Read more!

ఫేస్ షేవింగ్ చేసేటపుడు చేయాల్సినవి... చేయకూడనివి ఏమిటో మీకు తెలుసా..

 

షేవింగ్ చేసేటపుడు చేయాల్సినవి... చేయకూడనివి ఏమిటో మీకు తెలుసా..

కొంతమందికి ఫేస్ షేవింగ్ అంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మగవారు గడ్డం గీసుకున్నట్టు ఆడవారు ఫేస్ షేవింగ్ ఏమిటి అని అనిపించవచ్చు. కానీ ప్రస్తుత జనరేషన్ అమ్మాయిలకు ఈ ఫేస్ షేవింగ్ అనేది చాలా కామన్ విషయం. ఆడవారి కోసం ప్రత్యేకంగా రేజర్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి, వీటితో కాసింత సులభంగానే ఫేస్ మీద అన్ వాంటెడ్ హెయిర్ తొలగించుకోవచ్చు.  కానీ అందరి విషయం లో ఇలా జరగదు. ఫేష్ షేవ్ చేయడం వల్ల తరువాత ముఖం మీద వెంట్రుకలు చాలా మందంగా మరింత దట్టంగా వస్తాయనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ షేవింగ్ చేయడం వల్ల ముఖం మీద అవాంచిత రోమాలు తొలగించుకోవడమే కాకుండా ముఖ చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను కూడా సులభంగా తొలగించుకునే అవకాశం ఉంది. అయితే ఎలా పడితే అలా షేవింగ్ చేయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. షేవింగ్ వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే షేవింగ్ కు ముందు, షేవింగ్ కు తరువాత చెయ్యాల్సిన, చెయ్యకూడని పనులు ఏమిటో తెలుసుకోవాలి.

★ఫేస్ షేవింగ్ చేసేటపుడు పాటించాల్సినవి..

షేవింగ్ కు ముందు చర్మాన్ని బాగా శుభ్రపరుచుకోవాలి.
షేవింగ్ కోసం ఉపయోగించే రేజర్ సాఫీగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం రేజర్ కు మాశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ ను అప్లై చేయాలి.

షేవింగ్ చేసేటపుడు ఒకచేత్తో చర్మాన్ని సున్నితంగా సాగదీస్తూ.. రేజర్ తో మెల్లగా షేవ్ చేయాలి.
షేవ్ చేసేటపుడు రేజర్ ను పట్టుకునే విధానం కూడా చాలా ముఖ్యం. జట్టు ఏ దిశలో పెరుగుతుందో ఆ దిశలో షేవ్ చెయ్యాలి. 
షేవ్ చేసేటపుడు మధ్యమధ్యలో రేజర్ కు ఉన్న హెయిర్ ను రిమూవ్ చెయ్యాలి.
షేవింగ్ చేసిన తరువాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. వేడి నీటిని ఉపయోగించకూడదు. ఆ తరువాత చర్మాన్ని మెత్తని టవల్ తో తుడుచుకుని మాశ్చరైజర్ రాసుకోవాలి.
షేవింగ్ తరువాత రేజర్ బాగా శుభ్రపరచాలి. అలాగే తరచుగా రేజర్ ను మారుస్తూ ఉండాలి. 

పైవన్నీ షేవింగ్ విషయంలో పాటించాలి.

★షేవింగ్ సమయంలో చేయకూడనివి

ముఖం మీద మొటిమలు ఉన్నప్పుడు షేవింగ్ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరిగా చేసుకోవాలని ఉంటే.. స్కిన్ స్పెషలిస్ట్ ను సంప్రదించి ఆ తరువాత చెయ్యాలి. అవగాహన లేకుండా ఎక్కడో ఏదో చదివి పనికి పూనుకోకూడదు.

ఒకే చోట 2సార్లకంటే ఎక్కువ షేవ్ చేయకూడదు. 

షేవ్ చేసిన తరువాత ఒకరోజు వరకు ఆ ప్రాంతాన్ని సోప్ లు, షాంపూలు, ఎండ వంటి ప్రభావాలకు గురిచెయ్యకూడదు.

షేవింగ్ తరువాత చర్మసంరక్షణ ఎక్కువ తీసుకోవాలి. రేజర్ భధ్రపరిచే ముందు దాన్ని పొడిగా ఉంచాలి. చర్మానికి వ్యతిరేకంగా, వెంట్రుకలు పెరిగే వ్యతిరేక దిశలో ఎప్పటికీ షేవ్ చేయకూడదు. ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే... ఫేస్ షేవింగ్ కూడా సజావుగా గడిచిపోతుంది.

                                       ◆నిశ్శబ్ద.