్మాయిల అక్కలందరికీ ఉరి తీయాలని ఉంది --- అసలు జీవితంలో పెళ్ళే చేసుకోకూడదని కూడా ఉంది --- కానీ --
ఇంత అందమయిన అమ్మాయిని వదులుకోడానికి మనసొప్పటం లేదు.
ఎలాగయినా కుముదిని ద్వారా మేరీ పుండరీకాంక్షయ్య ను పట్టాల్సిందే ---- దానికి మించిన మార్గం ఇంకోటి తనకు కనిపించటం లేదు . కుమిదిని బ్లాక్ మెయిల్ కి బెదరటం లేదు గనుక ఎల్లో మెయిల్ కి లొంగుతుందేమో చూడాలి.
ఆప్టరాల్ ఓ పనిమనిషికి అంత పోగరేమిటో అర్ధం కావటం లేదు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ మధ్యాహ్నం మూడింటికి స్టార్టయింది.
కొత్తగా ప్రారంభించబోతున్న కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్--
చాలా మోడరన్ డ్రస్ లో చాలా శరీరాన్ని ఎక్స్ ఫోజ్ చేస్తోందామే.
"డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ట్రైనింగయావా?"
'అవును మేడమ్---"
"సర్టిఫికేట్ ఉందా?"
"ఇవ్వలేదు వాళ్ళు --- ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నామెకి తొమ్మిదో నెల వచ్చిందని జాబ్ మానేసింది. దాంతో ఆరు నెలల కోర్స్ మూడో నెల వచ్చేసరికి ఆగిపోయింది. ఆవిడ డెలివరీ అయాక తిరిగి ఉద్యోగంలో చేరుతుందని మాకు ఏడో నెల వచ్చేవరకూ ఆ ఇన్ స్టిట్యూట్ చుట్టూ తిరిగాను గానీ ఉపయోగం లేకపోయింది. ఆవిడకు అబార్షన్ అయి ఉద్యోగం శాశ్వతంగా మానేసింది. దాంతో మా ఆరునెలల కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ కూడా అబార్ట్ అయిపొయింది ."
ఆమె చిన్నగా నవ్వింది.
"నాకు తెలుసు! కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్స్ స్టూడెంట్స్ అందరినీ మోసం చేస్తున్నాయనే నేనీ ఇన్ స్టిట్యూట్ పెట్టాను. ఇక్కడ మోసం అనేది ఉండదు. కోర్స్ లో చేరిన ప్రతి ఒక్కరికి కోర్స్ ముగిసేసరికి ఖచ్చితంగా సర్టిఫికెట్స్ ఇచ్చేస్తాము . పాసవటం - అవకపోవటం అంటూ వుండదు. అందరూ పాసయి తీరాల్సిందే----లేదంటే మనీ బాక్ ---ఎలా వుంది ?"
"సింప్లీ సూపర్బ్ మేడమ్! మీలాంటి మనీ బాక్ మనస్తత్వం గల వాళ్ళు ఊరి కొకరుంటే చాలు! దేశం బ్రహ్మాండంగా షయినవుతుంది ."
"మీకు జీతం ఎంత ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు?"
'ఆరొందల నుంచీ పదిహేను వేల వరకూ మేడమ్"
ఆమె వింతగా చూసింది.
"పదిహేనువేల? పదిహేనువేలు నెలజీతం ఇస్తారా ఎవరయినా?"
"ఇచ్చేవాళ్ళు చాలా మంది వున్నారు మేడమ్! మనకి లింక్ దొరకటం లేదంతే"
"ఎవరిస్తారు ?"
"ఉదాహరణకి హర్షద్ మెహతా , అంతులేలు, సెంట్రల్ మంత్రులు ప్రధాన మంత్రులు కొడుకుల కంపెనీలు , విన్ భాదాలు దావూద్ ఇబ్రహీమ్ , సింగిల్ నెంబర్ లాటరి సంస్థలూ......."
"ష్!" అందామె అతని ధోరణికి అడ్డువేస్తూ.
"సురేష్!" అంటూ ఆపేశాడు.
"నీకు మూడు వందలు జీతం ఇస్తాము"
"ఈ ఉద్యోగం చేసే బదులు మీల్ ప్రాస్టిట్యూట్ గా ఉంది. ఎక్కువ డబ్బు సంపాదించవచ్చునుకుంటాను "
"అందులోనూ డబ్బు రాదు. మనదేశంలో మెజారిటీ వాళ్ళే" నవూతూనే చావుదెబ్బ కొట్టింది.
"కంప్యూటర్ సంస్థల్ల్లగా" మొఖం పగిలేటట్లు యెదురు దెబ్బ కొట్టాడు.
ఊహించినట్లే ఆమె కోపంగా చూసింది.