Home » Vasireddy seeta devi novels » Dr Vasireddy Sitha Devi Rachanalu - 4


    హేమ ఎలా ఉందో! బాగా చదివి, పెద్ద పెద్ద డిగ్రీలు పొంది వుంటుంది. చాలా హుందాగా, గంభీరంగా ఉంటుందేమో! మంచి హోదాలో ఉన్న యువకుణ్ణి వివాహం చేసుకొని ఉంటుంది. ఆమె భర్త ఎలా వుంటాడో?   

 

    చంద్రం హృదయాంతరాళాలలో ఎక్కడో అశాంతి పొర్లినట్లనిపించింది. హేమకు వివాహం అయివుంటుందా? అది జరగటానికి వీల్లేదు. అలా ఎన్నటికీ జరిగివుండదు. పదిహేను సంవత్సరాల బాలుడికంటే పధ్నాలుగు సంవత్సరాల బాలిక మానసికంగా ఎంతో పెద్దదిగా పెరుగుతుంది. తన వయస్సుతోపాటే తనకు తెలియకుండానే, తనలోని ప్రతి జీవాణువుతోపాటు హేమయెడల ప్రేమకూడా పెరిగింది తనలో. మరి హేమా? ఆమె తనను ఎంతో గౌరవించి అభిమానించేది. అలాంటి తను కంటికి దూరం కాగానే ఆమె హృదయంకూడా దూరం అయివుండాలా? అలా ఎన్నటికీ జరగదు. ముఖ్యంగా -స్త్రీ జీవితంలో ఒక్కసారే ప్రేమించగలదు. హేమ అవివాహితగానే ఉండి ఉంటుంది.

 

    అంతలోనే చంద్రంలో భావుకత్వం స్థానాన్ని, వివేకం ఆక్రమించుకుంది. తనెంత స్వార్థంగా తెలివితక్కువగా ఆలోచిస్తున్నాడు? దొంగగా ఇల్లు విడిచి పారిపోయి, ఎనిమిది సంవత్సరాలుగా జాడలు తెలియని తన కోసం హేమ అవివాహితగా ఉండి ఉంటుందని ఊహించుకొని ఆనందిస్తున్నాడు. ఆమె అవివాహితగానే ఉండాలని కోరుకుంటున్నాడు.

 

    మానవుడు ఎంత కృత్రిమంగా బతకటానికి ప్రయత్నిస్తున్నాడు? వస్తువులకు రంగులువేసి , సత్యానికి ముసుగు కప్పి, తనకు కావాల్సిన రూపంలో చూట్టానికి ప్రయత్నిస్తూ తనను తానె మోసం చేసుకొంటున్నాడేమో? వస్తువులను వాటి అసలు రూపంలో చూట్టానికి, సత్యాలను నగ్నంగా చూట్టానికి మానవుడు భయపడటానికి కారణం ఏమిటో?

 

    ఆలోచిస్తున్న చంద్రం కళ్ళు అప్రయత్నంగానే వినీలాకాశంలో మేఘాలచాటున దోబూచులాడుతూ రైలుతోపాటు తనూ పయనిస్తున్నట్లున్న పూర్ణచంద్రునిమీద పడ్డాయి. పరిపూర్ణుడై తన సుధాంశువులతో సమస్త ప్రకృతినీ ఆనంద డోలికలలో ఓలలాడిస్తోన్న ఈ చంద్రుడు రేపటినుంచీ క్షీణించడం మొదలుపెడతాడు - దేనికోసం - ఎవరికోసం? చంద్రం కళ్ళు వెన్నెల వెండితొడుగు తొడుగుకున్నట్లున్న కొండలవైపూ, అక్కడనుంచి చెట్లవైపూ వాలాయి. సృష్టిలోని సమస్త వస్తువులూ నగ్నంగానే ఉంటాయి. మానవుణ్ణి మినహాయించి ప్రతి ప్రాణీ నగ్నంగా, సహజంగానే జీవిస్తుంది.    

 

    రాతియుగంలోని మానవుడు కూడా నగ్నంగా ఉండేవాడనీ, సహజంగా జీవించేవాడనీ తను చదివాడు. నగ్నంగా జీవించిన మానవుడిలో పాపపుణ్యాల భావం ఉండేదికాదట! మహర్షులు నగ్నంగా ఉండటానికి కారణం అదేనేమో?

 

    మానవుడిలో స్వార్థం, కృత్రిమత్వం తలలెత్తాయి. శరీరంమీది అచ్ఛాదనలతోపాటు, క్రమంగా తన ఆత్మను కూడా తననుంచే దాచటానికి ప్రయత్నించసాగాడు. పాపపుణ్యాలకు నిర్వచనాలు ఏర్పడ్డాయి. పాపాలను దాచటానికి అనేక కృత్రిమ అచ్ఛాదనలను సృష్టించుకొంటున్నాడు. ఈనాటి మానవుడు నగ్నసత్యాలంటే భయపడటానికి కారణం ఇదేనేమో? తన జీవితంతోపాటు పెనవేసుకొని వేలసంవత్సరాలుగా వస్తున్న ఈ కృత్రిమ ముసుగుల్ని మానవుడు తొలగించుకొని ఏనాటికైనా బయటపడగలడా? ఏమో, అది సంభవం కాకపోవచ్చును!  

 

    ఏమిటి - ఈ రోజు తనలో చాలా విచిత్రమయిన ఆలోచనలు రేగుతున్నాయి? ఆలోచనలనుంచి బయటపడ్డానికి ప్రయత్నించిన చంద్రానికి రజని జ్ఞాపకం వచ్చింది.

 

    రజని ఎలా ఉందో ఇప్పుడు? రజని అచ్చు తన పోలికే అనేవారు అందరు. ఈ మాట ఎవరైనా అన్నప్పుడు వదిన ముఖంలో మారే రంగులు చూడాల్సిందే! వదినకు ఎందుకో తనమీద అంతకోపం? డబ్బుమీదగల వ్యామోహమే అందుకు కారణం కావచ్చు. ఆస్తికి వారసుడు తన భర్తతోపాటు ఇంకోడు ఉండటం ఆమెకు ఇష్టం ఉండిఉండదు. తనకు ఆస్తిలో చిల్లిగవ్వకూడా అక్కరలేదని చెప్పేయదలచుకొన్నాడు. తనమీద మోపిన దొంగతనం తాలూకు - ఆ వెయ్యి రూపాయలూ అన్న ముఖంమీద కొట్టదలచుకొన్నాడు.  

 

    ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న చంద్రం, మెయిల్ బెజవాడ స్టేషన్ చేరుకొన్నది కూడా గమనించలేదు. పెట్టెలోవాళ్ళ కేకలకు ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు. గుంటూరు బండి కదలటానికి సిద్ధంగా ఉంది. త్వరగా కూలీని పిలిచి సామాను పట్టించుకొని బండి ఎక్కాడు. మెయిల్ మూడుగంటలు ఆలస్యమైనా అదృష్టవశాత్తూ గుంటూరు బండి అందింది. అదే చాలనుకున్నాడు. బండి గుంటూరు చేరుకొనేసరికి మూడున్నర అయింది.

 

    ఇంతలో చీకటిలో ప్రకాశం ఇంటికి వెళ్ళటంకంటే తెల్లవారేంతవరకూవెయిటింగ్ రూములో గడపటం మంచిదనుకున్నాడు. సామాను మొదటి తరగతి వెయిటింగ్ రూమ్ లో పెట్టించి, కూలీకి డబ్బులిచ్చి పంపించేశాడు. కళ్ళు మూసుకొని ఈజీఛైర్ లో పడుకున్న చంద్రాన్ని మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి.

 

    ఒక అర్ధగంట ఎలాగో గడిపాడు. వెయిటింగ్ రూమ్ లోని గడియారం నాలుగు గంటలు కొట్టింది. గుంటూరులో, ముఖ్యంగా స్టేషన్ దగ్గరలో ఉన్న హోటళ్ళు నాలుగింటికే తెరుస్తారని తెలుసు చంద్రానికి. కొంచెం కాఫీ తాగి వచ్చి చిన్నగా ప్రకాశం ఇంటికి బయలుదేరవచ్చుననుకున్నాడు.   

 

    చంద్రం లేచి బాత్ రూమ్ లోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాడు. పెట్టే, బెడ్డింగ్ క్లోక్ రూములో పెట్టించి, కాఫీ తాగటానికి స్టేషన్ బయటకు నడిచాడు.   

 

    ఈ ఎనిమిది సంవత్సరాలలో గుంటూరు ఎంతో మారిపోయినట్లనిపించింది చంద్రానికి. చల్లనిగాలి వీస్తూంది. ఇంత కాలానికి తన పుట్టిన గడ్డపై కాలు పెట్టాడు. అతనిలో ఏదో చిత్రమయిన అనుభూతి కలుగుతోంది. హోటల్లో కాఫీ తాగి బయటకు వచ్చిన చంద్రానికి చల్లగాలికి అలా కొంచెం తిరగాలనిపించింది. పట్టణంలో వచ్చిన మార్పును గమనిస్తూ ముందుకు నడుస్తున్నాడు. దూరంగా కనిపించే ఎత్తయిన పొగ గొట్టాలు చూసి పారిశ్రామికంగా పట్టణం చాలా అభివృద్ధి చెందింది అనుకున్నాడు.   

 

    అలా బజార్లన్నీ కలియజూస్తూ ముందుకు నడుస్తున్న చంద్రం ఒక మలుపు తిరిగాడు. అక్కడ పెద్ద భవనం, దానిచుట్టూ ప్రహరీ గోడ కనిపించాయి. అంతకు ముందు ఆ భవనం అక్కడ లేదు. కుతూహలంతో ఆ భవనాన్ని గమనిస్తూ నడుస్తున్న చంద్రం చటుక్కున ఆగిపోయాడు ప్రహరీగోడ ప్రక్కనే ఏదో పెద్ద మోత వినిపించింది. ఉలిక్కిపడి నిలబడి పోయిన చంద్రానికి గోడమీద ఏదో నీడ కనిపించింది. తెల్ల దుస్తులలో ఉన్న ఒక మానవాకారం ముందు దేన్నో పడేసి తర్వాత తను కిందకు దూకడానికి ప్రయత్నిస్తున్నది. ఆ ఆకారం స్త్రీ రూపమని లీలగా గ్రహించిన చంద్రం గుండె దడదడలాడింది. దెయ్యాలంటే చిన్నతనంలో తను భలే భయపడేవాడు. కాని ఇప్పుడు తనకు దయ్యాలున్నాయనే నమ్మకం లేదు. ధైర్యం కూడదీసుకొని ఒక అడుగు ముందుకు వేశాడో లేదో - గోడమీద ఆకారం కిందకు దూకటం, అంతకు ముందే పడేసిన వస్తువుని చేత్తో తీసుకొని పరిగెత్తటం కనిపించింది. చంద్రం కూడా అప్రయత్నంగా ఆ ఆకారం వెనక పరిగెత్తాడు.   

 

    సందు గొందులు తిరిగి ఆ ఆకారం అకస్మాత్తుగా మాయం అయింది. చంద్రం ఆశ్చర్యంగా పది నిముషాలు అటూ ఇటూ చూసి, ఇక లాభంలేదని ముందుకు నడిచాడు. ఆ భవనం ఎవరిదో, ఆ పారిపోయిన వాళ్ళెవరో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది అతనికి. ఒక స్త్రీ ఆ విధంగా గోడదూకి పారిపోవటం ఏమిటో - ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయాడు అతడు.

 

    ఆ పెద్ద భవనం గేటు ముందుకొచ్చి నిలిచాడు చంద్రం. గూర్ఖావాడు గోడకానుకొని నిద్రపోతున్నాడు. చంద్రం భుజం పట్టుకుని గూర్ఖావాణ్ణి ఊపాడు. వాడు ఉలిక్కిపడి బిల్లంగోడులా ఎగిరి నిల్చున్నాడు. కొంచెం తమాయించుకొని ముఖం చిట్లించుకుంటూ చంద్రం ముఖంలోకి 'ఏం కావాలి?' అన్నట్లు చూశాడు.   

 

    "ఈ ఇల్లెవరిది?"

 

    చంద్రం ప్రశ్నకు గూర్ఖావాడు ఫక్కున నవ్వాడు. గేటుకు కుడిపక్క గోడకు తగిలించి ఉన్న సైనుబోర్డువైపుకు చెయ్యి చూపించాడు.

 

    'అనాధ శరణాలయం' అన్న బోర్డు చూడగానే చంద్రానికి అంతా అర్థం అయింది.

 

    "ఒక అమ్మాయి యిప్పుడే గోడదూకి పారిపోయింది."

 

    గూర్ఖా చంద్రం ఊహించినట్లు ఏమీ గాబరాపడలేదు కొంచెంకూడా చలించలేదు.

 

    "ఎప్పుడూ ఎవరో ఒహరు పారిపోతూనే వుంటే ఇంత పెద్ద ప్రహరీ, గేటుముందు ఈ గూర్ఖావాడూ ఎందుకో? అని గొణుక్కుంటూ ముందుకు నడిచాడు చంద్రం.

 

    అనాధ శరణాలయంలో అనాధలయితే ఉంటున్నారు కాని శరణం అనేదే లేదు. శరణాలయాలు స్థాపించటం, సోషల్ వర్కర్సుగా పేరు ప్రతిష్టలు సంపాయించుకోవటం, అంతా ఓ కొత్త జీవనోపాధికి మార్గాలు మాత్రమేనా? ఈ శరణాలయాల్లో ఆదరణా, ప్రేమా, లభిస్తూవుంటే అనాధలు యిలా ఎందుకు పారిపోతారు? మానవునికి కావలసింది కేవలం కడుపుకింత అన్నమేకాదు. శరీరాన్ని పెంచటానికి ఆహారం ఎంత అవసరమో, మానసికాభివృద్ధికి ప్రేమ, ఆదరణలుకూడా అంతే అవసరం. శారీరక పుష్టితోపాటు మానసిక పుష్టికూడా కావాలి మానవునికి. బహుశా దీనివల్లనే మానవుడు మిగతా ప్రాణులకంటే శ్రేష్ఠుడేమో!

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra