దుర్మార్గుడి లక్షణాలు ఇవీ

 

 

 

దుర్మార్గుడి లక్షణాలు ఇవీ

 

 

అకరుణత్వమకారణ విగ్రహః

పరధనే పరయోషితి చ స్పృహా ।

సుజన బంధుజనేష్వసహిష్ణుతా

ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనామ్‌ ॥ (భర్తృహరి)

ఫలానావాడు దుర్మార్గుడు, ఫలానా మనిషి మంచివాడు అని ఎంచడం కష్టం. పరిస్థితులను బట్టి ఒక మనిషిలోని మంచిచెడులు బయటపడుతుంటాయి. అయితే స్పష్టంగా కనిపించే కొన్ని లక్షణాలను అనుసరించి సదరు మనిషిలో దుష్టస్వభావం ఉందని గ్రహించవచ్చు. అందుకోసం కొన్ని ఉదాహరణలను ఇస్తున్నారు కవిగారు. ఏ మాత్రం జాలీ దయా లేకపోవడం; అకారణంగా కలహానికి దిగడం; పరాయి స్త్రీలు, ధనం పట్ల వ్యామోహాన్ని పెంచుకోవడం; స్నేహితులను, బంధువులను సహించలేకపోవడం... ఇవన్నీ కూడా దుర్మార్గులకు ప్రకృతిసిద్ధంగా ఉండే లక్షణాలు అంటున్నారు.

 

..Nirjara