Previous Page Next Page 
ష్....మాట్లాడొద్దు పేజి 13

    భార్గవ పోలికల్లో వున్న వ్యక్తి మధ్యప్రదేశ్ జైలులో నుంచి తప్పించుకున్నాడని ఇన్పర్మేషన్ వచ్చింది. అతనికి అమ్మాయిల పిచ్చి.  అతనో సెక్స్ మానియాక్.  బ్యాంకులో లేడీస్టాప్ తో  భార్గవ కలుపుగోలుతనం కూడా డౌటొచ్చింది. భార్గవ అమ్మాయిలతో అంత సన్నిహితంగా వుండడు.
    అది కన్ఫర్మ్ చేయడానికి సరితను మీ యింటికి తీసుకుచ్చాను. అయితే అసలు విషయం చెప్పడానికి  నేను  కాస్త సంశయించవలసి వచ్చింది.  మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి" చాలా సంస్కారయుతంగా చేతులు జోడించి అన్నాడు కృపాల్.
    ప్రణవి  కృపాల్ కాళ్ల మీద పడిపోయింది.
    "మీరు నాకు దేవుడితో  సమానం.  మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను.  నాది  ఒకే ఒక కోరిక,  నాకు నా భర్తను చూడాలనివుంది,  దయచేసి నా భర్తను నాకు తెచ్చి యివ్వరు."
    ఆమె హృదయవిదారకంగా అడుగుతుంటే కృపాల్ మనసు చివుక్కు మంది.
    "తప్పకుండా... మీ భర్తను మీకు అప్పగించే పూచీనాది...లేవడం...కాస్త కాఫీ తాగి రిలాక్సవ్వండి....మీ వాళ్లకు కబురు పంపమంటారా?"
         "వద్దు ...నా భర్త   కనిపించడంలేదనే విషయం మనిద్దరి మధ్యనే వుండిపోనీయండి...నా భర్తతో  కలిసే తిరిగి నా పుట్టింటికి వెళ్తాను.  అప్పటివరకు ఆయన కోసం  ఎదురుచూస్తాన్నేను"  స్ధిరంగా దృఢంగా అంది ప్రణవి.
    విస్పారిత నేత్రాలతో చూస్తుండిపోయాడు.   వాటే గ్రేట్ పర్సనాలిటీ...అనుకున్నాడు.  ఎక్కడో పురాణాల్లో చదివాడు.
    భర్తకోసం  యముడి  వెంట వెళ్లిన సావిత్రి కథ చదివాడు.   ఈరోజు భర్త కోసం ఎదురు చూస్తానంటోన్న ప్రణవి ని
చూస్తున్నాడు.
    ఏ సెంటిమెంట్లూ,   ఎమోషన్సూ   లేవనుకున్న కృపాల్ కదిలిపోయాడు సెంటిమెంట్ కు   కన్నీళ్లను  రప్పించే శక్తివుందా?
    "వస్తానుసార్...మీకు అభ్యంతరం  లేకపోతే,  రోజుకోసారి మీకు ఫోన్  చేసి నా భర్త గురించీ తెలుసుకుంటాను" అంది బయల్దేరడానికి సిద్ధమవుతూ ప్రణవి.
    ప్రణవి బయల్దేరబోతుంటే అన్నాడు కృపాల్.
    "మరో విషయం...మీ భర్త భార్గవ రూపంలో మీ దగ్గరికి వచ్చిన వ్యక్తి చనిపోయాడు. బాంబు బ్లాస్ట్ తో.
    ఆ మాట విన్న ప్రణవి నిట్టూర్చింది.  ఆ నిట్టూర్పులో తన జీవితానికి  మచ్చతీసుకురావాలనుకున్న వ్యక్తి చచ్చాడన్న ఆనందం వుంది వుంటుంది.
    జేమ్స్ డేవిడ్ కోపంతో వూగిపోతున్నాడు. తనంతట తానుగా భార్గవ రూపంలో వున్న వ్యక్తిని,  తన యిద్దరు అనుచరులని,  డైవర్ ని చంపేసాడు.  దీనిక్కారణం కృపాల్.  అతని మొహం ఎర్రబడింది.  కృపాల్  ని  చంపేయాలన్నంత కసి కనిపిస్తోందతని   మొహంలో.
    విసుగ్గా అటు యిటూ పచార్లు చేస్తూ వుండిపోయాడు.
    ఏదో ఒకటి చేయాలి.  తన పేరు వినగానే ఆ కృపాల్ ఉలిక్కిపడేలా చేయాలి.  పచార్లు ఆపి,   ఎదురుగా గదిలోవున్న కుర్రాళ్లను చూసాడు.అందరూ బిక్కుబిక్కుమంటూ కూచున్నారు.  అతని సరాసరి పార్ధసారధి వున్న గదివ్తెపుకు వెళ్లాడు.
   పార్ధసారధి  కళ్లు  తెరిచాడు.
    ఎదురుగా జేమ్స్ డేవిడ్.
    "హలో...డాక్టర్...వెరీ  బ్యాడ్ మార్నింగ్ " పార్ధసారధి మాట్లాడలేదు.
    "ఈ ముసుగులో గుద్దులాట వద్దు... స్ట్రయిట్ గా  విషయానికి వస్తాను...నువ్వు ఎఫీషియంట్ సర్జన్ వి.  నువ్వు చేయలేని ఆపరేషన్ లేదు...నీతో మాకు   పనివుంది.  మేము చెప్పినట్టుగా చేయాలి...ఏమంటావ్?" డేవిడ్ సూటిగా అడిగాడు.
    "యింపాసిబుల్...ఇప్పటికి ఓ తప్పు చేసాను.   చిన్న బలహీన తతో నీలాంటి శాడిస్ట్ కు   దొరికిపోయాను. మర్యాదగా నన్ను వదలిపెట్టు...నేను మామూలు వ్యక్తిని కాదు.  నేను కనిపించడం లేదన్న విషయం తెలిసిన వెంటనే,  నాకోసం గాలింపు మొదలవుతుంది.  నా కూతురు స్టేట్స్ లో  వుంది.  నా గురించి  ఎంక్వయిరీ  మొదలెట్టి,  అవసరమైతే  పొలీసు డిపార్ట్ మెంటునే   కదిలిస్తుంది"  కోపంగా అన్నాడు పార్ధసారధి.
    "అచ్చా...ఠీక్ హ్తె...యిప్పుడు నిన్ను వదిలేయాలా?   అలాగే...పోనీ...నీ కూతుర్ని కిడ్నాప్ చేయాలా?"
    ఒక్కసారిగా  జేమ్స్  డేవిడ్ మాటలతో ఉలిక్కిపడ్డాడు.
    "వాట్ నాన్సెన్స్  యు ఆర్ టాకింగ్.   నా కూతుర్ని నువ్వేమీ చేయలేవు."
    "చేయగలను...నువ్వు నా దగ్గరన్నావని   నేనో ఫోన్ కాల్ చేసాననుకో...నిన్ను విడిపించుకోవడానికి వస్తుంది.   అన్నట్టు...నీ  బిడ్డ...అదే నీ కూతురు చాలా అందంగా వుంటుందటగా.  ఆమె కిడ్నీ,  కన్ను కాలేయం...అబ్బో...రేటు బాగానే పలుకుతుంది.  రేప్ చేసాక, ఆమె కిడ్నీ తీసి అమ్ముకోవచ్చు.   అన్నట్టు నాకు అమ్మాయిల శరీరాలను తినడం అంటే  ఎంతిష్టమో"  చాలా క్యాజువల్ గా అన్నాడు జేమ్స్ డేవిడ్.
    వణికిపోయాడు  చిగురుటాకులా పార్ధసారధి.  జేమ్స్ డేవిడ్ అన్నంత పని చేస్తాడని తెలుసు.
    "ఆల్ రైట్...నువ్వు చెప్పిన పని చేస్తాను... ఏం చేయాలో చెప్పు...కాని, నువ్వు చెప్పిన పని చేయగానే నన్ను వదిలేయాలి...నా కూతురి జోలికి వెళ్లొద్దు" అన్నాడు పార్ధసారధి.
     "దట్స్  గుడ్.. సింపుల్...శాంపిల్ గా నలుగురి కుర్రాళ్ల కిడ్నీలు,  కళ్లు ,  కాలేయం,  ఊపితిత్తులన్నీ వేరుచేయాలి...అందుకు ఆపరేషన్ థియేటర్ రెడీ...
    ఆ తర్వాత...ఆ నలుగుర్నీ చంపి కొద్దికొద్దిగా తిని పోలీసు డిపార్ట్ మెంటుకు కానుగ్గా పంపిస్తా" అన్నాడు జేమ్స్ డేవిడ్ క్రూరంగా.
   డాక్టర్ పార్ధసారధి చేతులు వణుకుతున్నాయి.   తనిప్పుడు ఆపరేషన్ థియేటర్ లో  వున్నాడు. కానీ తన స్వంత థియేటర్ కాదు.  జేమ్స్ డేవిడ్ ఏర్పాటుచేసిన ఆపరేషన్  థియేటర్.
    వరుసగా స్ట్రెచర్  మీద స్పృహ తప్పి పడివున్న మనుషులు.
    శ్యామ్ , మోహన్,  స్వరూప్, ప్రదీప్.
    చిదిమితే పాలిగారే వయసు...చాలా చిన్న వయసు...చదువుకునే కుర్రాళ్లు...మరో స్ట్రెచర్ మీద భార్గవ.
    పార్ధసారధి చేతులు వనుకుతూనే వున్నాయి.  అతనికి ఏడుపు తన్నుకొచ్చేస్తోంది.
    ఓ మనిషిని బ్రతికించే ప్రయత్నం  కాదు.  కిడ్నీ చెడిపోతే తీసి వేయడం కాదు.  ఆరోగ్యంగా వున్న వ్యక్తి అవయావాలను తను దొంగిలిస్తున్నాడు.
    దేవుడా...ఇదేమి సృష్టి నాది...ప్రాణం పోయాల్సిన నా చేతులతో ప్రాణాలను తీయించే పని చేయిస్తావా?  అతని మనసు మౌనంగా రోదిస్తోంది.  ఓ వైపు వృత్తి ధర్మానికి ద్రోహం చేస్తోన్న ఫీలింగ్...మరోవైపు కన్న కూతురిని వదులుకోలేని బలహీనత.
    రెంటి మధ్య సందిగ్ధం.
    చివరికి కన్నకూతురి మీద అతనికున్న ప్రేమ గెలిచింది.
    వృత్తి ధర్మాన్ని వెన్నుపోటు పొడవటానికి సిద్ధపడ్డాడు నిస్సహాయస్దితిలో డాక్టర్ పార్ధసారధి.
   ఇన్స్ పెక్టర్  కృపాల్ యింటి ముందు  వ్యాన్ఆగింది.  వ్యాన్ మీద  హొమ్  నీడ్స్'  అని పెయింట్ చేసివుంది.డైవర్  సీట్లో నుంచి వ్యాన్ దిగాడు జేమ్స్ డేవిడ్.  పొడవాటి గడ్డం మీసాలు నెత్తిమీద టోపీ అతని వేషం గమ్మత్తుగా వుంది.
    కృపాల్ యింటి ముందు వ్యాన్ ఆగడం చుట్టుపక్కల  వాళ్లు చూసాను.
    కృపాల్ సామాను  సూపర్ మార్కెట్ నుంచి తెప్పించుకున్నాడేమో లను కున్నారు.
    బ్యాక్ డోర్ ఓపెన్ చేసాడు.
    బస్తా సంచీ  కిందకి దించాడు బస్తా సంచీ చివర రక్తపు మరకలు  వున్నాయి.  తననెవరూ గమనించడం లేదనే విషయం కన్ ఫర్మ్ చేసుకున్నాడు జేమ్స్ డేవిడ్.
    ఆ బస్తాను కిందికి దించాడు.  అటూ యిటూ చూసి కృపాల్ యింటి ముందు నిలబడి జేబులో నుంచి తళా ల గుత్తి తీసాడు.  ఒక్కో తాళం చెవితో  ట్రై చేయసాగాడు.
    రెండునిమిషాల  తర్వాత తాళం తెరచుకుంది.   తలుపు తీసి బస్తాను లోపలికి  తీసుకెళ్లాడు. బస్తా ముడిని విప్పాడు లోపలి ఓ శవం వుంది.  శ్యామ్ డెడ్ బాడి  అది.
    చాలా  భయంకరంగా వుంది శవం.  అతనికి  కళ్లు లేవు.  ఆ స్ధానంలో గుంతలు పడివున్నాయి.  ఆపరేషన్ అయినట్టు కుట్లు స్పష్టంగా తెలుస్తున్నాయి.
    ఆపరేషన్ ఆయిన వెంటనే ఘోరంగా చంపేసారు. శరీరాన్ని కత్తితో చెక్కినట్టు...భయంకరంగా వుంది.
    హాలు మధ్యలో శవాన్ని వదిలారు.
    కిచెన్ రూమ్ లోకి  వెళ్లాడు.
    స్టవ్ ఆన్ చేసి,  పాలగిన్నె స్టవ్ మీద పెట్టి తాపీగా కాఫీ చేసుకొని తాగాడు. ఫ్రిజ్ లో  వున్న బ్రెడ్, జామ్ తిన్నాడు.   కలర్ టి. వి  దగ్గరికి వెళ్లాడు.
    దానిని శబ్దం కాకుండా కిందపడేసాడు.  చిన్న శబ్దంతో స్ర్కీన్ పగిలిపోయింది.  కృపాల్ బెడ్ రూంలోకి  వెళ్లాడు. జేబులో నుంచి నైఫ్ తీసి పరుపును అడ్డంగా కోసేసాడు.  తర్వాత తీరిగ్గా హాలులోకి వచ్చి టేపురికార్దర్  ఆన్ చేసి పాటలు వింటూ కూచుండిపోయాడు.
    ఏమాత్రం తొట్రుపాటు లేకుండా వున్నాడు జేమ్స్ డేవిడ్.  అరగంట తర్వాత టెలిపోన్ దగ్గరకు వెళ్లాడు. కృపాల్ పొలీసు స్టేషన్ నంబర్ తిప్పాడు.
    అటువైపు నుంచి ఫోన్ లిప్ట్ చేస్తోన్న చప్పుడు.
    "హలో...కృపాల్ దిస్ సైడ్"కృపాల్ అన్నాడు.
    "హలో" జేమ్స్డేవిడ్  కంఠంపలికింది.  "ఎవరుమీరు?"
    తెరలు తెరలుగా నవ్వు వినిపించింది.
    "ఏయ్...హు ఆర్యూ...ఎవరంటే  నవ్వుతారేంటి?"  కృపాల్ కోపంగా అడిగాడు.
    మళ్లీ నవ్వు...
    "ఆర్యూ మాడ్" కృపాల్ కంఠంలో కోపం.
    "ఎగ్జాట్లీ"   జేమ్స్ డేవిడ్ యిటువైపు నుంచి అన్నాడు.
    "ఎవర్నువ్వు?  ఎడ్కడ్నించి మాట్లాడుతున్నావు?" ఏకవచనంలోకి పోయాడు కోపంగా కృపాల్.
    ఒక్క క్షణం మౌనం.
    కృపాల్ ఓ కాని స్టేబుల్ ని  పిలిచి,  ఫోన్ ఎక్కడ్నుంచో ట్రేస్ చేయమని సైగ చేసాడు.
    "హ...లో..."నేను ఫోన్ ఎక్కడ్నుంచి  చేస్తున్నానో ట్రేస్ చేయాడానికి ప్రయత్నించొద్దు మిస్టర్ కృపాల్.  ఎందుకంటే నేను ఫోన్ చేస్తున్నది నీ యింతినుంచే.
    ఒక్క క్షణం స్దాణువయ్యాడు కృపాల్.
    తన యింటినుంచా?  "తాళం వేసిన తన యింట్లో నుంచి..."
    "ఈ మాత్రం నాలెడ్జి  లేకుండా ఇన్స్ పెక్టర్ వి  ఎలా అయ్యావు మిస్టర్ కృపాల్...తాళం వేసివున్న యింట్లో కి వచ్చి తాళం తీయడం పెద్ద కష్టమా? సేప్టీ పిన్ తో  కూడా తీయొచ్చు."
    "మా యింటికి ఎందుకు వెల్లావు?"
    "ప్చ్...పూలిష్ క్వశ్చన్...కాఫీ  తాగాలని అనుకున్నాను...హొటల్  కు  వెళ్లబుద్దేయలేదు.   సర్లే...ఆన్ ది వేకదా... నీ యింట్లో తాగి వెళ్దామనుకున్నాను.   ఎంతైనా ఎనిమీస్ మి  కదా...కాఫీ బావుంది...సర్లే , నువ్వు ఆతిధ్యం ఇవ్వకపోయినా, నీ  యింట్లో నేనే ఆతిధ్యం స్వీకరించాను కాబట్టి థాంక్స్ చెబుదామని ఫోన్ చేసాను.   అన్నట్టు నీ కలర్ టి.వి  నాకు నచ్చలేదు ఓల్డ్ మోడల్ ది...అందుకే ధాన్ని పగలగొట్టేసా..."
    కృపాల్ పిడికిళ్లు బిగుసుకున్నాయి.
    "ఏంటి...నమ్మడం లేదా...నేనప్పడూ సిన్సియర్ గానే చెబుతా...నమ్మకం లేకపోతే శాంపిల్ గా ఈ టేపురికార్డర్ నేలకేసి కొట్టనా?" అంటూనే జేమ్స్ డేవిడ్ పక్కనే వున్న టేపురికార్దర్ ని   నేలకేసి కొట్టాడు.
    ఆ శబ్దం అటువైపు  ఫోన్ లో  నుంచి కృపాల్ కు  స్పష్టంగా వినిపించింది.
    "చూసావా...నా  స్టయిల్ అంత...నాక్కోపం వస్తే నేను మనిషిని  కాదు...అఫ్ కోర్సు కోపం రాకపోయినా నేను మనిషిని కాను...అర్ధమైంద  నుకుంటాను" జేమ్స్ డేవిడ్ తాపీగా అన్నాడు.
    "అసలు...నువ్వెవరు?  నీకు, నాకూ శత్రుత్వం ఏమిటి?" కృపాల్ అడిగాడు.   అతనికి ఎంత ఆలోచించినా అర్ధం కావడంలేదు.
    "అప్పడే మరచిపోయావా ఇన్స్ పెక్టర్...భార్గవ రూపంలో వున్న వ్యక్తిని నేను  బంబువేసి చంపేలా చేసావు. అంతేకాదు నా అనుచరుణ్ణి  నీచేతే చంపించావు.  అఫ్ కోర్స్...వాళ్లని నేను చంపకపోతే,  ప్రాణాలతో  నువ్వు వాళ్లని పట్టుకొని, నీ టార్చర్  తో  వాళ్ల తో  నిజం చెప్పిస్తావని తెలుసు.  అయినా  నాకేం భయంలేదు.  కానీ,  నాకు సంబంధించిన నిజాలు మరొకరు చెబితే నేను భరించగలనా?  అందుకే చంపేసాను...సింపుల్ గా  బాంబు వేసి...మరి నేనలా చేయడానికి కారణం నువ్వు కదూ...అందుకే,నీ యింట్లో ఓ చిన్న కానుక  పెట్టి వెళ్తున్నా...బావుంటుంది.  ప్రెష్ డెడ్ బాడి...పైగా కాలేజీ కుర్రాడిది...

 Previous Page Next Page