లక్ష్మిదేవి ఎందుకు అలుగుతుంది ?

 

లక్ష్మిదేవి ఎందుకు అలుగుతుంది ?

 

 

లక్ష్మి ధనానికి అధిష్టాన దేవత. ఆమె అలుగుతే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా ? ఆమె చంచలమైనదని, ఒకచోట నిలువదని అందరూ అంగీకరించిన విషయమే! ఆమెని స్థాయీ రూపంలో ఇంట్లో నిలుపుకోవాలని ప్రతీ గృహయజమానులే కాక, గృహంలో తక్కిన సభ్యులు సైతం ఆసక్తి కనబరచడం మాలో చాలామంది చేసేదే. కొందరు ధన ప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేయడమే కాక, శ్రమని కూడా ఆపేస్తారు. అలాంటప్పుడు ఆమెని నిలుపుకోవడం ఎలా జరుగుతుంది? ఇంతకీ ఆమె ఎందుకు అలుగుతుంది? అలా అలగకుండా మనమేదైనా ఉపాయాలు చెయ్యగలమా? అన్న ప్రశ్నకి తంత్రం సమాధానం ఇచ్చింది. వాటిలో కొన్ని .....
1      మంగళ వారం నాడు అప్పు తీసుకోకూడదు, అలా చేస్తే లక్ష్మి అలగడమే కాక అప్పును స్థాయీ రూపంలో నిలిపివేస్తుంది..
2      బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు. అలా మాటిమాటికీ చేస్తే లక్ష్మి అలగడమే కాక ఆ ఇంటి నుండి  వెళ్లిపోతుంది.
3      తామర పువ్వులు, బిల్వ పత్రాలు నలప కూడదు.
4      ఈశాన్య కోణంలో వంట ఇంటినిగాని శౌచాలయాన్నిగాని కట్ట కూడదు. .
5      పూజా గృహంలో ఎంగిలి, ఆశౌచము ఉంచ కూడదు.

 

 

6      నగ్నంగా స్నానం చేయకూడదు, సరస్సులలో, నదులలో మలమూత్ర విసర్జన చేయ కూడదు.
7      భూముల మీద, గోడల మీద అనవసరంగా  వాయకూడదు, బూతు గాని, చెడు గాని అసలు వ్రాయ కూడదు.
8      పాదాన్ని పాదంతో రుద్ది కడగ కూడదు, చేతితోనే రుద్ది కడుగుకోవాలి. అతిథికి మర్యాద లోపం చేయకూడదు. పశుపక్షుల గ్రాసాన్ని కాజేయకూడదు, గోవుని అనవసరంగా కొట్ట కూడదు.
9      సంధ్యా సమయంలో ఇల్లు, వ్యాపార స్థలం ఊడ్చే పని చేపట్ట కూడదు, ఉదయ సాయం సంధ్యలలో కనీసం అగరువత్తి ధూపంతోనైనా దేవతారాధన చేయకుండా ఉంచకూడదు, తులసి చెట్టుని అనాదరణ చేయకూడదు.
10     సూర్యోదయం తరువాత కూడా అనవసరంగా నిద్రించ కూడదు, సోమరి తనాన్ని అలవరచుకో కూడదు.

 

 


11     ఏ ఇంటిలో అయితే గృహ కలహాలు తరచుగా జరుగుతుంటాయో, మహిళలు, వృధ్ధులకు అనాదరణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిపైన లక్ష్మి అలుగుతుంది..
12     దేవీదేవతల చిత్తరువులని చిత్తుకాగితాలలాగ వాడకూడదు.
13     అభావగ్రస్తులని అవహేళన చేయకూడదు,
14     వంచనతో తీసుకొన్న ఋణాన్ని తీర్చకుండా జాప్యం చేయకూడదు.
15     పురుషార్థ రహితంగా, అంటే వ్యాపార నిమిత్తం కాక, ఎంగిలి, అశౌచము, అబధ్ధము, జూదము, లాటరీ లాంటి పనులు చేయకూడదు.
16     వ్యసనానికి బానిస కాకూడదు.

చూడడానికి చిన్న చిన్న కారణాలుగా కనిపించినా ఇవి తప్పక పాటించవలసిన నియమాలు.