ముందుచూపు లేకుంటే

 

ముందుచూపు లేకుంటే

కొంపగాలు వేళ, గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి ఫలము గలుగు
ముందుచూపు లేని మూర్ఖుండు చెడిపోవు
లలితసుగుణజాల! తెలుగుబాల!!

ఒకడి ఇల్లు తగలబడిపోతోందట. ఆ ఇంటిని ఆర్పేందుకు కావల్సిన నీటి కోసం అతను అప్పటికప్పుడు బావి తవ్వడం మొదలుపెట్టాడు. దాని వల్ల ఉపయోగం ఏమాత్రం ఉండకపోగా, ఉన్న కాస్త విలువైన సమయం కూడా వృధా అయిపోతుంది కదా! ముందుచూపు లేని మూర్ఖుని పద్ధతి ఇలాగే ఉంటుందంటున్నారు కవి. ఉంటే ముందుచూపన్నా ఉండాలి, లేకపోతే అప్పటికప్పుడు నేర్పుగా వ్యవహరించే సమయస్ఫూర్తన్నా ఉండాలి.

 

-నిర్జర