"ఇందాక మాట్లాడిన సూట్ వాలా దగ్గరకు మళ్ళి వెళ్దాం పద! ఆయన కట్టమంటే కడతాము" అన్నాడు సారధి- అతని విక్ పాయింట్ నీ పట్టుకుని దాంతో టి.సి. తగ్గిపోయాడు.
"చాల్చాల్లే- వెళ్ళండిక" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు.
"ఇంతకూ మా గోపాల్ ఎక్కడుంటాడో మీరు చెప్పనేలేదు. నల్లగా, పొట్టిగా , బాబ్డ్ హెడ్ తో ఉంటాడు- అతన్నేలా కనుక్కోవటం?" నేను మళ్ళి అడిగాను టి.సి.నీ.
"సోది ఆడగండి" అనేసి అక్కడ నుంచి చకచక వెళ్ళిపోయాడతను.
మేము ప్లాటుఫారం మీదున్న ఆఫిస్ లన్ని తిరుగుతూ గోపాల న్ అనే వ్యక్తి గురించీ వాకబు చేయటం ప్రారంభించాము.
నలుగురు గోపాలన్ లను కలుసుకుని, వాళ్ళు మాక్కావలసిన గోపాలన్ కాదని తెల్చుకున్నాక చివరకు మాక్క్కవలసిన గోపాలన్ నీ కలుసుకున్నాము.
అతను మమ్మల్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు.
"ఇలా వచ్చారుమిటి?" అన్నాడు ఆప్యాయంగా.
"పనిమీద వచ్చాం!" అన్నాడు సారధి.
"కోయంబత్తుర్ వెళ్ళారా మళ్ళి ఈ మధ్య ?" అడిగాడతను. మాకు అర్ధం కాలేదు మేము కోయంబత్తూరు ఎందుకు వెళ్తాము?!
"లేదు!" అన్నాడు సారధి.
"మా పెద్దవాండ్లు లెటర్ రాసారి మధ్య! మళ్ళి మిరోచ్చేట్లయితే ఉప్పుచేప పంపమని!"
మళ్ళి యేదో అపార్ధాల సిన్ మొదలయిందని తెలిసింది నాకు.
"ఉప్పు చేపేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు సారధి.
"అదేసార్! కిందటిసారి చీరలు కొంటానికి మీరు కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు...." అతని మాట పూర్తి కానికుండా నేను అడ్డుపడ్డాను.
"మేము మీ విధిలో ఆ పచ్చడాబా పక్క ఇంట్లో ఉంటాము. మనం చాలా సార్లు విధిలో కుళాయి దగ్గర రెండింటికి కలుసుకునే వాళ్ళం" అన్నాను విషయాలన్నీ విశాదికరిస్తూ.
అప్పుడు దారిలో పడ్డాడతను.
"ఓ!మీరా!ఇంకోకతను కూడా అచ్చం మీ మోస్తరుగానే ఉండే వారు. ఆయనే మిరనుకుని.....సారి__"
"ఫర్లేదులెండి! ఇంలాటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయ్ ఒకో సారి"
"నాతో ఏమయినా పని వుండి వచ్చారా?" అడిగాడతను.
"అవును!మేము డార్జిలింగ్ వెళ్తున్నాము రిజర్వేషన్ కావాలి! క్యూ చాలా పెద్దదుంది"
అతను పెద్ద ఫోజుతో మా వంక చూశాడు.
"రిజర్వేషనా!"
"అవును! ఎప్పడయినా ఏమయినా ర్తేల్వేకి సంబంధించిన పని ఉంటే మిమ్మల్ని కలుసుకోమని మీరే చెప్పారు కదా-అందుకని!"
"ఆ !ఆ!అవును!పదండి!" అంటూ మాతోపాటు రిజర్వేషన్ ఆఫీసుకి బయల్దేరాడతను.
రిజర్వేషన్ ఆఫిస్ బయట 'క్యూ' స్తేజు ఏమాత్రం తగ్గలేదు. 'క్యూ'లో నుంచున్న వాళ్ళను చూసేసరికి మాకు ఎంతో జాలి వేసింది.
"పాపం ! వాళ్ళు అలా ఎంతసేపు నుంచోవాలో" అన్నాడు సాది మరి జాలిగా.
"పాపం!నిజంగా వాళ్ళ పరిస్ధితి చాలా హారిబుల్!" అన్నాను నేను.
'క్యూ' మధ్యలో నుంచి 'హలో' అన్న పిలుపు వినిపించి ఇద్దరం కుతూహలంగా ఆ శాల్తీ వంక చూశాం. అతను మా ఆఫిస్ లో చీఫ్ క్లార్క్ గా పనిఒచేసే బ్రహ్మానందం.
"హలో హలో" అన్నాను నేను కూడా.
"ఏమిటిలా వచ్చ్కారు?"
"రిజర్వేషన్ కోసం ! మరి మీరు?" అడిగాడతను.
"నేనూ రిజర్వేషన్ కోసమే" అన్నాను కొంచెం ఫోజుగా.
"అలాగా! మరి క్యూలో నిలబడరెం? అనుమానంగా అడిగాడు.
అ అవకాశాన్ని నేను వదలదల్చుకోలేదు. ఆఫీసులో చాలాసార్లు- అనేక విషయాల్లో తను పెద్ద పోటూగాడిలా మాట్లాడేవాడతాను. ఇప్పుడు అతనిమీద స్వారి చేసేయాలని నిర్ణయించుకున్నాను.
'క్యూ'లోనా? చచ! క్యూ'లలో ఎప్పడూ నిలబడను! రాటిన్ 'క్యూస్'! మన కెక్కడి కెళ్ళినా ఎవరోకారు తెలిసిన వాళ్ళుంటారుమన పనులన్నీ వాళ్ళే లోపల్నుంచి చేసేస్తారు" అన్నానుఠివిగా.
నేనూహించినట్లే బ్రహ్మానందం మొఖం మాడిపోయింది.
"అంటే ర్తేల్వేల్లో కూడా మీకు తెలిసిన వారెవరయినా ఉన్నారా?"
"ఒక రేమిటి? సగం మంది తెలిసినవారే!తెగ బ్రతిమాలు తూంటారు- ఒకసారి స్టేషన్ కొచ్చి వాళ్ళతో కలసి 'టి' తాగి వెళ్ళమని కాని మనసు తిరికేక్కడిది?"
బ్రహ్మానందం మాట పడిపోయినట్లు నోరు తెరచి చూడసాగాడు.
"అసలు స్టేషన్ కి రావలసిన అవసరం కూడా లేదు మాకు! ఇతను గోపాలన్ అని మా ఇంటి దగ్గరే ఉంటాడు. ఈ స్టేషన్ కి ఇంచుమించుగా ఇతనే హెడ్ అనుకోండి.! తనే రిజర్వేషన్ చేయించేసి టికెట్లు తెచ్చ్సిస్తా నన్నాడు. సరే- సరదాగా రావచ్చుకదాని వచ్చాం!" అన్నాడు సారధి.
"అలాగాండి" అన్నాడు బ్రహ్మానందం నమ్రతగా, మర్యాదగా మాట్లాడనేలేదు.
"వస్తాం! అవతల ఇంకా బోలెడు పని ఉంది!" అంటూ మేము గోపాలన్ తో పాటు రిజర్వేషన్ ఆఫిస్ లోకి నడిచాము.
గోపాలన్ సరాసరి కౌంటర్ లోపలి కెళ్ళి రిజర్వేషన్ క్లార్క్ తో ఏదో మాట్లాడాడు.