తులసి మొక్కను ఏ రోజు నాటితే మంచిది!
తులసి మొక్కను ఏ రోజు నాటితే మంచిది!
తులసి ప్రతి భారతీయ హిందూ ఉంట్లో తప్పనిసరిగా ఉండే మొక్క. ఇది అటు ఆరోగ్యాన్ని చేకూర్చే ఔషద మొక్కగానూ, ఇటు దైవిక మొక్కగానూ పరిగణించబడుతుంది. తులసి మొక్క సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి నివాస స్థానం అని అంటారు. తులసిని పూజించడం, తులసి ముందు నిత్య దీపారాధన చేయడం వల్ల ఈ ఇల్లు సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది చెబుతారు. అంతేకాదు.. తులసి మొక్క ఉన్న ఇంట్లోకి యమ భటులు రాలేరు అనే మాట కూడా చెబుతారు. అయితే ఇంట్లో కొత్త తులసి మొక్కను ఎప్పుడంటే అప్పుడు నాటడం మంచిదేనా అంటే కాదని అంటున్నారు శాస్త్ర పండితులు. తులసి మొక్కను ఏ రోజు నాటితే మంచిదితెలుసుకుంటే..
ఇంట్లో ఏదైనా మొక్కను నాటే ముందు వాస్తు నియమాలు పాటించడం మంచిదట. వాస్తు నియమాలు పాటించకపోతే వాస్తు దోషం వచ్చే అవకాశం ఉంటుందట.
వాస్తు ప్రకారం తులసి మొక్కను గురువారం నాటడం చాలామంచిది. ఇదే శుభప్రదం అని కూడా అంటున్నారు. సాధారణంగానే గురువారాన్ని లక్ష్మీ వారం అంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని కూడా చెబుతారు. గురువారం తులసి మొక్కను ఇంట్లో నాటితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఇంట్లో కొలువు తీర్చినట్టే అని అంటున్నారు.
తులసి మొక్కను శుక్రవారం కూడా నాటవచ్చట. కేవలం తులసి మొక్క అనే కాదు.. శుక్రవారం రోజు మొక్కలు నాటితే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుందట. జీవితంలో మంచి అభివృద్ది, ఎదుగుదల ఉంటాయని అంటున్నారు.
తులసి మొక్కను ఇంట్లో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం మంచిది. ఈ దిశలలో మొక్కను నాటితే అది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది.
ఆర్థిక సమస్యలు ఉన్నవారు గురువారం లేదా శుక్రవారం రోజులలో తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయట. అలాగే ఇంట్లో గొడవలు, కలహాలు, ఇబ్బందులు ఉంటే.. అవన్నీ కూడా కేవలం తులసి మొక్కను నాటి నిత్య పూజ చేసుకోవడం వల్ల తగ్గుతాయని అంటున్నారు.
*రూపశ్రీ.