Yeluka Vacche Illu Bhadram 27

 

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

ఎలుక వచ్చే ఇల్లు భద్రం -27

ఇలపావులూరి మురళీ మోహనరావు

*******************************************************************

ఊపిరి పీల్చుకున్నాడు వెంకట్రావు.

"యస్సర్ యస్సర్ యూ ఆర్ రైట్!చాలా విలువైన వజ్రం

మాట చెప్పారు.ఉంటానుసర్ సీట్లో హెవీ వర్క్ ఉంది "

అన్నాడు.

“క్యారీ ఆన్ "సైగ చేశాడు మేనేజర్.

గండం గట్టెక్కించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

“ఏంటండోయ్ చాలా రిలాక్స్ డుగా కనిపిస్తున్నారు.ఏంటి విశేషం "అడిగింది భారతి.

విషయం ఆమెకు చెబుదామా వద్దా అని ఆలోచించాడు.చివరకు చెప్పకపోవడమే మంచిదని

నిర్ణయించుకున్నాడు.

“నథింగ్ మేడమ్.మేనేజర్ గారి చెప్పు తెగిందట "చెప్పును వత్తి పలికాడు వెంకట్రావు.

భారతి ముఖం మాడింది.

మరో నాలుగు రోజులు పోయాక ఓ ఉదయం సుందరి నిద్ర లేవగానే మ్యావ్ మ్యావ్ మని పిల్లి

కూతలు వినిపించాయి.

వెంకట్రావును నిద్ర లేపింది.

“ఏవండోయ్ పిల్లి కూతలు...పిల్లి కూతలు "అన్నది.

“అబ్బా కాసిని వేడినీళ్ళు తాగు.అవే సర్దుకుంటాయి "బద్దకంగా అన్నాడు వెంకట్రావు.

“నా ఖర్మ...పిల్లి కూతలు వినబడుతున్నాయంటే వేణ్ణీళ్ళు తాగమంటారెంటి?లేవండి "

తలబాదుకుంది సుందరి.

“అబ్బ...నేను లేచి ఏం చేసేది?ఎవరి గొంతులో వచ్చే పిల్లి కూతలు వాళ్లకు

వినిపిస్తాయి.అవతలి వాళ్లకు వినబడవు.నెమ్ము చేరి ఉంటుందిలే.ప్రస్తుతానికి వేడినీళ్ళు

తాగు "మరింత మత్తుగా అన్నాడు వెంకట్రావు.

“ఇంత తెలివి తక్కువ మనిషిని చేసుకోవడం నా ప్రారబ్ధం నాకు పిల్లి కూతలు రావడం

కాదండీ. ఎక్కడి నుంచో పిల్లులు అరుపుల వినిపిస్తున్నాయి.”

“ఎక్కడి నుంచో వినిపిస్తే నీకెందుకు,బజార్లో అనేక జంతువులు అరుస్తుంటాయి.అందులో

ఏముంది?”అన్నాడు వెంకట్రావు.

“బజార్లోంచి కాదు మనింట్లో నుంచే లేవండి "

“అబ్బబ్బ మనిషి నిద్రపోతున్నాడన్న జ్ఞానం లేదు కదా!శెలవు రోజునైనా పది గంటలదాకా

పడుకుందామంటే కుదరదు "విసుక్కుంటూ లేచాడు వెంకట్రావు.

ఇద్దరూ కలిసి ఇల్లంతా వెతికారు.పిల్లుల అరుపులు వినిపిస్తున్నాయి.కానీ ఎక్కడా

కనిపించడం లేదు.చెవులు రిక్కించి వినగా వినగా ఆ శబ్దాలు ఆటక మీదినుంచి వస్తున్నట్లు

అర్థమైంది. స్టూలెక్కి అటక మీద చూసి కెవ్వున అరిచింది సుందరి.

“ఓసి నీ అరుపు తగలెయ్యా ఏంటా కేక!గుండె పగిలేట్లు!ఏముందక్కడ ?”ఉలికిపడి

అన్నాడు వెంకట్రావు.

“పి పి పి పిల్లులు "అన్నది సుందరి.

“పిల్లులా ?అక్కడ ఎందుకున్నాయి ?ఎలా వచ్చాయి ?ఏదీ దిగు నేను చూస్తాను "తానేక్కి

చూశాడు వెంకట్రావు.

ఒక పెద్ద పిల్లి.ఆరు కూనలు ఉన్నాయక్కడ.

“మైగాడ్...ఇది నేను తెచ్చిన పిల్లే.లావుగా బొద్దుగా ఉంటే బాగా తిని బలిసిన

పిల్లేమోననుకున్నా ఇది కడుపుతో ఉన్న పిల్లన్నమాట "నోరు తెరచి చూస్తుండిపోయాడు

వెంకట్రావు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)