Read more!

నవరాత్రుల్లో వినాయకుడిని రెండో రోజు ఎలా పూజించాలి..ఎలాంటి నైవేద్యం సమర్పించాలి

 

నవరాత్రుల్లో వినాయకుడిని రెండో రోజు ఎలా పూజించాలి..ఎలాంటి నైవేద్యం సమర్పించాలి

మన హిందూసంప్రదయాంలో ముచ్చటగా మూడు నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు. రెండోది భాద్రపదంలో వచ్చే వినాయక నవరాత్రులు...మూడోది ఆశ్వయుజంలో వచ్చే శరన్నవరాత్రుల. ఊరుఊరా వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతుంటాయి. అయితే ఈ ఉత్సవాలను ఆర్భాటంగా చేయడం కంటే శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వినాయక నవరాత్రుల్లో రెండో రోజు ఏకదంతుడిని ఎలా పూజిస్తారు. ఎలాంటి నైవేద్యం సమర్పించాలి ఇప్పుడు తెలుసుకుందాం.

లంబోదరశ్చ వికటో...అని గణేశుడి షోడశ నామాలలో ఆయన్ను స్మరించుకుంటాం. స్వామినివికట వినాయకుడిగా ఆవాహన చేసి మొదటిరోజున పూజించినట్లే పూజించాలి. ఈ రోజు చదవుకోవల్సిన కథాంశం ఏంటో చూద్దాం.


పరమశివుడి కోపానికి గురైన మన్మథుడు ముక్కంటి అగ్నికి ఆహుతి అవుతాడు. అలా కాముణ్ని భస్మం  చేయగా మిగిలిన రుద్రనేత్రాగని సముద్రంలో పడుతుంది. ఆ అగ్ని నుంచి పుట్టినవాడే జలంధరుడు. శివుడి వల్ల వేరొకరి చేత అతని మరణం లేదని బ్రహ్మదేవుడి చెబుతాడు. కాలనేమి అనేవాడు తన పుత్రిక  బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేస్తాడు. వారి కుమారుడే కామాసురుడు మహిషారుని పుత్రిక తృష్ణను వివాహమాడుతాడు. ఆ అసురుడు శివుడిక కోసం భీకరమైన తపస్సు చేస్తాడు. అజేయత్నం, నిర్భయత్వం, మృత్యుంజయత్వమనే వరాలను పొందుతాడు. మూషికాసురునికి ఆత్మీయుడై  విజృంభిస్తాడు. అలా లోకమంతా కామాధీనమవుతుంది. దేవతలు, మునులు ముద్గల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచించినట్లుగా వికట వినాయకుడిని భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. ఆయన నుంచి అభయం పొందుతారు. తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే పగబట్టి ఉంటాడు. అందువల్ల మూషికాసురుడు తనవిరోధి వినాయకుడి మీదికి కామాసురుని ఉసిగోల్పుతాడు. కామాసురుడు మయూరరూపం ధరించి లోకమంతటినీ కామంతో ప్రభావితం చేస్తూ వినాయకుడిని కూడా లొందీసుకునే ప్రయత్నం చేస్తాడు. గణపతి ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిరోహించాడు. నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసిన దేవతలు, మునులు మయూరవాహణ వికట వినాయకా అని స్తుతిస్తారు. అటుకులు నివేదించి స్వామిని శాంతపరుస్తారు. రెండోనాటి పూజ ద్వారా సమాజం దుష్ట కామాన్ని వీడాలి.