Previous Page Next Page 
హనీమూన్ పేజి 12



    "ఏమిటి స్టాపా?" అడిగాడు రిజర్వేషన్ క్లర్క్ గోపాలన్ నీ.

    "అవును గురూజీ!" అన్నాడు గోపాలన్.

    "అయితే ఏమంటావ్?"

    "మా వాళ్ళకి  కొంచెం రిజర్వేషన్  చేస్తారేమోనని-"

    "'క్యూ'లో రా! వెళ్ళు"

    గోపాలనుతో పాటు మేముకూడా షాక్  తిన్నాం.

    "నేను స్టాఫ్...."అంటూ మళ్ళి ఏదో చెప్పుబోయాడు గోపాలన్ కాని అతను వినిపించుకోలేదు.

    "స్టాఫ్ అయితే లోపల్నుంచి తీసుకురావాలని ఉందా? వెళ్ళి బయట 'క్యూ'లో నిలబడు" అన్నాడతను.

    "కొంచెం మెల్లిగా మాట్లాడండి! అవతల మా వాళ్ళున్నారు!" అన్నాడు గోపాలన్.

    "ముందు వెళ్ళవయ్య ఇక్కడినుంచి. లేకపోతే పోలిస్ నీ పిలుస్తాను."

    గోపాలన్ చిరునవ్వుతో మా దగ్గర కొచ్చాడు.

    "వాడు నా బెస్ట్ ప్రెండ్! ఊరికే అలా జిక్ చేస్తుంటాడు" అన్నాడు నమ్మించడానికి ప్రయత్నిస్తూ.

    "అలాగా!"

    "శుక్రవారానికి ఒక్క బెర్త్ కూడా లేదంట! అన్ని పుల్ అయిపోయయ్! ఆ మర్నాటికయితే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానన్నాడు. పాపం తెగ బాధపడ్డాడు ఈ విషయం చెప్పటానికి ఎందుకంటే నేను ఎప్పడూ ఆబ్లిగేషన్  తీసుకోనుగదా! అందుకే  తెగ రేస్ పెక్ట్  నేనంటే కాఫి  తాగి వెళ్ళమని  ఒకటే గొడవ! ఇప్పుడు టైము లేదని చెప్పి బయట పడ్డాను."

    "పోనీ లెండి- లేకపోతే ఏం చేస్తాం!" అన్నాను సారధి వంక చూస్తూ.


    "అదిగాక ఒకోసారి  'స్టాఫ్ ' అని మొత్తుకున్నా కూడా కొంత మంది వినిపించుకోరు" అన్నాడు సారధి.
  

    నాకు నవ్వాగలేదు.

    గోపాలన్ దొరికిపోయినట్లు నవ్వేశాడు.

    "వీళ్ళంతా కొత్తవాండ్లు సార్" అన్నాడు రహస్యం ఎలాగూ తెలిసిపోయిందని.

    అతను వెళ్ళిపోయాక ఇద్దరం మళ్ళి'క్యూ' దగ్గర కోచ్చము.

    "ఈ గోపాలనుగాడిని నమ్ముకోకుండా ఇందాకే 'క్యూ'లో  నుంచునీ వుంటే ఈ పాటికి సగం దూరం వెళ్ళి ఉండే వాళ్ళం" అన్నాను చిరాకుగా.

    "ఇప్పడిత తప్పేదేముంది- పద-నిలబడదం!" అన్నాడు సారధి.

    ఇద్దరం 'క్యూ' చివరకు  నడుస్తోంటే బ్రహ్మానందం  'క్యూ'మధ్యలో నుంచి పలుకరించాడు.

    "ఏం బ్రదర్ పనయిపోయిందా?"

    నేను తడబడ్డాను. "పనా...అ...హ...అవును! అయిపోయింది-" టికెట్ కూడా మీతోనే  తెప్పించుకునే వాడిని."

    "పోనీండి-ఇంకోసారేప్పుడు రిజర్వేషను కావాల్సి వచ్చినా నాతో చెప్పండి" అన్నాను ఆప్యాయంగా .

    "ధాంక్యూ ధాంక్యూ అన్నడతను గౌరవంగా."

    ఇద్దరం నాలుగడుగులు ముందుకి వేశం

    "ఇప్పడిక చస్తే 'క్యూ'లో నిలబడే ప్రసక్తేలేదు" అన్నాను నేను.

    "ఎందుకనీ?" ఆశ్చర్యపోతూ అడిగాడు సారధి.

    "ఆ బ్రహ్మానందంగాడు మానని మళ్ళి'క్యూ'లో చూశాడంటే ఎంత దారుణంగా ఉంటుంది? పరువు గంగ లో కలిసిపోతుంది."

    "కాని పరువుకంటే మనకి రిజర్వేషను ముఖ్యంకదా?"

    "అది ఇంకో సందర్భంలో అయితే వప్పకునే వాడినేమోగాని ఇప్పుడు మాత్రం పరువే ముఖ్యం బ్రహ్మానందాన్ని దెబ్బ  కొట్టే అవకాశం ఇంతకాలానికి దొరికింది యిప్పుడు వాడి ముందు మళ్ళివెధవయి పోవడం ఏ మాత్రం జరక్కూడదు.

    "సరే- ఆ గోడవేదో రేపు చూద్దంలే- ఇక యింటికి పోదాం పద" అన్నాడు సారధి.

    యిద్దరం ఇంటికి చేరుకున్నాము వసారాలో పడక కుర్చీలో పడుకుని పద్యాలు పాడుతోన్న తాతయ్యని చూసేసరికి యిద్దరం షాక్ తిన్నాం. నా ప్తే ప్రాణం ప్తేనే ఎగిరి పోయింది తనూ మాతో పాటు డార్జిలింగ్ కి  ఎక్కడ బయల్దేరాతానంటాడోననీ!

    "ఎప్పుడోచ్చావ్ తాతయ్య!" అన్నాను భయంగా.

    "ఇంతకు ముందేరా! మీరు డార్జిలింగ్ కి వెళ్తున్నారని రాజ్యం వాళ్ళింటికి  ఉత్తరం రాసిందట. వాళ్ళునాకు పెళ్ళిలో కలిసినప్పుడు చెప్పారు. సరే ఎలాగూ నేనూ త్రివేణిసంగమం  చూడాలని  ఎప్పట్నుంచో అనుకుంటున్నాను కదా! అందరం కలిసే  వెళ్ళవచ్చని బయల్దేరాను"

    అనుకోన్నంతా అయింది తాతయ్యంటే నాకూ సారధికి చాలా అభిమానం ఉన్నమాట నిజమే! కాని అది ఇంట్లో ఉన్నంతసేపే, బయటకొస్తే తాతయ్యతో చాలా  యిబ్బందులున్నాయ్.

    ఎక్కడికక్కడే ఘోరమయినయుద్దాలు జరిగిపోతాయ్ అనేకసార్లు మార్కెట్ లో తాతయ్య మూలానా నేను సారధి కలసి ఆటో వాళ్ళతోనూ షాపుల వాళ్ళతోనూ ఇంచుమించు ముష్టియుద్ధం  చేయాల్సి వచ్చింది. యిప్పుడు తాతయ్య కూడా డార్జిలింగ్  బయలు దేరితే అసలు మేము తిన్నగా డార్జిలింగ్ చేరుకుంటామా లేదా అనేదికూడా నమ్మకంలేదు.   

    అందరం కలిసే  భోజనాలు చేయసాగాము.

    "కాని అలహబాద్  డార్జిలింగ్ వెళ్ళే త్రోవలో రాదుకదా!" అన్నాన్నేను తాతయ్యనేలాగోలా తప్పించేయడానికి  ప్రయత్నిస్తూ.

    "'రాదు' అనుకుంటే సరిపోయిందేమిట్రా రావాలి! అదే దార్లో వచ్చేట్లుగా మనమే రూట్  తాయారు చేయాలి! అప్పుడు అదేమిటి దాని బాబోస్తుంది."

    "నిజమే అనుకో! కాని అది  అమరి చెట్టు దారి అవుతుందేమోనని..."

    "అయితే ఏమిటట నష్టం?"

 Previous Page Next Page