క్వార్టరులోకిదూరి దుప్పటి కప్పేసుకుందామనుకుని ద్వారాన్ని చేరుకున్నాడు. కాని అప్పటికే అవలివేపుకు చొచ్చుకొనిపోయిన ఓ విలేఖరి " అంటే మీ అబ్బాయి అరెస్టు విషయంలో చింతించడం లేదంటారు!" అన్నాడు.
" ఛఛ!" ముక్కున వేలేసుకున్నాడు అసహ్యంగా . " నాకు తర తమ భేధాలులేవు. కొడుకయితే మాత్రం తప్పుతప్పేగా!"
"మరి అలాంటివాడ్ని రాజకీయాలలో కి రప్పించాలనుకోవడం...."
" ఘోరం! అందుకే అరెస్టయ్యాడని తెలీగానే మనసు మార్చుకున్నాను .వాడు నిజంగా తప్ప్పవేశాంని నిరూపింతమయితే నేనే దగ్గరుండి మరీ జైలుకి పంపుతానని హామీ ఇస్తున్నాను."
ఇక జాప్యం చేయకుండా లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు.అప్పటికే ఒళ్ళంతా చెమటతో తడిసిపోయందేమో ఆందోళనగా బాత్ రూంలో దూరబోయాడు.
సరిగ్గా ఆ సమయంసో ఫోన్ రింగయింది. బిగుసుకుపోయాడు ఇంకే దుర్వార్త వినాలో అని వణుకుతున్న చేతులతో రిసీవరు అందుకుని క్షణం విన్న అప్పారావు గట్టిగా కేకవేయబోతూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
అది సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడినుంచి వచ్చిన ఫోన్ కాల్. వారం రోజుల క్రితం రిజైన్ చేసిన హోం మినిస్టర్ పోర్ట్ పోలియో అప్పారావుకివ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు అయిదు నిముషాలక్రితమే.
"చాలా చాలా చాలా....చాలా ధాంక్సయ్యా!"
ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడు.
అప్పుడు ముందు గుర్తుకొచ్చింది పోలీసు కస్టడీలో వున్న సుపుత్రుడు రణధీర్ కాదు.
విశాకపట్టణం నార్త్ జోన్ సబ్ డివిజనల్ పోలీసాఫీసర్ మిస్ మేనక ఐ.పి.ఎస్.
* * * *
అసురసంధ్యవేళ.
సాలోచనగా జీపు నడుపుతూంది మేనక.
బంగాళాఖాతం పైనుంచి వీస్తున్నగాలి మొదలు కాబోయే తుఫానుకి సంకేతాన్ని మోసుకొస్తున్నట్టుగా ఉంది.
ఆ వేళలో రద్దీగా ఉండాల్సిన బీచ్ ఇంచుమించు నిర్మానుష్యంగా వుంది.
మేఘావృతమయిన ఆకాశంకింద అనంతందాకా విస్తరించిన సముద్రాన్ని గాని, వేగంగా ఒడ్డుని ఢీకొని వెనక్కి విరిగెవెలుతు్న కెరటాల్ని గాని చూడడంలేదామె.
బీచ్ ను ఆనుకునివున్న సన్నని రోడ్డుపైన జీపుని ఆశ్రమంవేపు పోనిస్తూ ఆరోజు సంఘటల్ని మననం చేసుకుంటూంది.
నిజమే!ఎస్సై మురారి అన్నట్టు అవసరానికి మించిన సంచలనాన్ని సృష్టించింది తను!
అ రెస్ట్ చేశాక రణధీర్ పరంగా ఆమె చాలా బత్తిడాని ఊహించింది కాని, చిత్రంగా అది లాయర్లు సమ్మ దాకా పరిణమించిపోయింది.
ఒకవేళ అంతా సవ్యంగా ఉంటే ఇద్దర్నీ కోర్టులో హాజరుపరిచి బెయిలుకి అవకాశాన్ని కలిగించే అవకాశాన్ని కలిగించేదేకాని, అసలు ఇంటరాగేషన్ లో సహకరించడం లేదు ఏ ఒక్కరూ. అదీ కాగుండా ఇప్పుడు సమ్మె చేస్తున్న లాయర్లు ఆమె పైన చట్టపరమయిన చర్యతోబాటు బహిహరంగంగా క్షమాపణలు కోరుతున్నారు ఓ అప్పుడే కలెక్టరుకి మెమొరాండాన్ని సమర్పించిచారుకూడా.
నవ్వుకుందామె.ఇగమేనియా తమ పంతం నెగ్గించుకోవడానికి న్యాయావాదులు ప్రదర్శిస్తున్న స్వాతిశయమిది.
పరిణామం ఏదన్నాకాని తమూ మొండివైఖరిని ప్రదర్శించాలనుకుంటుంది.
కాని తనపంతం నెగ్గాలన్నా అలోచనతో మాత్రం కాదు.ఒక సాంఘిక న్యాయం విషయంలసో చిన్నా, పెద్దా తేడా దేదని రుజువుచేయడానికి. తప్పదు.ప్రజల్ల ఇలాంటివి చర్చనీయాంశయాలయితే తప్ప పోలీసులస పైన సద్భావం ఏర్పడే అవకాశం లేదు.
బహిరంగంగా బేడీలు వేయించి నడిపించింది. కేవలం ఇది ఆశించే అని తెలుకున్నది ఎస్సై మురారి ఒక్కడే.
అప్పుడే ఈ వార్త ఎంత ప్రాచుర్యాన్ని సంపాధించిందీ అంటే మధ్యాహ్నం రెండు గంటలకల్లా పత్రికా విలేఖరులూ, ఆకాశవాణి రిపోర్టరూ ఆమెను చాలా చాలా అడిగారుకాని, దేనికీ జవాబు చెప్పలేదామె.
ఇది ముగింపుకాదు. ప్రారంభం మాత్రమే చేయాల్సింది చాలా ఉండగా ఇప్పుడే చెప్పడం ఆమెకిష్టం లేదు.
చెవులు చిల్లుపడేలా హోరు వెనుకగా. నడుపుతున్న దెవరో కనిపించలేదు.
సైడ్ ఇవ్వాలనుకుంది. జీపుని ఓ పక్కగా తీసుకెళ్ళింది కూడా.
కాంటెస్సా ఆమె ఊహించినట్టు ముందుకెళ్ళలేదు. జీపు వెనుకనే వస్తూ ఇంకా హారన్ మోగిస్తున్నాడు అందులోని వ్యక్తి.
ఆ కారు నడుపుతున్నదెవరయినా కానీ తము యూనిఫాంలో వస్తూ ఇంకా హారన్ మోగిస్తున్నాడు అందులోని వ్యక్తి.
ఆ కారు నడుపతున్నదెవరయినా కానీ తను యూనిఫాంలో ఉన్నా కోరిరెచ్చగొడుతు్నట్టు బోధపడిపోయింద.
తను ఆడదతి. పైగా పరిసరాలు నిర్జీవంగా ఉన్నాయి. ఇదే వెనుక కారులో నివ్యక్తి అవకాశంగా తీసుకున్నది అంతే!
సహనాన్ని కోల్పోయిన మేనక సడెన్ గా బ్రేక్ తొక్కింకది కీచుమంటూ ఆగిన జీపులోంచి దూకి ఆ కారువైపు పరుగెత్తేదే.
కాని ఆకారు ఆగలేదు. సన్నగా ఈల వినిపించింది ముందు. వెనువెంటనే పక్కనున్న ఖాళీమార్గంలోనుంచి వేగంగా దూసుకుపోయింది. పైకి లేచినధూళి క్షణంపాటు మేఘంలా చుట్టుమట్టింది.
సమీపంలోని సముద్రపుహోరు ఆమె స్థితికి నేపధ్యంలా.
ఆలస్యం చేయలేదు మేనక. ఒక్క అంగలో డ్రైవింగ్ సీటులో కూర్చుంది.మరుక్షణం జీపుని ముందుకు దూకించిన మేనక అయిదు నిమిషాల వ్యవధిలో కాంటెస్సాకి అరఫర్లాంగు దూరాన్ని చేరుకుంది.
ఆమె రెప్పలార్పకుండా చూస్తూంది.
అరవై.... డెబ్బై..ఎనబై....స్పీడ్ మీటర్ నీడిల్ తిరుగుతూంది.
రెండు.... మూడు...ఆరు.... ఎనిమిది నిముషాలు.....
నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపైన కాంటెస్సాని అనుసరించిన మేనక ఒడుపుగా ముందుకు పోనిచ్చి మరో ఏభైగజాల దూరంలో రోడ్డుకడ్డంగా నిలిచింది జీపుని.
కాంటెస్సా జీపుని గుద్దేసేదే. స్కిడ్డవూతూ ఆగిపోయింది పది అడుగుల దూరంలో
రివాల్వార్ పైకి తీసిన మేనక కసిగా డ్రైవింగా సీటుదగ్గర డోర్ ని తన్నింది.