హయగ్రీవ స్తోత్రమ్ (Hayagreeva Stotram)

 

 

హయగ్రీవ స్తోత్రమ్

(Hayagreeva Stotram)

జ్ఞానానందమయం దేవం, నిర్మల స్ఫటికాకృతిమ్,

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే

స్వతస్సిద్ధం శుద్ధస్ఫటికమణిభూభ్రుత్ప్రతిభటం

సుధాసద్రీచీభిర్ద్యుతిరవదాత త్రిభువనమ్

 

అనంతాయస్త్రయ్యంతై రనువిహిత హేషా హలహలం

హతాశేషా పద్యం హయవదమీడే మహి మహః

సమాహారస్సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం

లయః ప్రత్యూహానాం లహరివితతిర్భోధజలధే:

 

కదాదర్పక్షుభ్యత్కథ కకులకోలాహలభవం

హరత్వంతర్ధ్వాంతం హయవదన హేషాహాలహలః

ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ఞా దృష్టే రంజన శ్రీరపూర్వా

వక్ర్తీ వేదాన్ భాతు మే వాజివక్త్రాం, వాగీశాఖా వాసుదేవస్య మూర్తి:

 

విశుద్ధ విజ్ఞానఘన స్వరూపం, విజ్ఞాన విశ్రాణనబద్ధదీక్షమ్,

దయానిధిం దేవభ్రుతాం శరణ్యం, దేవం హయగ్రీవమహం ప్రపద్యే

అపౌరుషే హైరపివాక్ప్రపంచైరద్యాపి తే భూతిమదృష్టసారామ్

స్తువన్నతం ముగ్ధ ఇతి త్వయైవ, కారుణ్యతో నాథ! కటాక్షణీయః

 

దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిర్దేవీ సరోజాసన ధర్మపత్నీ వ్యాసాదయోపి వ్యవదేశ్యవాచః స్పురంతి సర్వే తవ శక్తిలేశై:

మందో భవిష్యన్ని యతం విరించి: వాచాం నిదేర్వంచితభాగదేయః

దైత్యాపనీతాన్ దయయైవ భూయోప్యధ్యాపయిశ్యోనిగమాన్నచేత్త్వమ్

 

వితర్క డోలాం వ్యవధూయ సత్త్వే బృహస్పతిం వర్తయసే యతస్త్వమ్

తేనైవ దేవ! త్రిదశేశ్వరాణాం, అస్ప్రష్టడోలాయిత మాధిరాజ్యమ్

అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతోరాతస్థివాన్ మంత్రమయం శరీరమ్

అఖండ సారైర్హవిషాం ప్రదానై: ఆప్యాయనం, వ్యోమసదాం విధత్సే

 

యన్మూలమీద దృక్ప్రతిభాతి తత్త్వం యా మూలమామ్నాయ మహాద్రుమాణామ్

తత్త్వేన జానంతి విశుద్ధసత్త్వాం: త్వామక్షరాక్షరమాతృకాం తే

అవ్యాకృతాద్వ్యా క్హ్రీతవాన సిత్వం, నామాని రూపాణి చ యాని పూర్వమ్

శంసంతి తేషాం చరమాం ప్రతిష్ఠాం వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞవాచః

 

ముగ్దేందునిశ్యందవిలోభనీయాం, మూర్తిం తవానందసుధాప్రసూతిమ్

వివశ్చితశ్చేతసి భావయంతో వేలాముదారామివ దుగ్ధసింధో:

మనోగతం పశ్యతి యస్సదా త్వాం మనీషిణాం మానసరాజహంసమ్,

స్వయం పురోభాగవివాదభాజం: కిం కుర్వతే తస్య గిరో యథార్హమ్

 

అపిక్షణార్ధం కలయంతి యే త్వామాప్లావయంతం విశదైర్మయూఖై:

వాచాం ప్రవాహైరనివారితైస్తే మందాకినీం మందయితుం క్షమన్తే

స్వామిన్ భవద్ద్యానసుధాభిషే కాద్వహన్తి ధన్యాః పులకానుబంధమ్

అలక్షితే క్వాపి నిరూఢమూలమం గేష్వివానందథుమంకురంతమ్

 

స్వామిన్! ప్రతీచా హృదయేన ధన్యాసత్వద్ద్వాన చంద్రోదయ వర్ధమానమ్

అమాంతమానందపయోధిమంతః వయోభిరక్షాం పరివాహయంతి

స్వైరానుభావా: త్వదధీనభావా: సమృద్ధవీర్యాస్త్వదనుగ్రహేణ

విపశ్చితో నాథ తరంతి మాయాం వైహారికీం మోహనపించికాంతే

 

ప్రాజ్మిర్మితానాం తపసాం విపాకాత్ప్రత్యగ్రనిశ్శ్రేయ సంపదో మే,

సమేధిషీరంస్తవ పాదపద్మే సంకల్పచింతామణయ ప్రాణామాః

విపుప్తమూర్ధన్యలిపిక్రమాణాం, సురేంద్రచూడాపదలాలితానామ్

త్వదంఘ్రి రాజీవరణ: కణానాం భూయాన్ ప్రసాదో మయి నాథ! భూయాత్

 

పరిస్ఫురన్నూపుర చిత్రభాను ప్రకాశనిర్ధూతతమో నుషంగామ్

పదద్వయం తే పరిచిన్మ హేతః ప్రబోధరాజీవవిభాతసంధ్యామ్

త్వత్కింకరాలంకరనోచితానాం త్వయైవ కల్పాంతరపాలితానామ్

మంజుప్రాణాదం మణినూపురం తే మంజూషికాం వేదగిరాం ప్రతీమః

 

సంచింతయామి ప్రతిభాదశాస్థాన్ సంధుక్షయంతం సమయప్రదీపాన ర్,

విజ్ఞానకల్పద్రుమ పల్లవామ్ వ్యాఖ్యానముద్రామధురం కరంతే

చిత్తే కరోమి స్పురితాక్షమాలం సవ్యేతరం నాథ కరం త్వదీయమ్,

జ్ఞానామృతోదంచనలాలసానాం లీలాఘటీయంత్రమివాశ్రితానామ్

 

తామాంసి భిత్త్వాం విసహదైర్మయూఖైస్సంప్రీణయంతం విదుషశ్చకోరాన్

నిశామయే త్వాం నవపుండరీకే శరద్ఘనే చంద్రమివ స్ఫురంతమ్

దిశంతు మే దేవ! సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షా:

శ్రోత్రేషు పుసామమృతం క్షరంతీం, సరస్వతీం సంశ్రితకామధేనుమ్

 

విశేష విత్పారిషదేషు నాథ! విదర్గ్ధగోష్టీ సమరాంగనేషు

జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాం:

 

త్వాం చింతయంస్త్వన్మయతాం ప్రసన్నస్త్వాముద్గ్రణన్ శబ్దమయేన ధామ్నా,

స్వామిన్ సమాజేషు సమేధిషీయ స్వచ్ఛందవాదావాహబద్దశూర:

 

నానావఇధానామగతి: కలానాం న చాపి తీర్ధేషు కృతావతార:

ధ్రువంతవానాథ పరిగ్రహాయా: నవం నవం పాత్రమిదం దయాయా:

అకంనీయాన్యపనీతిభేదాయ్రలంకృషీరన్ హృదయం మదీయమ్,

శంకాకళంకాపగమోజ్జ్వలాని తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్

 

వ్యాక్యాముద్రాం కరసరసిజై: పుస్తకం శంఖచక్రే

బఇభ్రద్భిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణ:

ఆమ్లానశ్రీ రమృత విశదైరంశుభి: ప్లావయన్మా

మావిర్భూయాదనఘమహిమా మానసే వాగదీశః