ట్రెండింగ్ జ్యువెలరీ టిప్స్ అదిరిపోతాయ్!
ట్రెండింగ్ జ్యువెలరీ టిప్స్ అదిరిపోతాయ్!
అందమంటే అమ్మాయిలు, అమ్మాయిల దగ్గరే అందం తిష్టవేసుకుని ఉంటుంది. అందాల రాశులుగా నలుగురిలో తిరుగుతూ ఉంటే అదరహో అని అందరూ అనుకోవాల్సిందే. అమ్మాయిలు ఫాలో అయ్యే డ్రెస్సింగ్ స్టైల్ పార్టీ లలోనూ, ఫంక్షన్ లలోనూ వేరుగా ఉంటుంది. పండుగలు, దైవ కార్యాలప్పుడు వేరుగా ఉంటుంది. వాటికి తగ్గట్టు అమ్మాయిలు అలంకరించుకోవడం, డ్రెస్సుకు తగ్గట్టు మ్యాచింగ్ గా మ్యాజిక్ చేస్తూ అందరి ముందుకు రావడం చూస్తే అమ్మో ఇన్ని ఫాషన్ లు ఉన్నాయా అని ముక్కున వేలేసుకోవాల్సిందే.
పార్టీలు, ఫంక్షన్ల లో అమ్మాయిలు వేసుకునే జ్యువెలరీ విషయంలో బోలెడు వెరైటీలు ఉన్నాయి. మెడలో వేసుకునే గొలుసులు, నెక్లెస్ లు, లాంగ్ చైన్స్, పూసల దండలు ఇలాంటివి చాలా ఉంటాయి. అయితే ఏది వేసుకోవాలి అనే విషయంలో కొంచెం తికమకపడుతూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు డ్రెస్సుకు తగిన మ్యాచింగ్ లేక దిగులు పడిపోతారు.
అంత దిగులు పడాల్సిందేమి లేదు. అయితే ప్రతి డ్రస్సులోకి మ్యాచింగ్ అయిపోయే జ్యువెలరీ రెండున్నాయి. అవి ఒకటి బంగారం, రెండు వెండి. ఇది అందరికీ తెలిసిందేగా ఇందులో కొత్తేముంది అనుకోకండి. ఈ బంగారం, వెండి ఆభరణాలు ధరించడంలోనూ, సాధారణమైన ఫ్యాషన్ జ్యూవెలరి ధరించడంలోనూ కొన్ని టిప్స్ పాటిస్తే అమ్మాయిల ఆకర్షణ మరింత పెరుగుతుంది.
◆ ఒకే పొడవు ఉన్న జ్యువెలరీ అసలు వేసుకోకూకదు. ఇప్పట్లో సింగిల్ చైన్ వేసుకుని పార్టీలకు, ఫంక్షన్ లకు వెళుతున్నవాళ్ళు చాలా తక్కువ. అలాంటి వాళ్ళు చేసే పొరపాటు అదే. నచ్చాయి కదా అని ఒకటే పొడవున్న చైన్స్ వేసుకోకూడదు. అలా వేసుకుంటే ఒకదాంట్లో మరొకటి కలిసిపోయి వేసుకున్నది ఏంటో ఎవరికీ అర్థం కాదు. అందుకే పెద్దగా ఉన్నవి, వాటి మధ్యలో చిన్నగా ఉన్నవి వేసుకోవాలి.
◆ చాలా సన్నగా ఉన్న చైన్స్ ని పార్టీలకు ఫంక్షన్ లకు వేసుకోకపోవడం మంచిది ఒకవేళ వేసుకున్నా అవి వీలైనంత వరకు లేయర్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అవి గజిబిజి అయిపోతాయి.
◆ బంగారం, వెండి రెండింటిని కలిపి వాడితే లుక్ బాగుంటుంది.
◆ పగడాలు, ముత్యాలు, పచ్చ, నీలం ఇలాంటి స్టోన్స్ తో ఉన్న జ్యువెలరీ కూడా గ్రాండ్ లుక్ ని ఇస్తుంది.
◆ నార్మల్ చైన్ గా ఉండి దానికి లాకెట్ పెద్దగా ఉన్న జ్యువెలరీ చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. అయితే లాకెట్ రంగు, డిజైన్ విషయంలో కాస్త టేస్ట్ అవసరం.
బంగారం, వెండి, బీడ్స్, స్టోన్స్ ఎన్ని వెరైటీలు వున్నా వాటిని వేసుకోవడంలోనే లుక్ అంతా ఉంటుంది. ఫాషన్ ఐకాన్ గా కనిపించాలంటే ఆ మాత్రం ఫాలో అవ్వాలి కదా మరి.
◆ నిశ్శబ్ద.