అడవిలో ఏడ్చినట్లే
అడవిలో ఏడ్చినట్లే!
వాచ్యం శ్రద్ధాసమేతస్య పృచ్ఛతశ్చ విశేషతః।
ప్రోక్తం శ్రద్ధావిహీనస్య అరణ్యరుదితోపమమ్॥
శ్రద్ధగా వినేవాడికి ఓ నాలుగు మంచి మాటలు చెప్పి ప్రయోజనం ఉంటుంది. కానీ అసలే వినేందుకు సిద్ధపడనివాడికీ, గ్రహించేంత సంస్కారం లేనివాడికీ ఎంత చెప్పి మాత్రం ఏంటి ఉపయోగం! వాడితో చెప్పినా... అరణ్యంలో రోదించినా ఫలితం ఒక్కటే!