Read more!

సుభాషితం - (Subhashitam) మాట తీరే సిసలైన ఆభరణం...

 

సుభాషితం - (Subhashitam)

మాట తీరే సిసలైన ఆభరణం...


    కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా

    న స్నానం న విలేపనం న కుసుమం నాలంక్రుతా మూర్ధజా

  వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

 

    మనకు బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు. తలలో పూల మాలలు, పరిమళభరితమైన స్నానాలు ముఖ్యం కాదు. స్వచ్చమైన, నిర్మలమైన, సంస్కారంతో కూడిన మాటలే సిసలైన అలంకారాలు. కనుక పైపై మెరుగులేవీ కాదు, మాట తీరే ముఖ్యం. అదే సిసలైన ఆభరణం.