"వాట్ హే పెండ్ ?" అసహనంగా కాదు. ప్రశాంతంగానే అడిగాడాయన. " లాయర్లంతా కోర్టుల్ని బహిష్కరించారు సూర్యాన్ని బేషరతుగా విడుదల చేయమంటున్నారు."
క్షణం నిశ్శబ్దం.
"సర్" నిశ్చలంగా అందామె "నేను వ్యకిగతమైన స్పర్ధని ప్రకటించలే దెక్కడా. చట్టరీత్యా ప్రతి నిర్ణయమూ తీసుకున్నాను. నా పరంగా పొరపాటు జరిగినట్టనిపిస్తే ఎంక్వరీకి నేనూ సిద్దంగా ఉన్నాను."
ఉలిక్కిపడ్డాడాయన. రెండు దశాబ్దాల క్రితమే ఐ.పి.యస్. తో డిపార్ట్ మెంట్ లో అడుగు పెట్టిన ఆ వ్యక్తి ఇంచుమించు తన అనుభవమంత వయసున్న అమ్మాయి స్వాభిమానానికి ఆ శ్చర్యంగా చూశాడు.
"గుడ్" ప్రశంసిస్తున్నట్టుగా చూశాడు. " నీ ధైర్యాన్ని అభినందించకుండా వుండలేకపోతున్నాను. కాని ఒక్క విషయం... మనం చట్టాన్ని పరిరక్షించేవ్యక్తులంమేతప్ప మనమే చట్టంకాదు."
రాబోయే పరిణామాల గురించి పరోక్షంగా చెప్పాడాయన. ఆ చెప్పడం లాయరు సూర్యం గురించి మాత్రమేకాదు, ఓ రాజకీయ నాయకుడి కొడుకైన రణధీర్ గురించీ నిగూఢంగా వ్యక్తం చేసినట్టనిపించింది.
"సర్" తిరుగులేని విశ్లేషణలా చెప్పుకుపోయిందామె. " సుమారు నూటయిరవైయేడు సంవసత్సరాల సుదీర్ఘమైన చరిత్రగల పోలీస్ వ్యవస్థలో, ఇంకా ఒక అక్షరంగానైనా రూపుదిద్దుకోని సామాన్యురాలిని నేనని నాకు గుర్తుంది కాని మేను సంఘంలో పాపపుణ్యాలకి నిన్నటిదాకా చలించని మనిషిని మాత్రమే కాదు ఒక ఇంపార్షియల్ ఏ జెన్సీలో న్యాయన్ని ఎన్ ఫోర్స్ చేయదగ్గ కస్టోడియాన్ని కూడా" క్షణం ఆగిందామె.
" చిన్న చెపని పెద్దచేప మిందే మత్స్యన్యాయం అమలు కావాల్సిన ఆటవిక వ్యవస్థ కాదిది వేదకాలం నాటినుంటే వస్తున్న మంచి చెడులపోరాటాల స్పూర్తినీ, వైవిధ్యాన్నీ గుర్తించి, నేర ప్రవృత్తిగల వ్యక్తుల నుంచి సంఘాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతతో, ఎందరో మేధావుల ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న శిక్షాస్మృతి అమలుకాదగ్గ ఆధునిక సమాజమిది."
ప్రజలు రాజ్యంగం సంక్రమింపజేసిన హక్కులను కాపాడ్డం ద్వారా ప్రజలకు సేవచేయడమే నాఏ కైకలక్ష్యం. ఈ లక్ష్యం నుంచి నేను పక్కకి జరిగిననాడు చట్టమన్నది కొందర్ని కాపాడే ఓ అస్త్ర్రమన్న కూడని నమ్మకానికి నేను నీరుపోసిన దాన్న వుతాను. సర్, పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకో, లేక పరపతిగల వాడికో అండగా నిలిచే ఒక ఏజెన్సీ మాత్రమే అన్న ప్రజల నమ్మకాన్ని నిజంగాదని రుజువుచేయాలీ అంటే నేనిలాగే ప్రవర్తించాలి. తప్పనిసరిగా ప్రవర్తిస్తాను కూడా. కానివాడు..."
రెండు క్షణాల నిశ్శబ్దం.
" ఒక దీక్షతో, తిరుగులేని లక్ష్యంతో ఈస్థానాన్ని చేరుకున్న నేను అలంకారప్రాయమయిన నా ఐ.పి.యస్. ని చేజార్చుకోడానికీ వెనుకాడను."
రెప్పలార్పకుండా చూశాడు అడిషనల్ యస్పీ సురేందర్. ఇప్పుడతను ఆలోచిస్తున్నది అసాధారణమయిన ఆమె అనాలిసిస్ గురించికాదు. సాధ్యాసాధ్యాల ప్రసక్తి వదిలేస్తే ప్రతి పోలీసాఫీసరూ ఆచరించదగ్గ ఐడియాలజీ అది.
ఎవరనగలరు ఆమె ఆశయం తప్పని? కాని ఎంతమంది అనుసరించగలుగుతున్నారు?
రాజీపడలేనివాడు రాజకీయాలకు బలవటం తలబగ్గినవాడు తనను వ్యవస్థకి అలవంపులు తీసుకురావడం- ఇదేకదూ పోలీసుల్ని ప్రజలకి ప్రత్యర్ధులుగా మార్చింది!
"గుడ్!" అభిమానంగా చూశాడాయన. కడిగిన ముత్యంలా అనిపిస్తున్న ఆమె ఎల్లకాలం అలాగే ఉండాలని కోరుకున్నాడుకూడా. "చాలా స్వల్పకాలంలో ఇంత సంచలనాన్ని సృష్టించి ప్రజలకి చాలా దగ్గరకు వెళ్ళగలిగిన మిస్ మేనకా అయాం విత్ యూ" కరచాలనం చేశాడు.
ఇలాంటి అండ ఆమె సైతం ఊహించనిది కావడంతో ఉద్విగ్నంగా అంది " థాంక్యుసర్!"
సరిగ్గా ఇదే సమయంలో....
భాగ్యనగరంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు చేరుకున్న కొందరు పత్రికా విలేఖరులు ఎమ్మెల్యే అప్పారావుని కలుసుకున్నారు.
సాయం కాలానికల్లా మంత్రి మండలిలో తనకు స్థానం ఉండేదీ, లేనిదీ తేలిపోతుందన్న టెన్షన్ లో ఉన్న అప్పారావు మొహం చాటేయబోయాడుకాని, సాధ్య పడలేదు.
" మీకు మంత్రి వర్గంలో స్థానం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు."
"అంతా దైవేచ్ఛ."
"పార్టీ నాయకుడయిన ముఖ్యమంత్రి గారి ఇచ్చన్నారు నిన్నటిదాకా."
తొట్రుపడ్డాడు-"మాకు ఆయనే దైవంగా"
"ఒకవేళ అవకాశం లేకపోతే."
చాచి ఒకటి యివ్వాలనిపించింది . అయినా నిభాయించుకున్నాడు .
"మూడు తరాలుగా రాజకీయాలకి అంకితమయిన కుటుంబంమాది."
" కాబట్టే ఈ సారి అవకాశం రాక తప్పుతుందా అన్నది మీ తాత్పర్యం అనుకుంటాను" మరో విలేఖరి అన్నాడు టక్కున.
వీళ్ళతో మాట్లాడం కొరకంచుతో గోక్కోవడం లాంటిదే అనిపించిన సదరు అప్పారావు వెంటనే తన మొహాన్ని సీరియస్ గా మార్చేశాడు. " అదికాదు నేను అప్పారావు వెంటనే తన మొహాన్ని సీరియస్ గా మార్చేశాడు. " అదికాదు నేను ప్రజాప్రతినిధిని. ప్రజాసేవ నాధర్మం. పార్టీకి కట్టుబడి ఉండటం నాధ్యేయం. కాబట్టి అవకాశం లేకపోయినా పార్టీకి, ప్రజలందరీ దండిగా నేపంచేస్తూ శేషజీవితాన్ని గడిపేస్తాను."
"రాజకీయల్లోకి మీ అబ్బాయిగార్ని తీసుకొస్తారనుకుంటున్నారు."
ఉలిక్కిపడ్డాడు. లాకప్ లో ఉన్న కొడుకు రణధీర్ గురించి అడగటం బొత్తిగా నచ్చలేదు.
"అవును. ప్రజాసేవ మా కులవృత్తి లాంటిది."
"అలాగా?" ఓ విలేఖరి వెంటనే అందుకున్నాడు- " కాబట్టే తమరు స్వతంత్ర పోరాటంలో జైలుకెళ్ళినట్టు,అప్పుడే ఆ రూట్ అలవాటు చేసుకుంటున్నట్టున్నాడు మీ అబ్బాయి."
చీరేయాలన్నంతగా మండిపోయింది. "ఇక నేను.... " లేచాడు లోపలికి పారిపోయిన దాగుందామని.
"చివరి ప్రశ్న. మీ అబ్బాయి ని ఓ లేడీ ఐ.పియస్. ఆఫీసర్ ఓ రేప్ కేస్ పైన అరెస్టు చేసిందట?"
గుటకలు మింగేశాడు అప్పారావు . "అవునట...తెలిసింది."
"దీనికి నీ జవాబేమిటి?"
"మంచి ప్రశ్న. అలా ఉండాలి ఆడదంటే. నా నియోజకవర్గానికి అలాంటి ఆఫీసరు రావడం నాకు గర్వకారణం."