మన శత్రువు ఎవరంటే!
మన శత్రువు ఎవరంటే!
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్॥
రజో గుణం వలన ఉత్పన్నం అయ్యే కామక్రోధాలని తృప్తి పరచడం అసాధ్యం. ఈ గుణాలే నిన్ను పాపం వైపుగా నడిపించే శత్రువులని తెలుసుకో. రజో గుణం వల్ల ఇంద్రియాల మీద నిగ్రహం ఉండదు. ఇంద్రియాలు పరిపరివిధాలా పరుగులెత్తినప్పుడు కోరికలకు అంతు ఉండదు. ఇదే కామం అంటే! ఈ కామం తీరనప్పుడు క్రోధం ఏర్పడుతుంది. పోనీ ఒకవేళ కోరిక తీరినా మరో కోరిక సిద్ధంగా ఉంటుంది. ఫలితం! మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పతాడు. ఈ జీవితపు నిజమైన విలువను గ్రహించలేకపోతాడు. కాబట్టి దీనంతటికీ మూలం అయిన రజోగుణాన్నీ... తత్ఫలితంగా ఏర్పడే కామక్రోధాలనూ శత్రువులుగా గ్రహించమంటున్నాడు శ్రీకృష్ణపరమాత్ముడు.
..Nirjara