స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం
స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ట సందర్బంగా చర్చిస్తూ సంస్థాపక సభ్యులు, పూర్వాధ్యక్షులు మరియు ప్రస్తుత ఉపాధ్యక్షులు రఘునాథ రెడ్డి ఇలా అన్నారు
స్టాక్టన్ మరియు పరిసర ప్రాంతాల హిందువుల సౌకర్యార్థమై ఒక గుడి నిర్మించాలనే సదుద్ధేశ్యంతో ప్రారంభమైన సంస్థ స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం. తొలుత, భారత దేశము మరియు ఫిజి దేశం నుంచి వలస వచ్చిన 9 మంది సంస్థాపక సభ్యులతో పునాది వేసుకొని వారి విరాళాలతో, జులై 2009లో 2 ఎకరాల భూమి సేకరించి అందులో ఉన్న చిన్న మొబైల్ ఇల్లు ను తాత్కాలిక గుడి గా మార్చి ప్ప్రతి పండగ పబ్బము విధిగా నిర్వహించడము జరిగింది. సనాతన ధర్మ సిద్ధాంతాల ఆధారంగా మొదలైన ఈ సంస్థ, స్థానిక హిందువులకు పూజ స్థలము ఆధ్యాత్మిక కేంద్రము యోగాభ్యాసము తదితర సదుపాయాలు కల్పించాలనే దృష్టి , దృక్పధం తో అంచలంచలుగా పెరుగుతూ 50 మంది కార్యనిర్వాహణ సభ్యులు మరియా 500 ఫై చిలుకు భక్తులు సేవకులతో కలిసి ఒక పెద్ద వసుదైక కుటుంభం ల వెలిసింది .
మే 12,2013 అక్షయ త్రితీయ శుభ ముహూర్తాన భూమి పూజ తో మొదలైన ఆలయ నిర్మాణము పూర్తి అయి వేద పండితులు నిర్ణయంచిన శుభ ముహూర్తానికి కుంభాభిషేకం ప్రాణప్రతిష్ట కు సిద్ధముగానున్నది. భగవత్ అనుగ్రహము మరియు ఎందరో భక్తుల సహాయ సహహకారముల తో వెలసిన ఆలయ భవనము చూడ ముచ్చటగానున్నది. ఈ ఆలయ ప్రాంగణములో శివ బాలాజీ ( వెంకటేశ్వరా స్వామి) నవ గణపతి గర్భ గుడులు ఇంకా దుర్గమ్మ తల్లి షిర్డీడీ సాయి బాబా రామ్ దర్బార్ రాధాకృష్ణుల భూదేవి శ్రీదేవి ఆంజనేయ స్వామి నవ నవగ్రహ ప్రతిష్స్థాపనకు ఆస్కారం కల్పించబడినది . వెంకటేశ్వరా స్వామి పరివారము టీటీడీ వారి సహాయ సౌకర్యముల తో సేకరించబడినది సాయి బాబా ముంబై నించి మిగతావి జైపూర్ రాజస్థాన్ నించి సేకరించబడినవి
స్టాక్టన్ చరిత్ర లో తల మాణిక కా గల ఈ మహోన్నత కార్యానికి యిదే మా ఆహ్వానం . సకుటుంబ సపరివారము తో విచ్చేసి, కన్నుల విందగు ప్రాణప్రతిష్ట తిలకించి భగవద్ అనుగ్రహం మరియు వేదపండితుల ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా మా మనవి. ప్రతిరోజూ టిఫిన్ ఫలహారాలు మధ్యాన్నం మరియు రాత్రి భోజనము ఏర్పాటు చేయబడినది.
ఈ ఆహ్వానము మీ బంధుమిత్రులతో పంచుకోగలరని మనవి
వెబ్సైటు www.stocktonhindutemple.org