లోహంతో చేసిన తాబేలు ఇంట్లో ఈ దిక్కున ఉంచితే అదృష్టం!
లోహంతో చేసిన తాబేలు ఇంట్లో ఈ దిక్కున ఉంచితే అదృష్టం!
తాబేలును చాలామంది ఇళ్లలో పెంచుకునేవారు. కొన్నేళ్ల క్రితం ఇళ్లలో బావులున్నప్పుడు అందులో తాబేలు పెంచేవారు. ఇప్పుడు కూడా అడపా దడపా గ్రామాలలోని ఇళ్లలోని బావుల్లో తాబేలు ఉండటం చూడచ్చు. కానీ కాలం గడిచేకొద్ది ఇలాంటి ప్రాణులను పెంచుకోవడం చట్టవిరుద్దం అయింది. అటవీ అధికారులు యాక్షన్ తీసుకుంటారు కూడా. అయితే ఆర్థిక స్థితి బాగుండాలని చాలామంది లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుతుంటారు. ఏ దిశలో లోహపు తాబేలు ఉంచితే మంచిది? ఆర్థిక సమస్యలు పోయి అదృష్టం కలిసిరావాలంటే ఎక్కడ ఉంచాలి? తెలుసుకుంటే..
వాస్తు ప్రకారం ఇళ్లలో ఏ ప్రదేశంలో ఏ వస్తువు ఉంటే మంచిదో చెబుతారు. అలా చేయడం వల్ల నిజంగానే ఇంట్లో మార్పులు వస్తాయి. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తారు. కూర్మావతారం అని కూడా అంటారు. అందుకే తాబేలు ఇంట్లో ఉంటే విష్ణుమూర్తి ఉన్నట్టే. లోహపు తాబేలును ఇంట్లో ఉంచిదే విష్ణుమూర్తి కరుణ లభిస్తుంది.
లోహపు తాబేలును ఇంటికి తెచ్చాక ఉట్టిగానే ఉంచకూడదు. దాన్ని నీటితో నింపిన పంచలోహపు గిన్నె లేదా ప్లేటులో ఉంచాలి. తాబేలు నీటిలోనే జీవిస్తుంది కాబట్టి ఇలా చేయడం మంచిది.
ఇక లోహపు తాబేలును ఇంట్లో ఇత్తర దిశలో ఉంచడం మంచిది. తాబేలును అంట్లో ఉంచుకునేవారి ఆరోగ్యోం చక్కగా ఉంటుంది. అనారోగ్యాలుంటే నయమవుతాయి. వ్యక్తిత్వపరంగా కూడా మెరుగవుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. దీని కారణంగా విజయాలు సాధిస్తారు.
ఉత్తర దిశలో పంచలోహపు తాబేలు ఉంచడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. డబ్బు సంపాదనకు తగిన మార్గాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఎప్పుడూ ఇంట్లో కలతలు, గొడవలు, ఏదో ఒక సమస్య ఉంటున్నా పంచలోహపు తాబేలు ఉంచడం మంచిది. ఇది ఇంటికి సానుకూల శక్తిని చేకూరుస్తుంది.
*నిశ్శబ్ద.