దేవుణ్ణి నమ్మే ఈ 9 దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది!

 

దేవుణ్ణి నమ్మే ఈ 9 దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది?


దేవుడిని అన్ని దేశాల్లో నమ్ముతారు...పూజిస్తారు. దేవుడిని నమ్మడం.. నమ్మకపోవడం అనేది వారి వారి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అయితే దేవుడిని ఏ దేశాలు గాఢంగా నమ్ముతాయి? అందులో భారతదేశం స్థానం ఎంత?


భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే దేశం మన భారతదేశం. మన దేశం ఎంతో  గర్వించదగ్గ దేశం. మీరు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా, మీరు భారతదేశం యొక్క ప్రకృతి సౌందర్యం, మతం, సంస్కృతి, సంప్రదాయాలను తిలకిస్తారు. మత విశ్వాసాల గురించి మాట్లాడుకుంటే...భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు కూడా దేవునిపై విశ్వాసం కలిగి ఉంటారు. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం, 34 దేశాల్లో కేవలం 45% మంది మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నారని పేర్కొంది. ఏ దేశాలు దేవుడిపై గాఢ విశ్వాసం కలిగి ఉన్నాయో తెలుసా?

ఇండోనేషియా:

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం, ఇండోనేషియాలో నివసిస్తున్న 93 శాతం మంది ప్రజలు దేవుణ్ణి నమ్ముతున్నారు. వారు తమ దినచర్యలో కొంత సమయం భగవంతుని భక్తితో గడుపుతారు. దేవుడిని ఎక్కువగా నమ్మే దేశాల జాబితాలో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉంది.

టర్కీ:

టర్కీలో పెద్దసంఖ్యలో ముస్లిం సమాజం ఉన్నందున, అల్లాను విశ్వసించే వారు ఎక్కువ. 91 శాతం మంది టర్కీ ప్రజలు అల్లాను తమ దేవుడిగా భావిస్తారు. టర్కీలో నివసిస్తున్న ప్రజల జీవనశైలి, ఆహారం  విద్య అన్నీ మతంపై ఆధారపడి ఉంటాయి. దేవునిపై విశ్వాసం విషయంలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా, టర్కీ రెండవ స్థానంలో ఉంది.

బ్రెజిల్:

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం దేవుణ్ణి నమ్మే దేశాల్లో బ్రెజిల్ మూడో స్థానంలో ఉంది. బ్రెజిల్‌లో 84 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారు. బ్రెజిలియన్లలో ఎక్కువ మంది క్రైస్తవ సమాజానికి చెందినవారున్నారు. వారు కాథలిక్కులు. ప్రపంచంలోనే అతిపెద్ద యేసుక్రీస్తు విగ్రహం బ్రెజిల్‌లో ఉంది. ఇది దేవునిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది.

దక్షిణ ఆఫ్రికా:

ఈ సర్వేలో 34 దేశాల్లో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడి జనాభాలో 83 శాతం మందికి దేవుడిపై అపారమైన విశ్వాసం ఉంది. దక్షిణాఫ్రికా బ్రిటన్‌కు వలసరాజ్యంగా ఉన్నందున, క్రైస్తవ మతాన్ని విశ్వసించే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

మెక్సికో:

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం ఇక్కడి ప్రజలలో 78 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారు. ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా హింసకు ప్రసిద్ధి చెందింది. కానీ దేవునిపై చాలా విశ్వాసం కలిగి ఉంది. ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది.

అమెరికా:

అమెరికా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశం మాత్రమే కాదు. ధనిక దేశం కూడా. అయితే, ఈ దేశ ప్రజలు దేవుడిపై తమకున్న నమ్మకాన్ని మరచిపోలేదు, దేవుణ్ణి తిరస్కరించలేదు. దేవుణ్ణి ఎక్కువగా నమ్మే దేశాల జాబితాలో అమెరికా 6వ స్థానంలో ఉంది. అమెరికా జనాభాలో 70 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారు.

అర్జెంటీనా:

ఈ సర్వే ప్రకారం దేవుడిని నమ్మే దేశాల్లో అర్జెంటీనా ఏడో స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రజలు తమ రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని భగవంతుని ఆరాధనకు కేటాయిస్తారు. ఇక్కడి జనాభాలో 62 శాతం మంది దేవుణ్ణి నమ్ముతున్నారని, దేవుడిని ఆరాధించడానికే అంకితమవుతారని ఓ సర్వే చెబుతోంది.

రష్యా:

దేవుణ్ణి నమ్మే దేశాల్లో రష్యా ఒకటి. ఇక్కడి ప్రజలు కూడా దేవుణ్ణి నమ్ముతారు. దాదాపు 56 శాతం మంది దేవుణ్ణి నమ్ముకుని జీవిస్తున్నారు. దేవుడిని నమ్మే దేశాల జాబితాలో రాష్ట దేశం ఎనిమిదో స్థానంలో నిలిచిందని సర్వేలో తేలింది.

భారతదేశం:

భారతదేశంలో మతం, సంస్కృతి ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో దేవుణ్ణి నమ్మే వారు చాలా తక్కువ. భారతదేశ జనాభాలో 56 శాతం మంది మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు విగ్రహారాధనను కూడా నమ్మరు.