సుభాషితం - (Subhashitam) ముల్లుకర్రతో ఎద్దును

 

సుభాషితం - (Subhashitam)

ముల్లుకర్రతో ఎద్దును, ఔషధంతో రోగాన్ని...


శక్యో వారయితుం జలేన హుతభుక్చత్రేణ సూర్యాతపో

నాగేంద్రో నిశితాంగు శేన సందో దండేన గౌర్గర్దభః

వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మన్త్ర ప్రయోగైర్విషం

సర్వస్వౌషధమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్త్వౌ షధం

 

నీటితో నిప్పును, గొడుగుతో సూర్యుణ్ణి, ముల్లుకర్రతో ఎద్దును, అంకుశంతో మదపుటేనుగును, ఔషధంతో రోగాన్ని, మంత్ర ప్రయోగంతో విషాన్ని చక్కబరచవచ్చు. కానీ, మూర్ఖుని మనసును మాత్రం ఏ విధంగానూ సరిచేయలేము.