ధ్వజస్తంభం దేవాలయానికి వెన్నుముక వంటిదా?

 

ధ్వజస్తంభం దేవాలయానికి వెన్నుముక వంటిదా?

 

 

ధ్వజస్తంభం పిడుగుల నుండి రక్షించేదిగా ఉంటుంది. ఒకవేళ ధ్వజస్తంభానికి దగ్గరలో దానికంటే ఎత్తుగా ఏదైనా కట్టడాలు కడితే ఆ కట్టడాలు పిడుగు దెబ్బలకు, అగ్నికి గురి కావడానికి అవకాశం ఎక్కువ. ధ్వజస్తంభాన్ని దేవాలయం వెన్నుముకగా తెలుపడం జరుగుతుంది. దేవాలయం యొక్క నడుము భాగంలో స్థంభం అడుగు భాగం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం గర్భగుడిలో వరకూ అడ్డంగా వేనుబాములా పడుకోబెట్టినట్లు భావించబడుతుంది. కానీ దాన్ని ఆకాశంలోకి నిటారుగా నిల్పడం జరుగుతుంది. దాని ఎత్తు ఖచ్చితంగా లెక్కించబడి ఉంటుంది. దాని తలపై ధ్వజస్తంభ వాహక దేవత ప్రతిష్టించబడి ఉంటుంది. ధ్వజస్తంబంపైన కుండలినీశక్తిని ముద్రించిన పతాకం ఏర్పరచబడి ఉంటుంది. ఈ కుండలినీశక్తి కలిగువున్న జండాను పైకి ఎత్తడమంటే, ప్రాణాయామం ద్వారా భక్తుని కుండలినీశక్తిని జాగృతపరచి సహస్రారానికి తీసుకువెళ్ళడం అనే అర్థాన్నిఇస్తుంది.