బుధవారం సాయంత్రం గణపతిని ఇలా పూజిస్తే అన్ని సమస్యలు దూరమవుతాయి..!
బుధవారం సాయంత్రం గణపతిని ఇలా పూజిస్తే అన్ని సమస్యలు దూరమవుతాయి..!
బుధవారం వినాయకుడి పూజకు చాలా శ్రేష్టమైన రోజు. విఘ్నాలు తొలగించే వినాయకుడు ఏ పూజ మొదలుపెట్టే ముందు అయినా తొలి పూజ అందుకుంటాడు. అయితే అదే వినాయకుడిని ముఖ్యదేవతగా పూజిస్తే.. ఆయన అనుగ్రహం లభిస్తే చాలా మంచి ఫలితాలు జీవితంలో ఉంటాయి. ఎన్నో సమస్యలు సులువుగా దూరం అవుతాయి. బుధవారం రోజు సాయంత్రం 6 గంటలకు వినాయకుడిని ప్రత్యేక పద్దతిలో పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. ఇంతకీ బుధవారం ఎలా పూజించాలి? తెలుసుకుంటే..
బుధవారం రోజు సాయంత్రం 6 గంటలకు వినాయకుడికి గరికతో పూజ చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది.
గరికతో పూజ..
గరిక ఆకులు గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. స్కంద పురాణం, గణేశ పురాణం వంటి గ్రంథాల్లో దుర్వతో పూజిస్తే వినాయకుడు తక్షణం సంతుష్టుడవుతాడని ఉంది.
బుధవారం..
బుధ గ్రహం బుద్ధి, విద్య, వాక్చాతుర్యం, వ్యాపార విజయాలను ప్రసాదిస్తుంది. వినాయకుడు “విద్యా ప్రసాదకుడు, విఘ్నవినాశకుడు” కనుక బుధవారం ఆయన పూజ ప్రత్యేకంగా ఫలిస్తుంది.
సాయంత్రం 6 గంటల ప్రాముఖ్యత..
ఈ సమయం సంధ్యాకాలం. ఇక్కడ పగలు–రాత్రి మార్పు జరుగుతుంది. ఇది శక్తి సమతుల్య సమయం. ఆ సమయంలో చేసే పూజ "విఘ్నాలు తొలగించే శక్తిని" వేగంగా ప్రసాదిస్తుంది. రోజంతా చేసిన పనుల్లోని నెగిటివిటీ తొలగిపోతుంది.
ఎలాంటి అడ్డంకులు తొలగుతాయి..
విద్యలో అడ్డంకులు తొలగిపోవడం, పరీక్షల్లో విజయాలు లభించడం, వ్యాపారంలో లాభాలు, బుద్ధి, చతురత పెరగడం. కుటుంబంలో సఖ్యత, విభేదాలు తగ్గిపోవడం. ధన సంబంధిత సమస్యలు కొంతవరకు పరిష్కారం కావడం. శత్రు భయాలు తగ్గి, ఆత్మవిశ్వాసం పెరగడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల సమయంలో పూజ చేస్తే వినాయకుడు “వాక్పటిమ, నిర్ణయశక్తి” ప్రసాదిస్తాడని చెబుతారు.
వినాయకుడికి ఎన్ని గరికలు సమర్పించాలి?ఎందుకు?
సాంప్రదాయంగా 21 గరికలు సమర్పించాలి.
21 సంఖ్యకు అర్థం:
పంచేంద్రియాలు (5), పంచప్రాణాలు (5), పంచభూతాలు (5), మనసు (1), బుద్ధి (1), అహంకారం (1), చిత్తం (1), ప్రకృతి త్రిగుణాలు (3: సత్త్వ–రజస–తమసు)
మొత్తం = 21. మొత్తం 21 గరికలను వినాయకుడి పూజలో సమర్పించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే గణపతిని పూజించే సమయంలో సమస్యలు తొలగిపోవడానికి సంకటహర గణపతి స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠిస్తుంటే మంచిది.
*రూపశ్రీ.