సరస్వతి అలంకార దర్శనం మహాభాగ్యం

 


దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ద షష్టి, మూలా నక్షత్రం నాడు అమ్మవారిని శ్రీసరస్వతిదేవిగా ఆలంకరిస్తారు. మూలా నక్షత్రం అంటే అది అమ్మవారి జన్మనక్షత్రం. చదువుల తల్లి ఈ సరస్వతి దేవి. మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఈ సరస్వతి దేవి.  ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా శుంభనిశుంభులనే రాక్షసుల్ని వధించింది. దానికి చిహ్నంగా అమ్మవారిని సరస్వతిదేవిలా అలంకరిస్తారు. సరస్వతీ అలంకారంలో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తులు భావిస్తారు.