రాముడి విల్లు పేరు ఏమిటి...ఆయనకు అది ఎప్పుడు ఎలా దక్కింది!

 

 

రాముడి విల్లు పేరు ఏమిటి...ఆయనకు అది ఎప్పుడు ఎలా దక్కింది!


కోదండ రాముడు అని రాముడిని ప్రస్తావించడం చూస్తుంటాం.  శ్రీరామ చంద్రుడు అని, దశరధ తనయుడు అని పిలవడం కూడా తెలుసు. అయితే కోదండ రాముడు అనే పేరులో అసలు కోదండం అంటే ఏంటో చాలామందికి తెలియదు.  కోదండం అనేది శ్రీరాముడి విల్లు పేరు.  త్రేతాయుగానికి చెందిన శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటారు. ఆయన తన పరమితుల్లో తను ఉంటూనే జీవితంలో తన కర్తవ్యాలను అన్నింటిని నిర్వహించాడు. పద్నాలుగు సంవత్సరాల అజ్ఞాత వాసంలో ఆయన సీతమ్మను పోగొట్టుకున్నాడు. వానర సైన్యం సహాయం తీసుకున్నాడు,  రావణాసురుడిని వధించాడు. అయితే కోదండ విల్లు గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి.

శ్రీరాముడి విల్లు పేరు కోదండం.  దీన్ని అందరూ పట్టుకలేరు.  కానీ ఇది చాలా సాధారణంమైన విల్లులాగా కనిపిస్తుంది.  కొన్ని విషయ సమాచారం ప్రకారం ఈ విల్లు వెదురుతో తయారుచేయబడినది అంట.   రామచరిత మానస్ లో తులసిదాస్ కోదండ విల్లు గొప్ప దనాన్ని వివరించారు. సీతమ్మ కోసం లంకకు వెళ్లే సమయంలో సముద్రుడు తనకు దారి ఇవ్వకపోవడంతో శ్రీరాముడికి కోపం వచ్చింది. ఆ కోపంలో   సముద్రంలో నీటిని  ఎండబెట్టేస్తానని అంటాడు. అందుకోసం కోదండాన్ని ఉపయోగిస్తాడు.  కానీ సముద్రుడు ప్రత్యక్షమై క్షమాపణ చెప్పడంతో కోదండం నుండి వెలువడిన బాణం తన లక్ష్యాన్ని చేధించిన తరువాత మాత్రమే తిరిగి వచ్చిందట.  కోదండ విల్లు బరువు దాదాపు ఒక క్వింటాలు ఉంటుందని అంటారు.

శ్రీరాముడు వనవాస సమయంలో దండకారణ్యంలో నివసించాడు.  ఆ సమయంలో రాక్షస సంహారం చేశాడు. ఆ అడవి రావణుడికి కోట లాంటిది.  ఆ అడవిలోనే రాముడు కోదండ విల్లును సృష్టించాడట.  దండకారణ్యంలో వివిధ ఆయుధాలను కూడా స్వీకరించాడు.  ఈ విల్లు తోనే రావణ సైన్యాన్ని నాశనం చేశాడు.


                                                    *రూపశ్రీ