స్నేహితులంటే ఇలా ఉండాలి!
స్నేహితులంటే ఇలా ఉండాలి!
క్షీరేణాత్మగతోదకాయ హి గుణా దత్తాః పురా తే-ఖిలా
క్షీరోత్తాపమవేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః ।
గంతుం పావకమున్మనస్తదభవ ద్దృష్వ్టా తు మిత్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి సతాం మైత్రీ పునస్వ్తీదృశీ ॥
తనలోకి చేరిన నీటికి, పాలు తన గుణాలన్నింటినీ అందిస్తుంది. పాలు నిప్పుల మీద కాగుతున్నప్పుడు, అవే నీరు అగ్నిలో పడి మరీ పాలని కాపాడే ప్రయత్నం చేస్తాయి. తిరిగి పాల మీద నీటిని చల్లినప్పుడు, పాలు శాంతిస్తాయి. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఆపదలో అండగా నిలవడం, ఆగ్రహంలో శాంతింపచేయడం... ఇలా నిజమైన స్నేహానికి పాలు, నీరు నిర్వచనంగా నిలుస్తాయి. బహుశా అందుకేనేమో పాలు, నీరులా కలిసిమెలసి ఉండండంటూ పెద్దలు స్నేహితులనీ, దంపతులనీ దీవిస్తూ ఉంటారు.