ఇంట్లో ఎలాంటి వినాయక విగ్రహాలు ఉంచితే మంచిది?

 

 

ఇంట్లో ఎలాంటి వినాయక విగ్రహాలు ఉంచితే మంచిది?

 


హిందువులు ఆరాధించే దేవుళ్లలో వినాయకుడు ప్రముఖుడు.  తొలి పూజ అందుకునే దైవం, మొదలుపెట్టే కార్యానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసేవాడు వినాయకుడే.  సాధారణంగా ఏ పూజ, వ్రతం అయినా మొదట వినాయకుడి పూజతోనే మొదలవుతుంది.  అలాంటిది ఏకంగా వినాయకుడికే పూజ, వ్రతం అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాసస్త్యం అంతా ఇంతా కాదు.  భారతదేశంలో చాలా చోట్ల వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు.  కొన్నిచోట్ల వినాయకుడి నవరాత్రులను కూడా చేస్తారు. అయితే వినాయక చవితికి ఇంట్లో ప్రతిష్టించే వినాయకుడి విగ్రహం ఎలా ఉంటే బాగుంటుంది? సాధారణంగా ఇంట్లో ఉంచుకునే వినాయక విగ్రహాలు,  పటాలు ఎలా? ఏ దిక్కున ఉండాలి? ఏ వినాయకుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు. వాస్తు, జ్యోతిష్క శాస్త్రం ఏం చెబుతోంది?


ఇంట్లో వినాయకుడిని పశ్చిమం,  ఉత్తరం,  ఈశాన్యం దిశలలో ఉంచవచ్చు. దక్షిణ దిశలో మాత్రం ఉంచకూడదు.

వినాయకుడి విగ్రహాం లేదా పటాన్ని ఇంటి ప్రవేశ ద్వారం,  గది, పూజ గదిలో ఉంచవచ్చు.  బెడ్ రూమ్,  మెట్ల కింద, స్టోర్ రూమ్ లేదా గ్యారేజ్,  యాటిలిటీ ఏరియా,  ఇంటి వెలుపల మాత్రం అస్సలు ఉంచకూడదు.


వినాయకుడి రంగు తెలుపు రంగు,  వెర్మిలియన్ రంగు,  బంగారు రంగులో ఉంటే మంచిది.  ఇలాంటి వినాయకుడి విగ్రహాలు ఇంట్లో ఉంచితే ఇంటికి శ్రేయస్సు,  అదృష్టం,  ఆరోగ్యం చేకూరతాయి.


ఇక వినాయకుడిని తయారు చేసే పదార్థాన్ని బట్టి దాని ఫలితాలు కూడా ఉంటాయి..

వెండి వినాయకుడు.. కీర్తిని తెస్తాడు.

ఇత్తడి వినాయకుడు.. శ్రేయస్సు,  ఆనందం ఇస్తాడు.

చెక్క వినాయకుడు.. మంచి ఆరోగ్యం,  ఆయుష్షును ఇస్తాడు.

స్ఫటిక వినాయకుడిని ఇంట్లో ఉంచితే.. వాస్తు దోషం తొలగిపోతుంది.


పసుపు రంగు వినాయకుడి విగ్రహం.. అదృష్టాన్ని తెస్తుంది.  శుభాలు చేకూరుస్తుంది.


రాగి లోహంతో చేసిన  వినాయకుడిని ఇంటికి తెస్తే.. కుటుంబాన్ని ప్రారంభించాలనుకునే జంటలకు అదృష్టాన్ని తెస్తుంది.  


మామిడి, రావి,  వేప వంటి కలపతో చేసిన వినాయక  విగ్రహాలు  ఆ ఇంటికి శక్తిని, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి.

ఆవు పేడతో తయారుచేసిన  వినాయకుడు అదృష్టాన్ని,  పాజిటివ్ వైబ్రేషన్ ను ఇస్తాడు. దుఃఖాన్ని నిర్మూలిస్తాడు.

                                                       *రూపశ్రీ.