సంకటహర గణేశ స్తోత్రం.. ప్రతి రోజూ ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏం జరుగుతుందో తెలుసా..
సంకటహర గణేశ స్తోత్రం.. ప్రతి రోజూ ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఏం జరుగుతుందో తెలుసా..
మనిషి జీవితంలో కలిగే విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. అందుకే ఆయనను ఏ పూజ చేయడానికి ముందైనా, ఏ శుభకార్యం చేయడానికి ముందైనా మొదటి పూజలు చేస్తారు. తొలి పూజ అందుకునే దైవంగా వినాయకుడు ప్రసిద్ధి చెందాడు. అయితే విఘ్నాలు తొలగించే ఈ గణపతిని ముఖ్యంగా సంకటహర గణపతి రూపంలో పూజించడం పరిపాటి. సంకటహర గణపతిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయట. అందుకే చాలామంది సంకటహర గణపతి అనుగ్రహం కోసం ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటారు. వ్రతం మాత్రమే కాకుండా సంకటహర గణేష స్తోత్రం కూడా చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ప్రతి రోజూ సంకటహర గణేష స్తోత్రాన్ని పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు పండితులు. ఇంతకీ ప్రతి రోజూ సంకట హర గణేష స్తోత్రం పఠించడం వల్ల కలిగే ఫలితాలేంటో తెలుసుకుంటే..
గణేశుడి ఆశీర్వాదాలను పొందడానికి సంకట నాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం అత్యంత ప్రభావవంతమైన మార్గంగా చెబుతారు. నారద పురాణంలో సంకట నాశన గణేష స్తోత్రం గురించి వివరణ ఉంది. 12 పవిత్ర శ్లోకాలతో కూడిన ఈ స్తోత్రం జీవితంలోని అన్ని రకాల అడ్డంకులను తొలగించడంలో చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఉద్యోగ అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ వివాదాలు వంటి సమస్యలను అధిగమించడానికి ప్రతి రోజు సంకట్ నాశన గణేష్ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదట.
సంకటనాశన గణేష స్తోత్రం పఠిస్తే..
సంకట నాశన గణేశ స్తోత్రం గణేశుడి వివిధ రూపాలను వివరిస్తుంది. మొదటి శ్లోకం బుద్ధికి సంబంధించిన అడ్డంకులను తొలగిస్తుంది. మూడవ శ్లోకం ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. ఐదవ శ్లోకం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కోర్టు కేసులు, అప్పులు లేదా శత్రువుల వల్ల చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న వారు కూడా 21 రోజుల్లో సానుకూల ఫలితాలు పొందగలుగుతారట. నిలిచిపోయిన పనులు పూర్తి కావడం ప్రారంభమవుతుందట. ప్రతికూల వ్యక్తులు తమంతట తాముగా వెనక్కి తగ్గుతారట.
సంకటనాశన గణేష స్తోత్రం సంపదను ఆకర్షించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందట. వ్యాపార నష్టాలు, ఆదాయ అంతరాయాలు లేదా రుణ పరిష్కారం వంటి సమస్యలు ఎదుర్కొంటుంటే, ఉదయం స్నానం చేసిన తరువాత ఈ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకుంటాయి.
గణేశుడి ఆశీస్సులు లేకుండా ఏ ప్రయత్నమూ పూర్తి కాదు. సంకట నాశన గణేష స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల పెద్దవైనా, చిన్నవైనా ప్రతి అడ్డంకులు తొలగిపోతాయి.
పఠించే విధానం..
ఉదయం లేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. చాప మీద కూర్చుని నెయ్యి దీపం వెలిగించి ధూపం వేయాలి. గణేశుడికి లడ్డులు లేదా మోదకాలు నైవేద్యంగా సమర్పించాలి. "ఓం గం గణపతయే నమః" అని 11 సార్లు జపించి, తర్వాత సంకట నాశన గణేష స్తోత్రాన్ని పఠించాలి. తర్వాత "ఓం గం గణపతయే నమః" అని 21 సార్లు జపించాలి. హారతి చేసి ప్రసాదం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గణేషుడి అనుగ్రహం పుష్టిగా కలుగుతుంది.
*రూపశ్రీ.