తర్పణం ఎందుకు ఇవ్వాలి?
తర్పణం ఎందుకు ఇవ్వాలి?
గతించిన పితృ దేవతలకు ప్రతి ఏటా వచ్చే భాద్రపద మాసంలోని మహాలయపక్షాలలో తర్పణాలు విడవడం భారతీయ సనాతన సంప్రదాయక ఆచారంగా వస్తోంది. వేదకాలంనుంచి పాటించబడే ఈ ఆచారం భాద్రపద బహుళ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యి అమావాస్యతో ముగుస్తుంది. మహాలయపక్షంలో విడచే తర్పణం వలన అన్ని కస్టాలు తొలగిపోతాయి.మహాలయపక్షాల్లో అన్నదానం శ్రేస్ట్టమని శాస్త్రం చెబుతోంది. పదిహేనురోజులపాటు సాగే ఈ తర్పణ ఆచారంలో ఏ..ఏ..తిథుల్లో తర్పణం ఇస్తే, ఎటువంటి ఫలితం కలుగుతుందో చెప్పబడి ఉంది. అవి ఏమిటో తెలుసుకుందాం.
1 పాడ్యమి లేదా ప్రధమా ప్రపత్త్హి:- సంపదలు కలుగుతాయి
2 విదియ:- వంశవృద్ధి
3 తదియ: వ్యాపారవృద్ధి
4 చవితి: శత్రునిర్మూలనం
5 పంచమి: అన్ని రంగాలలో జయం
6 షష్టి: కీర్తి-ప్రతిష్టలు
7 సప్తమి: పున్యవృద్ధి -ఆధ్యాత్మిక దృష్టి
8 అష్టమి: బుద్ధి-తెలివితేటలు..
9 నవమి: భార్యా సహకారం
10 దశమి: ఉద్యోగంలో రాణింపు
11 ఏకాదశి: సంతాన సౌభాగ్యం
12 ద్వాదశి: విద్యావృద్ధి
13 త్రయోదశి: దీర్ఘాయువు, వాహన సౌఖ్యం, మానసిక శాంతి
14 చతుర్దశి : సకల సౌభాగ్యాలు
అమావాస్యా:
ఈ రోజు పితృదేవతలకు అతి ఇస్స్ట్టమైన రోజు.ఈ రోజున తర్పణం విడిచిపెడితే అది మీకు సంభంధం లేని వారికి కూడా చేరి, వారిని పుణ్యలోకాలకు పంపుతుంది. అంతేకాదు గత ముప్పైసంవత్సరాలుగా నరకం అనుభవిస్తున్న ఆత్మలను సైతం పుణ్యలోకాలను పొందే అర్హతను కలిగిస్తుంది. అమావాస్యనాడు విడిచే తర్పణాన్ని “మహా- తర్పణం” అని పిలుస్తారు.