సంక్రాంతి గురించి భగవధ్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

 

సంక్రాంతి గురించి భగవధ్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

భారతదేశంలో జరుపుకునే  ప్రతి పండుగ వెనుక కొన్ని శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక కారణాలు కలిగి ఉంటాయి. దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి కూడా ఒకటి. ఈ పండుగను  ఏదో ఒక రూపంలో, దేశవ్యాప్తంగా  ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగను పరివర్తన దశగా పరిగణిస్తారు. భూమి సూర్యుని చుట్టూ   తిరగే  కాలాన్ని సౌర సంవత్సరం అంటారు. ఇలా తిరిగే కాలాన్ని   విభజించడం ద్వారా పన్నెండు రాశులు ఏర్పడ్డాయి. పన్నెండు రాశులకు పన్నెండు నెలలు ఉన్నాయి.

 సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని "సంక్రాంతి" అని, మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని అంటారు. సూర్యుని  ఒక రాశిలో నుండి మరొక రాశిలో ప్రవేశించే అన్ని కాలాల కంటే  ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించిన కాలం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సూర్యుడు మకర రాశి నుంచి ఉత్తర కర్కాటక రాశి వైపు వెళ్లడం 'ఉత్తరాయణం' అని, కర్కాటక రాశి నుంచి దక్షిణ మకర రాశి వైపు సూర్యుడు వెళ్లడాన్ని 'దక్షిణాయనం' అని అంటారు. ఉత్తరాయణంలో పగటి సమయం  ఎక్కువ,  రాత్రి సమయం తక్కువ ఉంటాయి. దక్షిణాయనంలో సరిగ్గా దీనికి విరుద్ధంగా జరుగుతుంది.


శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు  పగటి సమయం, దక్షిణాయణం దేవతలకు  రాత్రి సమయంగా చెప్పబడుతుంది. వేద కాలంలో ఉత్తరాయణాన్ని దేవయానమని, దక్షిణాయనాన్ని పిత్రియన్ అని పిలిచేవారు. మకర సంక్రాంతి రోజున యాగంలో నైవేద్యాన్ని స్వీకరించేందుకు దేవతలు భూమికి దిగివస్తారు. ఈ మార్గం ద్వారా, పుణ్యాత్ములు తమ శరీరాలను విడిచిపెట్టి, స్వర్గంతో పాటు ఇతర లోకాలకు వెళతారని నమ్మకం.

శ్రీ కృష్ణుడు ఉత్తరాయణం గురించి ఇలా చెప్పాడు..

ఉత్తరాయణం ప్రాముఖ్యతను వివరిస్తూ శ్రీ కృష్ణ భగవానుడు గీతలోని ఎనిమిదవ అధ్యాయంలో, ఉత్తరాయణంలోని 6 నెలల శుభ సమయంలో, సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు   భూమి ప్రకాశవంతంగా ఉంటుందని, ఈ కాంతిలో శరీరాన్ని విడిచిపెట్టడం లేదా మరణించడం  ద్వారా  వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని చెప్పాడు. దానికి విరుద్ధంగా సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు, భూమి చీకటిగా మారుతుంది.  ఈ అంధకారంలో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మను పొందవలసి ఉంటుంది.

మకర సంక్రాంతి రోజున స్నానానికి ఉన్న ప్రాముఖ్యత..

 తులసీదాస్  రామచరితమానస్‌లో ఇలా  సంక్రాంతి రోజున స్నానం గురించి ఇలా చెప్పారు.. "మాఘమాసంలో సూర్యుడు మకరరాశిలోకి వస్తాడు, అప్పుడు ప్రతి ఒక్కరూ  ప్రయాగలోని పవిత్ర సంగమ తీరానికి వస్తారు. దేవతలు, రాక్షసులు, మనుష్యులు అందరూ  వస్తారు.అందరూ త్రివేణి  సంగమంలో భక్తిపూర్వకంగా  స్నానం ఆచరించాలి. ఈ మాసంలో మనిషి ఏదైనా పుణ్యక్షేత్రంలోనో, నదిలోనో, సముద్రంలోనో స్నానమాచరించి, దానధర్మాలు చేసినా బాధల నుంచి విముక్తి లభిస్తుంది. కానీ, ప్రయాగ సంగమంలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. అని చెప్పాడు.

                                           *నిశ్శబ్ద.