Read more!

తిరుమల వేంకటేశ్వరుని కొలువు (Tirumala Venkateswara Koluvu)

 

తిరుమల వేంకటేశ్వరుని కొలువు

(Tirumala Venkateswara Koluvu)

తోమాలసేవ అనంతరం పావుగంట పాటు తిరుమామణి మండపంలో తిరుమలేశునికి కొలువు లేదా దర్బార్ నిర్వహిస్తారు. అప్పుడు తిరుమలేశుని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టి, స్వర్ణ ఛత్రం ఏర్పాటు చేస్తారు. స్వామివారికి ఈ ఈ అమూల్య కానుకలు మైసూరు మహారాజా బహూకరించారు. బలి బేరానికి రాజోచిత మర్యాదలు పాటించి పంచాంగంలో భూతభవిష్యద్వర్తమాన వివరాలను పఠిస్తారు. ఆనాటి గ్రహ సంచారక్రమం, ఆవేళ జరిగే ఉత్సవ విశేషాల గురించి తెలియజేస్తారు. ముందురోజు హుండీ ఆదాయ వివరాలు కూడా స్వామివారికి తెలియజేస్తారు.

 

ఇలా స్వామివారికి ఉత్సవ విశేషాలు, హుండీ ఆదాయ వివరాలు తెలియజేసిన తర్వాత నువ్వులు, బెల్లం కలిపి దంచిన పదార్థాన్ని వేంకటేశునికి నైవేద్యంగా సమర్పిస్తారు.

 

Tirumala Venkateswara Koluvu, Lord Venkateswara Rituals, Rituals in Tirumala, Lord Venkateswara Sannidhi, Tirumala Venkateswara Sevalu, Suprabhataseva koluvu, Tirumala Temple rituals