"యూ...డెవిల్" అంటూ కానిస్టేబుల్స్ ను జీపు రెడీ చేయమని చెప్పాడు.
"నువ్వు స్టేషన్ నుంచి యిక్కడికి రావాలంటే ఎంత లేదన్న పావుగంట పడుతుంది ట్రాఫిక్ కదా...అరగంట... నో ఛాన్స్...నేను వెళ్తున్నాను. అన్నట్టు, తలుపు దగ్గరగా వేసి వెళ్తున్నాను. దొంగ వెధవలుంటారు...జాగ్రత్త...బై"
ఫోన్ పెట్టేసి వైరు పీకేసాడు. తాపీగా లేచి బయటకు వచ్చి డోర్ దగ్గరగా వేసి వ్యాన్ దగ్గరకు వెళ్లాడు. వ్యాన్ స్టార్ట్ చేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి క్యూరి యాసిటితో అడిగాడు.
"లోపల యింతసేపు ఏం చేసారు?"
"టి.వి టేపురికార్దర్ పగల గొట్టి, ఓ శవాన్ని సరిగా సెట్ చేసాను" అని చెప్పి, వ్యాన్ స్టార్ట్ చేసాడు.
అవతల వ్యక్తి మొహంలో రంగులు మారాయి. ఏమిటో గొణుక్కున్నాడు. బయటకు వినిపించకుండా.
సరిగ్గా పావుగంట తర్వాత జీపు కృపాల్ యింటి ముందాగింది. ఈ పావుగంట టెన్షన్ గా గడిపాడు కృపాల్.
చాలామంది ప్రాక్టికల్ జోక్స్ వేస్తుంటారు. యిదీ అలాంటిదేమో అనుకున్నాడు కానీ అతని సిక్త్ సెన్స్ కాదని చెబుతుంది.
జీపు నుంచి దూకి తలుపు దగ్గరికి వెళ్లాడు.
తాళం
తీసివుంది.అర్ధమైంది. అది ప్రాక్టికల్ జోక్ కాదని. తలుపు తెరిచి షాక్ తిన్నాడు. ఫోన్ లో మాట్లాడిన అగంతకుడు అన్నంత పనిచేసాడు.
హాలు మధ్యలో శవం చాలా భయంకరంగా వుంది. ఘోరంగా హింసించి చంపినట్టు, ఎన్నో శవాలను చూసిన కృపాల్ ఆ శవాన్ని చూడలేక కళ్లు తిప్పుకున్నాడు.
అతని వెనకే కానిస్టేబుల్స్ దిగారు. నిమిషాల్లో ఫోటోగ్రాఫర్, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ పర్ట్స్ వచ్చారు. శవాన్ని వివిధ కోణాల్లో పోటోలు తీసారు.
ఫ్రీజ్ డోర్ ఓపెన్ చేసివుంది. కిచెన్ లో కాఫి కలుపు కొని తాగిన గుర్తుంది.
టి.వి పగిలి పోయింది. టేపురికార్డరూ అదే పరిస్థితిలో వుంది. టెలిపోన్ వ్తెరు పీకేసారు.
కృపాల్ పిడికిళ్లు బిగుసుకున్నాయి. అప్రయత్నంగా డెడ్ బాడి జేబులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చూసారు. ఏమీ దొరకలేదు.
డెడ్ బాడీని పోస్ట్ మార్దమ్ కు పంపించాలని డిసైడయ్యాడు.
రెండు చేతులతో కణతలు నొకున్నాడుక్కు కృపాల్. తలంతా భారంగా వుంది. ఎన్నో కేసులను తను పరిష్కరించినా, ఈ కేసు తనకో ఛాలెంజ్ అయింది. టేబుల్ మీద పొగలు కక్కుతోన్న టీ వున్నా తాగాలనిపించడం లేదు. రెండు క్షణాలు కళ్లు మూసుకున్నాడు. ఆ శవం ఎవరిదై వుంటుంది? వెంటనే అతనికో విషయం గుర్తొచ్చింది.
కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసాడు. మూడ్రోజులుగా తమ పిల్లలు కనిపించడంలేదని ఎవరైనా రిపోర్టు చేసారా?అన్న విషయం ఎంక్వయిరీ చేసాడు. పదినిమిషాల్లో నగరంలోని వివిధ పొలిసుస్టేషన్లలో తమ పిల్లలు కనిపించడం లేదు అని రిపోర్టు యిచ్చిన రిపోర్ట్స్ వున్నాయి.
శ్యామ్, మోహన్, స్వరూప్, ప్రదీప్ అన్న కుర్రాళ్లు కనిపించడంలేదని, వాళ్ల పేరెంట్స్ త్రీ టౌన్ పొలీసుస్టేషన్ లో కంప్లయింట్ చేసారు. నలుగురూ డిగ్రీ చదివే కుర్రాళ్లు...వాళ్ల ఫోటోలు చూసాడు. అందులో శ్యామ్ పోటో ని గుర్తుపట్టాడు.
మిస్టరీ మల్ల మెల్లగా విడిపోతూ బిగుసుకున్నట్టు అనిపిస్తోంది.
భార్గవ రూపంలో వచ్చిన వ్యక్తి తనకు ఫోన్ చేసిన అగంతకుడి అనుచరుడు. యిప్పుడు వాళ్లని కిడ్నాప్ చేసిన వ్యక్తి కూడా...
అంటే పార్ధసారధి కిడ్నాప్ కూడా... వెంటనే కృపాల్ ఓ నిర్ణయానికి వచ్చాడు.
ఈ కుర్రాళ్లని ఎలా కిడ్నాప్ చేయగలిగారో తెలుసుకోవాలి...తెలుసుకోవాలంటే...
అన్ని పత్రికలకూ ఆ నలుగురు కుర్రాళ్ల ఫోటోలు పంపాడు.
వీళ్లని ఎక్కడైన, ఎవరైనా చూస్తే తమకు తెలియచేయండి. పొలిసు డిపార్ట్ మెంటు నుంచి ఓ ప్రకటన పంపించాడు.
ముందు తను మిదిలానగర్ కు వెళ్లి రావాలి. యింటి నెంబర్ పదహారు చూడాలి. ఈ కేసుకి, ఆ యింటికి ఏదో సంబంధం వుండి వుంటుంది.
మిదిలానగర్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ముందు శ్యామ్ వాళ్ల పేరెంట్స్ కు కబురు పంపించాడు. ఎందుకో అతని మనసు అర్ధమ్తెంది. పోస్ట్ మార్టమ్ కాగానే శావాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలి బాధ అనిపించినా సరే.
ఆ క్షణమే వచ్చిన మరో ఆలోచన అతడ్ని వణికించింది. మరి మిగతా కుర్రాళ్లు...వాళ్లేమయ్యరో తెలియక వాళ్ల తల్లిదండ్రులు పడే ఆవేదన? కృపాల్ కళ్లు అగ్ని గోళాలయ్యాయి. ఆ అగంతకుడ్ని మామూలుగా వదల కూడాదు. తన చేతులతోనే చంపాలి...అంత ఆవేశం వచ్చింది అతనికి.
జీపులో మిధిలనగర్ వైపు బయల్దేరాడు ఒక్కడే.
జీపు మిధిలనగర్ లోకి ప్రవేశించింది. కొత్తగా ఏర్పాటుచేసిన కాలనీ అది. ఇంకా ఇళ్లు ఎక్కువగా పడలేదు. అక్కడక్కడ విసిరేసినట్టు వున్నాయి.
జీపు మలుపు తిరుగుతూనే వుంది. ర్తెట్ కు తిరగ్గానే ఓ పాడుబడిన ఇల్లు కనిపించింది. ఇంటి నెంబరు పదహారు అని పాతకాలం నాటి తుప్పుపట్టిన రేకు ముక్కమిద రాసి వుంది. జీపు దిగి గేటును నేట్టబోడు. లోపలినుంచి తాళం వుందని తెలిసింది. అతని నొసట ముడిపడింది.
క్లోపలినుంచి తాళం వేసారంటే లోపల ఎవర్తెనా వున్నారా? అటుయిటు చూసాడు జనసంచారం లేదు. గేటు ఎక్కి అటువ్తెపు దూకాడు.
పెద్ద హ్తెట్ లో లేకపోవడంవల్ల ఈజిగానే దూకాడు. పిచ్చిమొక్కలు, తుప్పలు...పాడుబడిన యిల్లు లాగే వుంది. చుట్టూ ప్రహారిగోడ వుంది.
ఇల్లు కూడా పాతకాలం నాటిది. తలుపు వేసివుంది.తాళం వేలాడుతోంది.
యింటికి తాళం వేసి వుంటే గేటుకు లోపలి నుంచి ఎలా తాళం వేసారో అర్ధంకాలేదు.
తాళాన్నిపగలగోట్టడానిక్తేనాసిద్దపడే వచ్చాడు.
ఆ యింటిని మూడేళ్ల క్రితం ఎవరో కొన్నారు. ఓనర్ రావడంలేదు.
మున్సిపాలిటీ బిల్లులు మాత్రం కడుతూనే వున్నారు. ఎలక్ట్రిసిటి బిల్ కట్ట కపోవడం వల్ల కరెంటు కనెక్షన్ కట్ చేసాడు.
ఈ మిస్టరీని చేదించాలంటే కాస్త అవుటాఫ్ వే పిన్ లాంటిదే. దాన్ని కిహొల్ లో పెట్టి తిప్పాడు. రెండే క్షణాల్లో తెరుచుకుంది తాళం కప్ప. గొళ్లెం తిసిరి తలుపు తెరిచాడు. లోపలంతా దుమ్ము కొట్టుకుపోయివుంది. పెద్ద హాలు, పాతకాలం నాటి సొఫా సెట్. అరంగుళం మేర దుమ్ము పేరుకు పోయి వుంది నలమీద. ఇల్లంతా తిరిగాడు. ఆరుగదుల ఇల్లు అది. చివరి గదిస్టోర్ రూమ్. లోపలికి వెళ్లగానే అంతా పాత సామాను. విరిగిన కుర్చీలు, చెక్కసామాన్లు ఏమిటేమిటో గదినిండా వున్నాయి.
తిరిగి హాలులోకి వచ్చి, కన్ ఫర్మ్ చేసుకున్నాడు. కావాలనే రాంగ్ అడ్రస్ యిచ్చారని వేల్లిపోబోతూ...అతని దృష్టి ఓ మూలకు పడింది.
సోఫాకింది నుంచి ఐరన్ రాడ్ కనిపిస్తోంది. వెళ్లి దాన్ని పరిశీలనగా చూసాడు. కార్చి ఫ్ తో ఆ ఐరన్ రాడ్ ని చేతిలోకి తీసుకున్నాడు. రక్తం ఐరన్ రాడ్ చివరకు అంటివుంది. దాన్ని అలాగే పట్టుకుని బయటకు వచ్చి గది తాళం యాజిటిజ్ గా వేసి బయటకు వచ్చాడు.
జీపులో స్టేషన్ కు వచ్చాడు. ఐరన్ రాడ్ ను ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ పర్ట్స్ కు పంపించాడు. చివరకు అంటిన రక్తం కూడా ఏ గ్రూపుధో తెలుసుకోవాలను కునాడు.
ఫోన్ మోగింది. కృపాల్ రిసీవర్ ఎత్తాడు.
"హలో...కృపాల్ గారా? నేను...అపూర్వని"
"మిరా" ఒక్క క్షణం ఆగాడు కృపాల్. ఆమెకు ఏమని చెప్పాలి? నా తండ్రి జాడ యింకా తెలియలేదని చెప్పాలి.
"హలో...ఇన్స పెక్టర్ గారూ...ఏంటి...నేను ఇండియా వచ్చేసాను. యిప్పుడు యింటి దగ్గర్నుంచే మాట్లాడుతున్నాను. అయ్యర్ అంతా చెప్పాడు. నా కేంటో భయంగావుంది. నేను వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాను.మీరేమ్తెనా బిజీనా?"
"ఫర్లేదు...వచ్చేయండి" అన్నాడు కృపాల్.
ఫోన్ పెట్టేసింది అటువ్తెపు నుంచి అపూర్వ.
"సార్...ఎవరో ఆటో డ్రైవర్ అట...మీతో ఏదో చెప్పాలట" కానిస్టేబుల్శివరావు చెప్పాడు.
"లోపలికి పంపించు" చెప్పాడు కృపాల్.
ముప్పయి...ముప్పయి ఐదుకు మధ్యవున్న ఆటోడ్రైవర్ వచ్చాడు.
"నమస్కారం సార్...నా పేరు యాదగిరి...ఆటో డ్రైవర్ ని" చెప్పాడు వినయంగా.
"రా...అలా వచ్చి కూచో" అన్నాడు కృపాల్ సౌమ్యంగా.
తన దగ్గరికి ఎధ్తేనా సమాచారం అందించడానికి వచ్చే వ్యక్తుల పట్ల చాలా సాప్ట్ కార్నర్ తో వ్యవహరించాలని అతని వుద్దేశం.
అతను పొంగిపోయాడు. పొలిసుస్టేషన్ లో అంతా రఫ్ గా వుంటారని విన్నాడు.
అతనొచ్చి కుర్చీలో కూచుని-
"మీరు పేపర్ లో ప్రకటన యిచ్చిన ఆ కుర్రాళ్లని నేను చూసాన్సార్" చెప్పాడు వినయగా ఆటోడ్రైవర్ యాదగిరి.
"ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? వివరంగా చెప్పు...నీకేం భయంలేదు...పైగా నీకు మంచి బహుమతి కూడా యిస్తాను" అన్నాడు కృపాల్.
"నాకు బహుమతి వద్దు సార్...మీరు మంచిగా మాట్లాడిండ్రు...అదే చాలు సార్...మా నడిపిస్తున్నా. ఆ కుర్రాళ్లు మూడ్రోజుల క్రితం డాక్టర్ పార్ధసారధిగారు లేరూ...ఆరి యింటి దగ్గర ఆటో ఎక్కిండ్రు...పార్ధసారధిగారు మరెవరో అమ్మాయిగారూ ఆ కారులో వెళ్తున్నారు.
ఈ కుర్రాళ్లు ఆ కారును ఫాలో కమ్మని చెప్పిండ్రు. మిటర్ మీద పది రూపాయలు ఎక్స్ట్రా కూడా యిస్తామన్నారు. నిజం చెప్పొద్దుసార్...నాకూ ఆశ పుట్టింది. కారును ఫాలో అయినాను. కారు మిదిలానగర్ కు వెళ్లింది. ఈ కుర్రాళ్లు కూడా ఆ కారు దగ్గరే ఆటో అపించిండ్రు. ఆళ్లు గేటు తీసుకొని లోపలికి వెళ్లిండ్రు...ఈ కుర్రాళ్లు గేటు దూకి పోయిండ్రు. పోయేముందు నా ఎక్స్ట్ ట్రా డబ్బులు మరిచిపోతే నేనే అడిగినా...యిచ్చే సిండ్రు. మాంచి పిల్లగాండ్లే...పాపం...ఎట్లా సచ్చిండో ఓ పిల్లగాడు" బాధగా అన్నాడు యాదగిరి.
"మిదిలానగర్ లో ఎక్కడాపావు నీ ఆటోని?" కృపాల్ అడిగాడు.
"ఇంటినెంబర్ పదహారు దగ్గర సార్. ఆ కుర్రాళ్లు కూడా ఆ యింట్లో కి వెళ్లిండ్రు."
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు కృపాల్.
యింటి నంబర్ పదహారు...తను వెళ్లి మొత్తం చూసేసి వచ్చాడు. ఏమి లేదు. డా. పార్దాసారధి అక్కడికి ఎందుకు వెళ్లినట్టు?
ఈ కుర్రాళ్లు ఎందుకు వెళ్లినట్టు?
"ఆ కారులో వున్న అమ్మాయి యిలా వుంటుందా?" అంటూ తప్పిపోయిన ప్రకటన వచ్చిన చాందిని ఫోటో చూపించాడు.
"ఈ అమ్మాయేసార్...నాకు బాగా గుర్తు" అరిచినంత పనిచేసాడు యాదగిరి.
"వెరీగుడ్...చాలా మాంచి ఇన్పర్మేషన్ చెప్పావు. నీలాంటివాళ్లు దేశానికి కావాలి... కీపిటప్" అంటూ పర్సులో నుంచి ఓ కొత్త వందరూపాయల నోటు తిసి యదగిరికిచ్చాడు.
"వద్దుసార్" అన్నాడు యాదగిరి.
"పర్వాలేదు...నీ నిజాయితీకి మెచ్చి యిస్తున్నాను".
"వద్దుసార్... మీరు మేచ్చుకుండ్రు...నా కంతేచాలు సార్..."
ఈలోగా టి వచ్చింది.
టి ఆఫర్ చేసాడు.
సిగ్గుపడుతూ టి తాగాడు.