వెంకన్న హస్తాలు ఎందుకలా ఉంటాయి
వెంకన్న హస్తాలు ఎందుకలా ఉంటాయి
కలియుగ దైవం శ్రీవెంకటేశుని దివ్వ దర్శనం చేసుకున్న వారందరికీ దివ్యానుభూతి కలగటం తథ్యం. అయితే నిత్య కళ్యాణకారుడైన వెంకటాచలపతి కరములు ఉండే తీరు అందరూ గమనించే ఉంటారు. స్వామి వారి పటంలో కూడా ఈ విషయం గమనించవచ్చు. శ్రీవారి హస్తాలు నేలను చూపిస్తున్నట్టు ఉంటాయి. అలా ఉండే ఆ భంగిమకు అర్థం, స్వామి పాదాలను శరణన్న వారికి, దర్శించిన వారికి లేమి లేకుండును అని. ఈ విషయం మనకు శ్రీవెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈ సారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆపాదమస్తకం, కళ్ళు తెరిచి చూడండి. స్వామి రూపాన్ని మనసులో ముద్రించుకోండి.