వాస్తు - మెట్లు (Vastu – Upstairs)
వాస్తు - మెట్లు
(Vastu – Upstairs)
డాబా లేదా, మేడ మీదికి చేరాలంటే మెట్లు అవసరం. మెట్లు సుఖంగా, సౌఖ్యంగా, అందంగా ఉంటే సరిపోదు. వాస్తులో మెట్లకు (Vastu – Upstairs) కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు ప్రకారం మెట్లు (Vastu – Upstairs) ఎటువైపు ఉండాలో, ఎటువైపు ఉండకూడదో తెలుసుకోకుండా నిర్మిస్తే, ఆనక ఆపదలు వచ్చే అవకాశం ఉంది.
మెట్లు ఏయే దిక్కుల్లో ఉంటే చాలా మంచిదో చూద్దాం...
పడమర దిక్కు మధ్యభాగంలో
పశ్చిమ వాయువ్య దిశలో
దక్షిణ దిక్కు మధ్య భాగంలో
దక్షిణ ఆగ్నేయం దిశలో
మెట్లు ఏయే దిక్కుల్లో ఉంటే సామాన్య ఫలితం ఉంటుంది...
తూర్పు ఆగ్నేయం
ఉత్తర వాయువ్యం
మెట్లు వేయకూడని దిశలు...
తూర్పు దిక్కు మధ్య భాగంలో
ఉత్తర దిక్కు మధ్య భాగంలో
ఈశాన్యంలో
నైరుతిలో
మెట్లు ఎటునుండి ఎక్కితే శ్రేష్టం
తూర్పు నుండి పశ్చిమానికి ఎక్కడం మంచిది
ఉత్తరం నుండి దక్షిణానికి, ఈశాన్యం నుండి నైరుతికి ఎక్కడం కూడా మంచిదే.
మెట్లు ఎక్కకూడని దిక్కులు
దక్షిణం నుండి ఉత్తరానికి ఎక్కకూడదు.
పశ్చిమం నుండి తూర్పుకు ఎక్కకూడదు.
నైరుతి నుండి ఈశాన్యానికి ఎక్కకూడదు.
పైన సూచించిన వాస్తు నియమాలను అనుసరించి మెట్లు (Vastu – Upstairs) ఏర్పాటు చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. లేకుంటే ఆర్ధిక సమస్యలు, అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది.