Read more!

తిరుమలలో మొదటి గంట, నైవేద్యం (Tirumala First Bell Food Offering)

 

తిరుమలలో మొదటి గంట, నైవేద్యం

(Tirumala First Bell Food Offering)

 

సుప్రభాతసేవ, అభిషేకాలు, కొలువు, సహస్రనామార్చనల తర్వాత శయన మంటపాన్ని శుభ్రం చేసి బంగారు వాకిలి తలుపులు మూస్తారు. తిరుమామణి మంటపంలో రెండుసార్లు గంటలు మోగిస్తారు. ఇలా తిరుమామణి మంటపంలో గంటలు మోగగానే అర్చకులు స్వామివారికి తొలి నైవేద్యం సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తారు. జీయంగారు లేదా ఆయన సహాయకుడు వైష్ణవ సంప్రదాయంలోని ప్రబంధ అధ్యాయాలను పఠిస్తారు. దీన్ని సట్టుమురా అంటారు. వేంకటేశ్వరుని ముందు మెట్టుకు ఇవతలి నుండి నైవేద్యం పెడతారు. స్వామివారికి నైవేద్యంగా పులిహోర, దద్దోజనం, లడ్డూలు, వడలు, పొంగలి, చక్రపొంగలి, అప్పాలు, పోళీలు నివేదిస్తారు.

 

నైవేద్యం స్వామివారికే కాకుండా విష్వక్సేనుడు, గరుడుడు, నిత్యాసురులకు కూడా నివేదిస్తారు. ఇలా గంటలు మోగించి, నైవేద్యం సమర్పించడాన్ని వ్యవహారంలో మొదటి గంట లేదా ఆలయ మొదటి గంట అంటారు.

 

స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత దద్దోజనం ప్రసాదంగా పంచుతారు.

 

Tirumala First Bell Food Offering, Tirumala Rituals, Rituals in Tirumala Temple, Tirumala Sevalu, Tirumala Venkateswaruni Sevalu,Tirumala first bell, Tirumala Naivedyam