Read more!

ఇలాంటివారే గొప్పవారు..

 

ఇలాంటివారే గొప్పవారు


ప్రియా న్యాయ్యా వృత్తిర్మలినమసుభంగే-ప్యసుకరమ్‌
త్వసంతో నాభ్యర్య్థాః సుహృదపి న యాచ్యః కృశ ధనః ।
విపద్యుచ్చైః ధైర్యం పదమనువిధేయం చ మహతాం
సతాం కేనోద్దిష్టం విషమ మసిధారావ్రత మిదమ్‌॥

న్యాయబద్ధమైన వృత్తిని చేయడం, ప్రాణాపాయంలో కూడా ధర్మాన్ని మీరకపోవడం, దుర్మార్గులను ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థించకపోవడం, ధనం ఎంత అవసరం అయినా కానీ ప్రాణస్నేహితుడిని సైతం యాచించకపోవడం, మహాత్ములను అనుసరించడం, విషమ పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ఉండటం... సజ్జనులకు స్వాభావికంగా ఉండే లక్షణాలు.