Read more!

సకల ఐశ్వర్య ప్రదాయిని లలితా త్రిపుర సుందరి

 



త్రిపురత్రయంలో రెండవ శక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె అత్యంత ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ అమ్మవారు.  పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని భక్తితో ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈ తల్లి. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తారు. దారిద్ర్య దుఃఖాలను తొలిగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈ తల్లి సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి.