తిరుమలేశుని ప్రధాన ఆలయం Tirumala Sri Venkateswara Temple
తిరుమలేశుని ప్రధాన ఆలయం
Tirumala Sri Venkateswara Temple
తిరుమలేశుని ప్రధాన ఆలయం అతి ప్రాచీనమైంది. ఈ ఆలయం ఏడు కొండల్లో ఒకటైన వేంకటాచలంపై, స్వామి పుష్కరిణికి దక్షిణ తీరాన ఉంది. మూలమూర్తి (Main Idol of Tirumala Sri Venkateswara) ఉండేది. ఈ ప్రధాన ఆలయంలోనే. మూల విరాట్టును ''ధ్రువబేరం'' అంటారు. పరమ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం నిరంతరం లక్షలాదిమంది భక్తులతో కిటకిటలాడుతుంటుంది. వెంకటాద్రిపై కొలువైన భక్తులు శ్రీ వెంకటేశ్వరుని భక్తి, ప్రేమ కలగలిపి 'ఏడుకొండల వెంకన్న' అని పిలుచుకుంటారు.
పురాణాలు, శాస్త్ర గ్రంధాల్లో తిరుమల ఆలయాన్ని అపురూపంగా వర్ణించారు. స్థల మహత్యాల్లో తిరుమల వైభవాన్ని వేనోళ్ళ కొనియాడారు. కలియుగంలో శ్రీ వెంకటాచలాన్ని దర్శించుకుని భక్తిప్రపత్తులతో నమస్కరించుకుంటేనే ఇహలోకంలో సుఖశాంతులు, పరలోకంలో ముక్తి లభిస్తాయని పండితులు ఘంటాపథంగా చెప్పారు.
తిరుమల ప్రధాన ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుందని అష్టాదశ పురాణాలే కాకుండా ఋగ్వేదంలో కూడా లిఖితమై ఉంది.
ప్రాచీనకాలంలో దేవతలకు బలి ఇవ్వడం అనే ఆచారం ఎక్కువగా ఉండేది. కోళ్ళు, మేకపోతుల సంగతి అలా ఉంచి కొన్ని ప్రాంతాల్లో నరబలి కూడా ఇచ్చేవారు. వైష్ణవ మతం ఆవిర్భవించిన తర్వాతే ఈ అనాగరిక ఆచారాన్ని వ్యతిరేకించడం మొదలైంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం ప్రేమని, విశ్వజనీనతని ప్రబోధిస్తుంది. జంతుబలిని ఆమడదూరానికి తరిమేసింది. ఆళ్వారుల దగ్గర్నుంచి ఆదిశంకరాచార్యుల వరకూ మహనీయులందరూ తిరుమల ఆలయ ప్రాభవాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
Tirumala Main Temple at Swami Pushkarini, Best Piligrimage Tirumala Kshetra, Sthala Puranas and Tirumala Venkateswara Temple, Sri Venkateswara Temple at Swami Pushkarini