Read more!

షిరిడీలో బాబా విగ్రహాన్ని ఎప్పుడు, ఎవరు ప్రతిష్టించారు ?

 

షిరిడీలో బాబా విగ్రహాన్ని ఎప్పుడు,

 

 

ఎవరు  ప్రతిష్టించారు ?

 

 

 

 

15 అక్టోబరు 1918 మంగళవారం బాబా తన అవతారాన్ని చాలించారు. మరుసటి రోజు అంటే 16 అక్టోబరు 1918 బుధవారం మధ్యాహ్నం బాబా పార్థీవదేహాన్ని ఊరేగించి, బూటీవాడాకు ఊరేగించి, బూటీవాడాకు  తరలించారు. బాబా కోరిన విధంగానే అణువణువునా ఆధ్యాత్మికతనూ, మహాత్యాన్నీ నింపుకున్న బూటీవాడా మధ్యాహాలులో, మురళీధరుణ్ణి ప్రతిష్టించేందుకు నిర్మించిన మందిరంలో బాబాని సమాధి చేశారు. ఆ సమాధి మీద బాబా చిత్రపటాన్ని ఉంచి, యధావిధిగా పూజలు సాగించారు, హారతి ఇచ్చారు. ఈ సమాధి మందిరంలోనే సచ్చిదానంద స్వరూపుడైన సాయినాథుని విగ్రహాన్ని 1954లో ముంబాయికి చెందిన బాలాజీ వసంతరావు తాలీము రూపొందించారు. ఆ సంవత్సరమే స్వామి సాయిచరణ్ ఆనంద్ జీ చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది.